ఎంఎల్ ఏ కోటా నుంచి శాసనమండలి సభ్యులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్దులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం ప్రకటించారు.తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయఅధ్యక్షులు,ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముగ్గురు అభ్యర్దులను ఖరారు చేశారని వెల్లడించారు.
ముగ్గురు అభ్యర్దులుగా….
1.ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి మాజి డిసిసిబి ఛైర్మన్,తూర్పుకాపు సామాజిక వర్గం నుంచి పాలవలస విక్రాంత్.
2.గతంలో మైనారిటీలకు శ్రీ వైయస్ జగన్ గారు ఇచ్చిన హామీ మేరకు నంద్యాల నుంచి ప్రస్తుత మార్కెట్ యార్డు ఛైర్మన్ గా ఉన్న ఇషాక్.
3.వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ కు చెందిన మాజి ఎంఎల్సి డిసి గోవిందరెడ్డి పేర్లను ఖరారు చేశారు.
అదే విధంగా స్ధానిక సంస్ధలనుంచి శాసనమండలి స్ధానాలకు పోటిచేయనున్న 11 మంది అభ్యర్దులను కూడా రెండు రోజులలో ఖరారు చేయడం జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలియచేసారు. వివిధ సామాజిక సమీకరణలు,సామాజిక న్యాయం పాటిస్తూ నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఎంఎల్ ఏ కోటా,స్దానికసంస్దల నుంచి మొత్తం 14 మంది శాసనమండలి అభ్యర్దుల ఎంపికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 50 శాతం బిసి ఎస్సి మైనారిటీలకు ఉండే విధంగా నిర్ణయం ఉంటుందని తెలియచేసారు. అన్ని ఎన్నికలలో కూడా ఈ ఏభై శాతం విధానాన్ని ఫాలో అవుతున్నట్లు చెప్పారు. ఇదే విధానాన్ని పాటిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభ్యర్దులను ఖరారు చేస్తారని అన్నారు. ఇప్పటికే శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న 18 మంది సభ్యులలో 11 మంది బిసి,ఎస్సి,మైనారిటీలు ఉన్నారని వివరించారు.
సెక్రటేరియట్ లో ఉద్యోగ సంఘాల నేతలు పిఆర్సి విషయంలో ఆందోళన చేపట్టారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. పిఆర్సి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉద్యోగసంఘాల నేతలు అధికారులతోను,మాతోను చర్చించారు.ప్రాసెస్ స్టార్ట్ అయింది.బహుశా సిఎస్ తో మాట్లాడేందుకు ఉద్యోగ సంఘాలనేతలు ఎదురు చూస్తున్నారని మాకు తెలిసింది అని అన్నారు.