అధ్యక్షుడిగా డాక్టర్ రాజ్ శరణ్ సాహి
ప్రధాన కార్యదర్శిగా యాజ్ఞవల్క శుక్లా
అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ నూతన జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఉత్తర ప్రదేశ్కు చెందిన డాక్టర్ రాజ్ శరణ్ సాహి , ఝార్ఖండ్ కు చెందిన యాజ్ఞవల్క శుక్లా ఎంపికైనారు.ఈమేరకు రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరుగుతున్నా ఏ బి వి పి 68 వ జాతీయ మహాసభల్లో వీరు భాద్యతలు స్వీకరించారు. ఏడాది పాటు వీరు ఈ భాద్యతలలో కొనసాగుతారు. జైపూర్లో మూడురోజులపాటు జరగనున్న ఈ జాతీయ మహాసభలను ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా శుక్రవారం నాడు ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలనుంచి ఎంపిక చేసిన 1500 ప్రతినిధలు హాజరైనా ఈ సభలలో తెలుగు రాష్ట్రాలనుండి 150 మంది హాజరైన్నారు. విద్యా,రాజకీయ,సామజిక అంశాలపై చర్చలు అంతరం పలు తీర్మానాలను ఈ మహాసభలలో చేయనున్నారు.