-రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించండి
-ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి
-చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు
-ప్రైవేట్ టీచర్లు, సిబ్బందితో సమావేశం
-పాల్గొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, యరపతినేని శ్రీనివాసరావు
ప్రస్తుతం జరగబోతున్న ఎన్నికలే రాష్ట్ర యువత భవితను నిర్ధేంచబోతున్నాయని, రాష్ట్రానికి, యువతకు ఎవరు మేలు చేస్తారో ప్రజలంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ప్రత్తిపాటి మాట్లాడుతూ సరైన పాలకులు లేకపోతే యువత చదువులు నిరర్థకంగా మారతాయని, అందుకు జగన్ పాలనే ఉదాహరణ అని హెచ్చరించారు. సీఎం జగన్ వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చారని… అదే చంద్రబాబు ఉంటే ఐటీ ఉద్యోగాలు వచ్చేవన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పూర్తి అసంతృప్తిగా ఉన్నాయన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, ఏటా డీఎస్సీ, క్రమం తప్పకుండా జాబ్ నోటిఫికేష న్లు రావాలన్నా కూటమి వస్తేనే సాధ్యమన్నారు. పోలవరం పూర్తయి 26 జిల్లాలకు తాగు, సాగు నీటితో పాటు పరిశ్రమలకు నీరు ఇవ్వొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. చిలకలూరిపేటను అన్నివిధాలుగా అభివృద్ధి చేసిన తనతో పాటు ఉన్నతమైన విద్యాసంస్థను నిర్వహిస్తోన్న లావు శ్రీకృష్ణదేవరాయలును గెలిపించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అభివృద్ధి, పరిపాలన, భవిష్యత్తును కోరుకునే ప్రైవేట్ ఉపాధ్యాయు లు, అధ్యాపకులు ఆలోచించి ఓటు వేసి మరో పది మందితో ఓటు వేయించాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సమాజంలోని మిగిలిన వ్యక్తులు కూడా వారి వెంట నడుస్తారని అన్నారు. ఈ ఐదేళ్లలో చిలకలూరిపేటకు ఏం అభివృద్ధి జరిగింది? నరసరావుపేట ఎంపీగా తానేం చేశాను? అనేది కూడా చూడాలన్నారు. అభివృద్ధి నిధులు తీసుకురావడం ఒక ఎత్తయిత వాటికి మించి అభ్యర్థి ప్రవర్తన కూడా చూడాలని కోరారు. నిజాయతీగా ఉన్నారా…అందుబాటులో ఉంటున్నారా… పనులు చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా అనేవి పరిగణ నలోకి తీసుకుని ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి, తమ ప్రాంతానికి ఎవరైతే మంచి చేస్తారని నమ్ముతా రో వారిని బలపరచాలని సూచించారు.
గురజాల అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో పాటు పిల్లల భవిష్యత్తుకు సంబంధించినవని పునరుద్ఘాటించారు. సైకో జగన్ పాలనలో ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని.. విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన జగన్ అసలు సీఎం పదవికి అనర్హుడన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు గాలికొదిలేసి సొంత ప్రయోజనాలే అజెండాగా పాలన సాగించి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని దుయ్యబట్టారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ఎంపీ అభ్యర్థి లావు, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతు నిలవాలని పిలుపునిచ్చారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎంత మెజార్టీతో ప్రత్తిపాటి గెలవబో తున్నారన్నదే లెక్కపెట్టుకోవాలి గానీ గెలుపుపై ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. పల్నాడు జిల్లాలో ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా లావు శ్రీకృష్ణదేవరాయలును 2 లక్షల మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.