Suryaa.co.in

Political News Telangana

పల్లెకు పోయి జీవం పోసి…పల్లె భారతానికి పట్టం!

– రాష్ట్రం ఒక యూనిట్‌గా గ్రామ స్వరాజ్యం
– రూ. లక్ష కోట్ల నిధులు
– నగర సౌకర్యాలన్నీ పల్లె ముంగిటకే
(కమల్‌గౌడ్)
దేశ చరిత్రలో కేసీఆర్‌ మాదిరిగా పల్లె భారతానికి పట్టం కట్టిన నాయకుడు మరెవరూ ఉండరు. అన్నా హజారే ప్రయోగం కూడా రాలేగావ్‌ సిద్ధి గ్రామానికే పరిమితమైంది. కానీ ఇంత విస్తృత స్థాయిలో పల్లె జీవనంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. రాష్ట్రం ఒక యూనిట్‌గా గ్రామ స్వరాజ్యం నెలకొల్పే ప్రయోగం చేయడం ఇదే ప్రథమం.
ప్రతి ఏటా గ్రామాలకు దాదాపు లక్ష కోట్ల రూపాయలను ప్రవహింప చేసి, గ్రామీణ విప్లవానికి బీజం వేశారు. వ్యవసాయం, నీటిపారుదల రంగం, చెరువుల పునరుద్ధరణ, గొర్రెలు, చేపలు పంపిణీ చేయడం, ఆసరా పింఛన్లు ఇవ్వడం- ఇటువంటి పథకాలు వేటికవే సాటి. పల్లెను యూనిట్‌గా తీసుకొని ప్రజాస్వామ్య సంస్కృతిని, సమర్థ పాలనా వ్యవస్థను, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడం వల్ల అనేక విప్లవాలు ఏకకాలంలో సాధించినట్టవుతున్నది.
హరిత హారం, సామాజిక తనిఖీ వంటి అనేక ఆదర్శవంతమైన పథకాలను గ్రామస్థాయిలో అమలు చేయడం కేసీఆర్‌ ఘనత. కరెంటు, మంచినీళ్ళు, రహదారులు ఒకటేమిటి నగరాలలో ఉండే సౌకర్యాలన్నీ పల్లెల్లో లభిస్తున్నాయి. జిల్లా కేంద్రాలు దగ్గరవడం కూడా పల్లె వాసులకు ఎంతో సౌకర్యంగా ఉన్నది. అందుకనే, ఇవాళ జనం పల్లెలకు వలస పోయే అద్భుతం జరుగుతున్నది. తెలంగాణ గ్రామాలను ప్రపంచమంతా ఆశ్చర్యంగా గమనిస్తున్నది.
భగవంతుడి ముందు, సంస్కృతి ముందు మనమెంత? సింధువులో బిందువులాంటి వాళ్లం. సంస్కృతికి ఉన్న శక్తి తెల్వని వాళ్లు యాంత్రికంగా మాట్లాడతరు. జో అచ్యుతా నంద జోజో ముకుందా.. అంటాం తప్ప జో రావణా,
జో దుర్యోధనా అని మనం పాడం కదా.

LEAVE A RESPONSE