ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆంజనేయస్వామి గుడి కూల్చివేత

-ఆగ్రహించిన స్థానికులు.
– ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా ఆంజనేయస్వామి గుడి పూర్తిగా నేలమట్టం
– నీలమణి దుర్గ అమ్మవారి గుడికి కొంతమేర కూల్చివేత
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామం లో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా స్థానిక పెట్రోల్ బంకు వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడికి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా కూల్చివేశారు. స్థానికులు విగ్రహాన్ని రక్షించుకుందాం అన్న సమయం ఇవ్వకుండా గుడిని పూర్తిగా కూల్చివేసి ప్రక్కనే ఉన్న నూతిలో విగ్రహాలను పూడ్చి వేశారు.


దీంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గుడినే నమ్ముకున్న పూజారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గుడినే జీవనాధారంగా బతుకుతున్న తమకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే ఉన్న నీలమణి దుర్గగుడి కాలనీ ప్రజలు రోజు ఎంతో దైవంగా కొలిచే ఆంజనేయ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో అధికారుల పైన,స్థానిక ఎమ్మెల్యే పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం, ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎంతో దైవంగా కొలిచే శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి గుడికి సైతం సగ భాగం విస్తరణలో ధ్వంసం చేశారు. దీంతో స్థానిక ప్రజలు ఎంతో దైవంగా కొలిచే నేరం దుర్గమ్మ వారి గుడి ని సైతం ధ్వంసం చేయడంతో ఆగ్రహానికి గురయ్యారు.

Leave a Reply