– యువగళం పాదయాత్ర కానాల గ్రామం నుంచి నారా లోకేష్
కానాల గ్రామంలో యువగళం పాదయాత్ర చేస్తుండగా, ఆశ్చర్యకరంగా నేను పంచాయతీరాజ్‌శాఖా మంత్రిగా వేసిన శిలాఫలకాలు కనిపించాయి. మరింత ఆసక్తి పెరిగి, ఈ పనులన్నీ పూర్తయ్యాయో లేదోనని చూశాను. ప్రతీ అభివృద్ధి పనీ పూర్తయ్యింది. శంకుస్థాపన చేసిన మేమే ప్రారంభోత్సవం కూడా చేశాం. ఇది నా విశ్వసనీయత. ఇదీ తెలుగుదేశం కమిట్మెంట్. పంచాయతీరాజ్ మంత్రిగా నేను పల్లె ప్రగతికి చేసిన కృషికి ఆనవాళ్లు..ఈ శిలాఫలకాలు జగన్ మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే వంగలేక ఎవరో రాయి తెస్తే దానిపై టెంకాయ కొట్టడం, స్టంప్స్‌పై టెంకాయ కొట్టడం, చంద్రబాబు చేసిన శంకుస్థాపనల్ని ధ్వంసం చేసి ..పేర్లు మార్చి కొత్త శిలాఫలకాలు వేయడం అభివృద్ధి కాదు జగన్ మోహన్ రెడ్డి గారూ!