కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

– వీ6 ఛానల్ ను బ్యాన్ చేస్తే జనం ఉరికించి తంతారు
– తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ బ్యాన్ చేసే రోజులు రాబోతున్నయ్
– బీఆర్ఎస్ కొనసాగేది మరో 3, 4 నెలలే
– కేసీఆర్ లో భయం మొదలైంది
– సంతాప సభను తలపించిన బీఆర్ఎస్ నేతల సమావేశం
– ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారు?
– టీఎన్జీవో లీడర్లు సీఎం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేటోళ్లు
– టీఎన్జీవో నాయకుల చిట్టా తీస్తున్నా…
– ఏవీఎన్ రెడ్డి గెలవకపోతే కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కుతుంది
– బీజేపీ అధికారంలోకి రాగానే ఫస్ట్ తేదీనే జీతాలిస్తాం… పీఆర్సీ వేస్తాం
– డీఏలిస్తాం… బదిలీలు, ప్రమోషన్లు ఇస్తాం..
– టీచర్లు ఇచ్చే తీర్పుపైనే తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంది
– కేసీఆర్ సర్కార్ కు గుణపాఠం చెప్పండి
– కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న టీఎన్జీవో సంఘాల నాయకుల చిట్టా విప్పుతాం
– నాకు ఆస్తుల్లేవు… వ్యాపారాల్లేవు… ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా
– తెలంగాణ సెంటిమెంట్ పేరుతో రెచ్చగొట్టేందుకు కేసీఆర్ కుట్ర
– కేసీఆర్ కు అభివృద్ధి పై ఎన్నికల్లోకి వెళ్లే దమ్ముందా?
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

‘‘ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశం సంతాప సభను తలపించింది. కేసీఆర్ ముఖంలో భయం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అయ్యింది. తప్పు చేసినోళ్ల సంగతి తేలుస్తాం ’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది మరో 3, 4 నెలలేనని, ఆ తరువాత అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఉద్యోగులకు ఫస్ట్ తేదీన జీతాలిస్తాం… నెలరోజుల్లో డీఏలను చెల్లిస్తాం. వెంటనే పీఆర్సీని నియమించి అమలు చేస్తాం. ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ బదిలీలు, ప్రమోషన్లు ఇస్తాం’’అని ప్రకటించారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు టీచర్ల, ఉద్యోగుల సమస్యలు ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. టీఎన్జీవో నాయకుల చిట్టా తీస్తున్నామని, బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తామని హెచ్చరించారు.

మహబూబ్ నగర్ లోని సుదర్శన్ ఫంక్షన్ హాలులో జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ –రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ – అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ తోపాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపి జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే డోకూరు పవన్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు నాగూరావు నామోజీ, రతన్ పాండురంగారెడ్డి, శ్రీనివాస్, రాజవర్దన్ రెడ్డి, సునీల్, హన్మంతరావు సహా పలువురు తపస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…..

భారతమాతాకీ జై అంటే కూడా మతతత్వవాదులని ముద్రవేసే దుస్థితి తెలంగాణలో నెలకొంది.13న జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డిని గెలిపించాలి. ఏ సర్వే చూసినా బీజేపీ బలపర్చిన ఏవీఎన్ రెడ్డి గెలుస్తారని నివేదికలు వస్తున్నాయి. టీచర్ ఎన్నికలు ఈ ప్రాంతానికే పరిమితం కాదు… తెలంగాణ ప్రజల భవిష్యత్ ను నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయి.

టీఎన్జీవో లీడర్లు సీఎం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేటోళ్లు…మోసం చేసే టీఎన్జీవో లీడర్లను పక్కా తిడతా.. నాకు పైసల్లేవు.. వ్యాపారాల్లేవు.. ప్రజల కోసం పనిచేస్తా… నన్ను కెలికి లీడర్ల సంగతి చూస్తా… ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారు? టీచర్ల, ఉద్యోగుల సమస్యలు ఎందుకు ప్రస్తావించరు? టీఏ, డీఏలు, బదిలీలు, ప్రమోషన్ల, 317 జీవోపైనా, రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్లపై ఎందుకు చర్చించలేదు? టీఎన్జీవో నాయకుల చిట్టా తీస్తున్నా… వచ్చేది బీజేపీ ప్రభుత్వమే… అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తా..

317 జీవోపై పోరాడితే పోలీసులు నా ఆఫీస్ ను ధ్వంసం చేశారు.. కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ వదిలారు. నాతోపాటు కార్యకర్తలందరినీ జైళ్లో వేశారు.. ఏ ఉపాధ్యాయ సంఘం కూడా కనీసం మద్దతివ్వలేదు. అయినా మేం వెనుకాడలేదు.. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం పోరాటం చేశాం.
బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ తేదీన జీతాలిస్తాం… నెల రోజుల్లో డీఏలన్నీ చెల్లిస్తాం… పీఆర్సీని ప్రకటిస్తాం… భాషా పండిట్ల సమస్యను పరిష్కరిస్తాం… ప్రైవేట్ అధ్యాపకులకు న్యాయం చేస్తాం.
ఏవీఎన్ రెడ్డి గెలవకపోతే ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకపోయినా, డీఏలు ఇవ్వకపోయినా, బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వకపోయినా టీచర్లు అంగీకరించినట్లేనని కేసీఆర్ భావించి మరింతగా ఇబ్బంది పెడతారు.
ఉపాధ్యాయులకు జీతాలురావు, డీఏలు రావు, బదిలీలు, ప్రమోషన్లే లేవు. కష్టపడి సంపాదించుకున్న జీపీఎఫ్ సొమ్ము డ్రా చేసుకోవాలన్నా 6 శాతం కమీషన్ ఇవ్వాల్సిన దుస్తితి.

317 జీవో పేరుతో పనిచేసే చోట టీచర్లను నాన్ లోకల్ గా మార్చారు.టీచర్లు మూడో కన్ను తెరిస్తే ప్రభుత్వాలే ఔట్ అవుతాయి. ఎన్టీఆర్ హయాంలో ఇదే జరిగింది.కేబినెట్ సమావేశంలో పీఆర్సీపై చర్చలేదు. టీచర్ల ఊసే లేదు..

తెలంగాణ ప్రజలంతా మీరిచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.
ఏవీఎన్ రెడ్డి గెలవకపోతే కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కుతుంది. కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్ సంతాప సభను తలపించింది. కేసీఆర్ లో భయం మొదలైంది… బిస్తర్ సర్దుకుంటున్నడు. రాత్రింబవళ్లు తాగుతున్నడు.
టీఆర్ఎస్ గెలవడం సాధ్యం కాదని తెలిసే బీఆర్ఎస్ పేరుతో కొత్త దుకాణం తెరిచారు.
దొంగ దందాలు చేసే కేసీఆర్ బిడ్డ దీక్ష చేస్తే ఏమనాలి? ఆమె ఎవరి కోసం దీక్ష చేసింది? దొంగ సారా దందా చేసినామే రద్రమదేవి, ఝాన్సీలక్ష్మీబాయి లెక్క దీక్ష చేస్తదట.

దొంగ సారా దందాకు రూ.100 కోట్లు కేసీఆర్ బిడ్డకు ఎక్కడి నుండి వచ్చాయితెలంగాణ ఉద్యమానికి ముందు సొంత ఇల్లే లేదని చెప్పిన వాళ్లు ఈరోజు ఇంద్రభవనాల్లో ఎట్లా ఉంటున్నారు? ఉద్యమ సమయంలో ఫైనాన్స్ పై కారు, ప్రచార రథం తీసుకున్న కేసీఆర్ కు వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి. తెలంగాణ….తెలంగాణ అని ఓట్లు గుద్దితే… సర్వనాశనం చేసిన దుర్మార్గుడు కేసీఆర్.

దొంగ దందా సొమ్ముతో ప్రజలకు సంబంధం ఏముంది? నిరుద్యోగ భ్రుతి, డబుల్ బెడ్రూం ఇండ్లు, రుణమాఫీ, దళిత బంధు సొమ్ము ఇవ్వడానికేమైనా దొంగ దందా చేస్తున్నావా?దొంగ సారా దందాతో వేల కోట్లు సంపాదించి దుబాయ్, మస్కట్ లో దాచి పెడుతున్నారు.

బీఆర్ఎస్ ఉండేది ఇంకా 3, 4 నెలలే… ఈ విషయం తెలిసే కేసీఆర్ బిస్తర్ సర్దిపెట్టుకున్నరు. ఏం చేయాలో తెలియక రాత్రింబవళ్లు తాగుతూనే ఉన్నరు.దేశంలోని సీఎంలందరి షెడ్యూల్ వస్తది.. కానీ కేసీఆర్ కు షెడ్యూల్ ఉండదు.. ఎందుకంటే ఫాంహౌజ్, ప్రగతి భవన్ కే పరిమితమైన నేత కేసీఆర్.
ప్రగతి భవన్, ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన పార్టీ బీజేపీ.టీఆర్ఎస్ ను రద్దు చేసి బీఆర్ఎస్ పెట్టి ఊరూరా తిరిగేలా చేసిన పార్టీ బీజేపీ. బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంట్… బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సమానం.బీఆర్ఎస్ లోకి వచ్చేవాళ్లంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ లీడర్లే…
కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్న ఘనుడు కేసీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివ్రుద్ధి పనులన్నీ కేంద్రం ఇస్తున్న నిధులతో నడిచేవే.కరోనాతో ప్రపంచమంతా వణికిపోయినా ఆర్దికంగా భారత్ ను సుస్థిరంగా ఉంచిన ఘనత మోదీదే.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నెంబర్ వన్ స్థానానికి చేరుకోనున్న భారత్.
తెలంగాణలోనూ ప్రజల బతుకులు బాగుపడాలంటే బీజేపీని గెలిపించండి. కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే… సీఎం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం సిగ్గు చేటు. తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిలించి లబ్ది పొందేందుకు కేసీఆర్ కుట్ర. కేసీఆర్ కు చేసిన అభివృద్ధి పై ఎన్నికల్లోకి వెళ్లే దమ్ముందా? తెలంగాణ ప్రజల భవిష్యత్తు టీచర్లు ఇచ్చే తీర్పుపైనా ఆధారపడి ఉంది.

కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అయ్యింది. కవిత అంటే కవిత్వం అనుకున్నా… కానీ కవిత అంటే మద్యం అని తెలిసింది. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
వీ6 ఛానల్ ను రద్దు చేస్తారట… దమ్ముంటే రద్దు చేయ్ బిడ్డా… నీ సంగతి చూస్తా… గతంలో ఏబీఎన్, టీవీ9 ను బ్యాన్ చేస్తే ప్రజలంతా వ్యతిరేకించారు. ఈసారి వీ6 ను రద్దు చేస్తే తెలంగాణ ప్రజలంతా రోడ్డు మీదకు ఎక్కి బీఆర్ఎస్ నేతలను ఉరికించి కొడతారు.. నీ ప్రభుత్వాన్ని రద్దు చేసే రోజులు రాబోతున్నయ్. తప్పు చేసినోళ్లను సీబీఐ, ఈడీ వదిలిపెట్టదు. బొట్టు పెట్టి ‌పిలవదు. గుంజుకుపోయి జైల్లో వేస్తది. వాటితో బీజేపీకి సంబంధం లేదు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ….
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్ధిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.స్కూళ్లలో అనేక సమస్యలున్నాయి. స్కూళ్లలో స్వీపర్లు లేరు…చాక్ పీస్ లకు డబ్బుల్లేవు. కనీస సౌకర్యాల్లేవు.

జేఏసీలోని నలుగురి నాయకులను ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుని ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తోంది.యూనివర్శిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు.
పాలమూరుసహా అన్ని వర్శిటీల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులతోనే నడిపిస్తున్నారే తప్ప 10 శాతం కూడా రెగ్యులర్ ఉద్యోగులు లేరు.

కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తానని కేసీఆర్ హామీ ఏమైంది?317 జీవోను సవరించాలని బండి సంజయ్ మీ తరపున పెద్ద ఎత్తున పోరాడి జైలుకు వెళ్లారు.ఏ ఆకాంక్షతో తెలంగాణ నెరవేర్చుకున్నారో… ఆ ఆకాంక్షల సాధన కోసం బీజేపీ పోరాడుతోంది.టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఏవీఎన్ రెడ్డిని యూనియన్లకు అతీతంగా భారీ మెజారిటీతో గెలిపించండి.బీఆర్ఎస్ కు రెండు సార్లు అవకాశమిస్తే తెలంగాణ మొత్తాన్ని దోచుకున్నారు… భారత్ ను విశ్వగురు స్థానంల్ నిలబెట్టేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న క్రుషికి అండగా నిలవాలి.

జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి …..
తెలంగాణ వస్తే బంగారు బతుకులవుతాయని, మహిళల మెడలో బంగారు చైన్లు ఉంటాయని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు ఆ పరిస్థితి లేదు కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం కాళ్లకు కూడా బంగార గొలుసు వేసుకుంటున్నారు.

మీ తరపున నిరంతరం గళం విప్పే అభ్యర్ధిగా ఏవీఎల్ఎన్ రెడ్డిని నిలబెట్టాం. ఆయనకే ఓటేసి గెలిపించండి.ఓటేసే వాళ్లంతా పంతుళ్లే… మీరే తప్పు చేస్తే ఎంత చెడ్డగా ఉంటదో, విద్యార్థుల్లో ఎంతగా చులకన అవుతారో ఆలోచించండి.

రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్ …..
317జీవోకు వ్యతిరేకంగా టీచర్ల తరపున పోరాడి జైలుకు వెళ్లిన నేత బండి సంజయ్. టీచర్లకు విలువ లేకుండా దుర్మార్గుడు కేసీఆర్.టీ జీపీఎఫ్ లో కూడా కమీషన్లు తీసుకుంటున్న మోసగాడు కేసీఆర్. బీజేపీ గెలుపు ఖాయమని అర్ధమై ఎవరినైనా గెలిపించండి కానీ బీజేపీని మాత్రం ఓడించాలని కుట్రలు చేస్తున్నారు.

 

Leave a Reply