కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్‌ ఒక్కటే

-రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తా
– ఆ జాబితాపై సమాధానం చెప్పిన తర్వాతే బీజేపీపై విమర్శలు చేయాలి

– ప్రధాని మోడీపై ఎలాంటి అవినీతి మరక లేదు
– కుటుంబ పార్టీలతో ఎప్పటికీ ప్రజా శ్రేయస్సు సాధ్యం కాదు
– సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

రానున్న ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ బీజేపీ కార్యక్రమాలు, విజయాలను తెలపాలి. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ స్థానాలు బీజేపీ దక్కించుకుంటుంది. దేశంలో మోదీ, మోదీ అని యువత నినదిస్తోంది. మళ్లీ మోదీనే ప్రధాని చేస్తామని మహిళలంతా అంటున్నారు.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే కు 400 సీట్లు దాటతాయి. అందులో, తెలంగాణ నుంచి 12కు పైగా ఉండాలి. తెలంగాణ ప్రజల మద్దతుతో ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తాం. అవినీతి రహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా, మోదీజీ గత పదేళ్లుగా సుస్థిర పరిపాలన అందించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలపై లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి.. కానీ, ప్రధాని మోడీపై ఎలాంటి అవినీతి మరక లేదు.

మోదీ మరోసారి ప్రధానిగా వస్తే, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దుతారు. అన్ని రంగాల్లో ఇండియా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్ల పాలనలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. దేశ ప్రజలు 500 ఏళ్లుగా ఎదురుచూసిన రామమందిరాన్ని నిర్మించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్‌ ఒక్కటే. ఆ మూడు పార్టీలు వారసత్వ పార్టీలే. మజ్లిస్‌ అజెండాతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నాయి. ఆ మూడు పార్టీల జెండాలు వేరైనా.. అజెండా ఒక్కటే

ఎంఐఎం చేతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కీలుబొమ్మలు. కుటుంబ పార్టీలతో ఎప్పటికీ ప్రజా శ్రేయస్సు సాధ్యం కాదు. వారి కుటుంబాల అభివృద్ధి కోసం ఎంతటి అవినీతికైనా సిద్ధపడతాయి. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తా.. ఆ జాబితాపై సమాధానం చెప్పిన తర్వాతే బీజేపీ పై విమర్శలు చేయాలి. యురి ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. పది రోజుల్లోనే పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్‌ చేసి ముష్కరులను మట్టుబెట్టాం. భారత సైనికులపై దాడిని మర్చిపోయేందుకు ఇది మన్మోహన్‌ ప్రభుత్వం కాదు.

Leave a Reply