– జగనే ఎందుకు కావాలంటే? అనే పుస్తకంపై చర్చించేందకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
– డబ్బులు నలుగురు పెద్ద రెడ్ల జెబుల్లోకి వెళ్ళాయి
– తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి డా.దాసరి శ్యామ్ చంద్ర శేషు
అబద్ధం, మోసం అనేవి జగన్ రెడ్డికి రెండు కళ్ళు. చేసే ప్రతీ పనిలో మోసం, మాట్లాడే ప్రతీ మాటలో అబద్ధం ఉంటుందని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి డా.దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్యామ్ చంద్ర మాట్లాడుతూ.. అబద్ధాలు లేని అభివృద్ధి లేదు. గ్రాఫిక్స్ లేని సభ లేదు. పరదా లేని పర్యటన లేదు. బూతు లేని మాట లేదు. అప్పు లేని మంగళవారం లేదు. జగన్ పాలన ఎప్పుడు పోతుందని ఎదురు చూడని ఓటరు లేడు, ఆఖరికి పులింవెందులకు కూడా పరదాలు కట్టుకొని పర్యటన చేయాల్సిన దుస్థితి జగన్ రెడ్డికి వచ్చిందని ఆయన విమర్శించారు.
“వాలంటీర్లు, స్థానికి వైకాపా నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే? అనే పుస్తకాన్ని జగన్ రెడ్డి పంపిణీ చేయిస్తున్నాడు. ఆ పుస్తకంలో సంక్షేమం, పరిపాలన జగన్ రెడ్డి వల్లే సాధ్యమన్నట్లు పెద్ద పెద్ద రాతలు రాసుకొని మాట తప్పం, మడమ తిప్పం అని ప్రచురించారు. రాష్ట్రానికి జగర్ రెడ్డి చేసిన అభివృద్ధి, అమలు చేసిన హామీలు సూన్యం. ఈ పుస్తకంలో ప్రచురించినవన్నీ పచ్చి అబద్ధాలు.
2019 నుంచి ఇప్పటివరకు 18 పరిశ్రమలు, 9 వేల ఉద్యోగాలు వచ్చాయని ఆర్టీఐ సమాచారం చెబుతోంది. దీనికి జగన్ రెడ్డి అయినా, కోడి గుడ్డు మంత్రి అయినా, సకల శాఖా మంత్రి సజ్జల అయినా ఎవరిపైన అయినా మేము సిద్ధం.
రూ.1000 దాటిన పేషంట్లకు ఆరోగ్యశ్రీ అమలు అయిన పరిస్థితులు లేవు. మార్చి 18 లోపు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ నిలిపివేస్తామని నెట్వర్కింగ్ ఆసుపత్రిలు నోటీసులు ఇచ్చారు. ఐదేళ్ళలో దాదాపు 10 సార్లు వాళ్ళు నోటీసులు ఇచ్చారు. కానీ వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీపై ఇంత నిసుగ్గుగా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మంటలంలో పులపాకల ప్రభాకర్ అనే దళిత వ్యక్తికి పొలం లేకుండా రైతు భరోసా ఇచ్చినట్లు వాలంటీరు పాంప్లెట్ ఇచ్చారు. అతనికి అసలు పొలమే లేదు, బ్యాంకులో డబ్బులు పడిందే లేదు. కానీ 52 లక్షల మందికి రూ.31 వేల కోట్లు లబ్దీ చేకూర్చామని నిసిగ్గుగా చెప్పుకుంటున్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే, మీరు చెప్తున్న లెక్కల్లో బొక్కలు ఏమి లేకనుకుంటే చర్చకు సిద్ధమా?
రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ లాగా సభల్లో గ్రీన్ మాట్ వేసి జనం లేకపోయినా జనం ఉన్నట్లు ప్రజలను మభ్య పెడుతున్నారు. పట్టుమని లక్ష ఇళ్లు కట్టామని నిరూపిస్తే ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకూ పనికి రాని పట్టాలు ఇచ్చి మోసం చేశారు. 2019-20లో 40 లక్షల మందికి, 2020-21లో 44 లక్షల మందికి అమ్మ ఒడి ఇచ్చారు. 2021-22లో అసలు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 2022-23లో 43 లక్షల మందికి, 2023-24 నాటికి 42 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చారు.
నా కుమారుడు ఎల్‌కేజీ చదువుతున్నాడు. అసలు అమ్మ ఒడికి నా కుమారుడు అర్హత లేదు. కానీ మాకు జగనన్న విద్య దీవెన కింద రూ.7,500 ఇచ్చామని వాలంటీర్ చెబుతున్నాడు. ఆ డబ్బులు ఎవుడు తిన్నాడు? వాలంటీరు సమాధానం చెప్పలేదు. దీనిపై సమాధానం చెప్పే బాధ్యత జగన్ రెడ్డిపై ఉంది. నా భార్య ఎక్కడా డ్రాక్రా సంఘంలో లేదు. కానీ వైఎస్ఆర్ సున్న వడ్డీ కింద రూ. 1,574 ఇచ్చినట్లు ఉంది. వైఎస్ఆర్ ఆసరా కింద రూ.16,292 ఇచ్చినట్లు వాలంటీర్ ఇచ్చిన పాంప్లెట్ లో ఉంది. ఆసరా లేదు బాసర లేదు అదో పెద్ద టోకరా అని మొదటి నుంచి మేము చెబుతూనే ఉన్నాం.
ఒక్క మా ఇంటిలోనే ఒక్క రూపాయి ఇవ్వకుండానే రూ.25,365 ఇచ్చినట్లు చెబుతున్నారు. రైతులు బ్రతుకులతో ఆడుకుంటూ రైతులకు సంక్షేమాన్ని ఇస్తున్నామని అబద్ధం చెబుతున్నారు. చంద్రబాబు పరిపాలనలో ఆయన పాలసీల ద్వారా వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌ని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. నిరుద్యోగిత రేటును పెంచేశారు. ఉద్యోగాల భర్తీలు చేయకుండా గంజాయి, డ్రగ్స్ లకు యువతను బానిసలుగా చేశారు. అయినా నాకు ఒక కల ఉందని ఫ్లెక్సీలు వేసుకుంటున్నాడు. మొసం చేసి ప్రజలను ముంచేయడమే జగన్ రెడ్డి కల. రాష్ట్రాన్ని నాశనం చేసింది సరిపోక ఇంకా కల ఉందంటున్నాడు.
ఐదేళ్ళలో జగన్ రెడ్డి చేసిన ఖర్చు రూ.20 లక్షల కోట్లని గప్పాలు చెప్పుకుంటున్నారు. ఇందులో 2.62 లక్షల కోట్లు డీబీటీ ద్వారా సంక్షేమం చేశాను అంటున్నాడు. మిగిలిన 17.5 లక్షల కోట్లు ఎవడు మింగేశాడు. రోడ్లు వేయలేదు, కట్టడాలు లేవు, కార్పొరేషన్ నిధులు లేవు కానీ నిధులు ఎమయ్యాయో తెలియదు. ఈ డబ్బులు నలుగురు పెద్ద రెడ్ల జెబుల్లోకి వెళ్ళాయి.
రానున్న ఎన్నికల్లో కూటమి గెలవబోతుంది. దాని కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధం సిద్ధమంటూ జగన్ రెడ్డి ఊదరగొడుతున్నాడు. మీరు చేస్తున్న పచ్చి మోసాలపై చర్చిందేంకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నమ్మే ఏ చర్చి వద్దకు చర్చకు రమ్మన్నా నేను వస్తాను మీరు సిద్ధమా?” అని సవాల్ చేశారు.