Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకు నేనే డ్రైవర్ అవుతా

-ట్రెండ్ మారింది.. జగన్ రెడ్డి బెండు తీయడం తథ్యం
-విధ్వంసకారుడి పనితీరుకు ఐదేళ్ల అరాచక పాలన నిదర్శనం
-శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి కలిపి టెంపుల్ టూరిజం అభివృద్ధికి పునాదులేశాను
-ఎర్రచందనం స్మగ్లర్లపై టీడీపీ ఉక్కుపాదం మోపితే…జగన్ రెడ్డి టికెట్లు ఇచ్చాడు
-సామాజికాభివృద్ధి టీడీపీ మార్క్.. స్కీము స్కీమునా జగన్ రెడ్డి స్కాము మార్క్
-శ్రీకాళహస్తిలో జరిగిన అభివృద్ధే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పనితీరుకు నిదర్శనం
-ఆస్తి కోసం ఒక చెల్లిని, న్యాయం అడిగినందుకు మరో చెల్లిని తరిమేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి
-మనం పరిశ్రమలు తెస్తే.. బియ్యం రెడ్డి కమీషన్లు దండుకుంటున్నాడు
-శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

శ్రీకాళహస్తి : జగన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి, ఎన్డీఏను గెలిపించడానికి ప్రజలంతా సిద్ధమైపోయారు. ఎవరైనా ప్రజల కోసం పని చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారనడానికి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ప్రత్యక్ష నిదర్శనం. బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో దశాబ్దాల అనుబంధం ఉంది. తొలి రోజు నుండీ.. తుది శ్వాస విడిచే వరకు ఆయన పనితీరు సదాస్మరణీయం.

రాజకీయాలు చాలా మారిపోయాయి. ఒకప్పుడు ప్రజల్ని ప్రేమించేవారు రాజకీయాల్లో ఉండేవారు. ఇప్పుడు గుడిని గుడిలో లింగాన్ని మింగేసే వారు రాజకీయాల్లోకి వచ్చారు. కమిషన్లు, కబ్జాలు, వసూళ్లు, సెటిల్మెంట్లు, రౌడీయిజం, తప్పుడు కేసులు తప్ప ఏమీ లేవు. పైన ఒక సైకో.. ఇక్కడున్న పిల్ల సైకో అక్రమాలను నమ్ముకున్నారు. జనంలో ట్రండ్ మారింది. జగన్ రెడ్డి బెండు తీసేందుకు సిద్ధమైపోయారు.

ఈ చెత్త పాలనను ఇంకా భరించాల్సిన అవసరం మనకు లేదు. జగన్ రెడ్డి ఒక అహంకారి, విధ్వంసకారుడు, అవినీతి పరుడు. శ్రీకాళహస్తిలో బియ్యం మధుసూధన్ రెడ్డి లాంటి దోపిడీ దారుడిని నియోజకవర్గంలోని ప్రజలు ఎప్పుడూ చూసి ఉండరు. తెలుగు తమ్ముళ్లను కేసులతో ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు.

టీడీపీ హయాంలో ఎర్రచందనంపై ఉక్కుపాదం మోపాం. కానీ నేడు ఎర్రచందనం స్మగ్లర్‌ని చిత్తూరు ఎమ్మెల్యేగా నిలబెట్టారు. రాష్ట్రాన్ని స్మగ్లర్లకు డెన్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 60 రోజుల్లో మెగా డీఎస్సీ ఇస్తా.

దళితులంటే ఎంత చిన్న చూపో వర ప్రసాద్ స్పష్టంగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎమ్మెల్యేలను మంత్రుల్ని మార్చిన జగన్ రెడ్డి సొంత వారిని ఎందుకు మార్చలేదు. పెద్దిరెడ్డిని ఎందుకు మార్చలేదు? మిథున్ రెడ్డిని ఎందుకు మార్చలేదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఎందుకు మార్చలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మార్చకపోగా కొడుక్కి కూడా సీటిచ్చారు.

ఈ జిల్లాలో దళితుల సీట్లు తప్ప మరొకరి సీటు మార్చారా? ఎవరూ నిలదొక్కు కోకుండా, రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేయడం జగన్ రెడ్డి మార్క్. కానీ సీనియర్లందరికీ సీట్లిచ్చి అండగా నిలవడం నా మార్క్. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డిని, బీజేపీ ఎంపీ అభ్యర్ధి వరప్రసాద్ ను గెలిపించం నా మార్క్. సీటు ఇస్తామంటే కూడా అభ్యర్ధులు పారిపోవడం జగన్ రెడ్డి మార్క్.

2003లో వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలిచ్చేందుకు వెళ్తున్న సమయంలో 23 క్లెమోర్ బాంబులు పేల్చారు. అలాంటి దాడులకే భయపడను. ఇలాంటి పిల్ల సైకోలకు భయపడతామా? నా అనుభవాన్ని, తెలివితేటలను ఉపయోగించి గాడి తప్పిన పాలనను, అభివృద్ధిని గాట్లో పెడతాను.

రాతియుగం నుండి స్వర్ణ యుగం వైపు నడిపేంచే డ్రైవర్ లా మారుతా. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను. యువతకు హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు నాది గ్యారెంటీ. మీ ఆశలకు రెక్కలు తొడిగే బాధ్యత నాది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాను. భద్రత కల్పిస్తా. భవష్యత్తు చూపిస్తా. ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటా.

బీజేపీతో కలిసినందుకు మైనార్టీలను దూరం చేసేందుకు వైసీపీ దిక్కుమాలిన మాటలు చెబుతోంది. గతంలో ఎన్డీఏలో కలిసి ఉన్నా.. ఆ సమయంలో ఏ మైనార్టీ సోదరుడికి అయినా అన్యాయం జరిగిందా?

జగన్ రెడ్డిని నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే. కేంద్రంలోని ప్రతి బిల్లుకూ మద్దతిచ్చిన జగన్ రెడ్డి.. ఇప్పుడు డ్రామాలాడుతున్నాడు. మనం రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రంతో చర్చిస్తాం, పోరాడుతాం. కానీ, జగన్ రెడ్డి కేంద్రంతో తన కేసుల కోసం మాత్రమే నడుస్తాడు.

నిన్న ప్రధాని మోదీతో బిల్ గేట్స్ చర్చల సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చర్చించారు. భవిష్యత్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. అందుకే యువత ఆ దిశగా అడుగులు వేయాలి. డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి కూడా చర్చించారు. టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించడం నా లక్ష్యం. కానీ, జగన్ రెడ్డి టెక్నాలజీని తప్పుడు పనులకు వాడుతారు.

కోడి కత్తి, బాబాయి బాత్రూం మర్డర్ కేసుల్ని ఎలా వాడుకుని రాజకీయం చేశాడో చూశాం. ఇప్పుడు కంటైనర్లతో డబ్బు తరలించడమే కాకుండా.. క్యాటరింగ్ వాహనాలు అంటూ చెబుతున్నాడు. ఫర్నిచర్ అంటున్నాడు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్న పాపాత్ముడు బియ్యపు మధుసూధన్ రెడ్డి. చేయని తప్పుడు పని లేదు. దోచుకోని వర్గం లేదు. పీడించని వర్గం లేదు. శ్రీకాళహస్తి దేవాలయాన్నీ రాజకీయాలకు, దోపిడీకి కేంద్రం చేశాడు. మున్సిపల్ డంపింగ్ యార్డ్ భూమి ఆక్రమించాడు. స్వర్ణముఖి నది నుండి ఇసుక తవ్వుకుంటున్నాడు. నది సుందరీకరణ పేరుతో రూ.18 కోట్లు కొట్టేశాడు.

రేణిగుంటలోని అనాసంపల్లిలో 200 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి వెంచర్ వేసి దోచుకున్నాడు. ఏర్పేడులో మనం కంపెనీలను ఏర్పాటు చేస్తే.. జగన్ రెడ్డి ఆ కంపెనీలను బెదిరించి డబ్బులు దండుకుంటున్నాడు.

ఒక చెల్లికి ఆస్తి ఇవ్వను అని బెదిరించినందుకు రోడ్డెక్కింది. మరో చెల్లి తన తండ్రి చావుకు సమాధానం చెప్పమంటూ రోడ్డెక్కింది. వీటికి సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ గురించి, నా గురించి మాట్లాడుతున్నాడు. పక్కన హంతకుడిని పెట్టుకుని అమాయకుడి మాదిరి కలియుగం అంటున్నాడు. జగన్ రెడ్డి లాంటి వస్తారని తెలిసి ఉంటే బ్రహ్మం గారు ముందే చెప్పేవారేమో.

LEAVE A RESPONSE