Suryaa.co.in

Andhra Pradesh

సహజ మరణాలను మద్యం వల్ల మరణించినట్టుగా చిత్రీకరిస్తున్నారు

– జంగారెడ్డిగూడెం మరణాలను ప్రభుత్వ వైఫల్యంగా ఎందుకు చూపించలేకపోయారు
– అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ ఎందుకు మాట్లాడలేదు
– సహజ మరణాలను మద్యం వల్ల మరణించినట్టుగా చిత్రీకరిస్తున్నారు
– సీఎం జగన్ ను అల్లరి చేయాలనుకుంటే సూర్యుడిపై ఉమ్మేసిన చందమే
– భార్యను అవమానించారని చంద్రబాబు అసెంబ్లీకి రాడు
– టిడిపి సభ్యులు, లోకేష్ పేలాలు ఏరుకోవడానికి వచ్చేస్తారు
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఒకటే సిద్ధాంతం
– 160 సీట్లకు ఒకే సింబల్ పై పోటీ చేస్తే రాజకీయాలు వదిలేస్తా
– నిర్మాణాత్మక పాత్ర పోషించకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు
– మీడియాతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)

అమరావతి, మార్చి 15: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలు సంభవించాయని, మద్యం వల్ల జరిగి ఉంటే ఆ మరణాలును ప్రభుత్వ వైఫల్యంగా ఎందుకు చూపలేకపోయారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. పనికిమాలిన పార్టీ అధ్యక్షుడు, పనిలేని, పసలేని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం జగన్మోహన్ రెడ్డిపై విషం కక్కే ప్రచారం, ప్రయత్నం చేస్తున్నాడు.

దానికనుగుణంగా ఆయన రాజ గురువైన రామోజీరావు, పాయింట్ ఫైవ్ ఛానల్ బిఆర్ నాయుడు కట్టు కథలు అల్లి జంగారెడ్డిగూడెంలో గత పది రోజుల నుండి 23 మంది చనిపోయారని, వారంతా నాటు సారా తాగి మరణించారని పెద్ద ఎత్తున రాజకీయ డ్రామా క్రియేట్ చేశారు. అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు, కాన్వాయ్ తో జంగారెడ్డిగూడేనికి చంద్రబాబు వెళ్లారు. విక్టరీ సింబల్ చూపిస్తూ శవాలకేసిన దండలను చంద్రబాబు వేసుకుని చావులను కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించాడు. శవాలపై చిల్లర ఏరుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న నలుగురు దుర్మార్గులు రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. గత పది రోజులుగా వివిధ కారణాల వల్ల 60 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో అక్కడ ఒక చోట, అక్కడ ఒక చోటా సహజంగా మరణం సంభవించి చనిపోయారు. దీన్ని నిర్ధారణ చేయాలన్నా బూడిద మిగిలే ఈ పరిస్థితుల్లో మన దగ్గర పేపర్లు, చూపించే టీవీ చానల్స్ ఉన్నాయని, ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు, అమాయకులని భావిస్తున్నారు.

అక్కడ మరణించిన వారిలో ఎక్కువ పేద కుటుంబాలు ఉన్నాయి. అవినీతితో సంపాదించిన డబ్బును తీసుకెళ్లి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఇచ్చారు. మీ భర్త సారా తాగి చనిపోయాడు కదా ఈ లక్ష తీసుకో. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే 25 లక్షల నష్టపరిహారం ఇస్తా. లేకపోతే జగన్మోహన్రెడ్డితో ఇప్పిస్తానని చంద్రబాబు దొంగ మాటలు చెప్పాడు. సాధారణ మరణాలను కూడా మద్యం వల్ల చనిపోయారని చెప్పే ఉచ్ఛం నీచము లేని స్థితికి ఈ 420 బ్యాచ్ రావడం దురదృష్టకరం. రాష్ట్రంలోని ప్రజలు, రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు కుటుంబ పెద్దను కోల్పోయి, చిన్న పిల్లలు ఉన్న ప్రాంతంలో కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పేపర్లకు సిగ్గు శరం ఉంటే మూడవ తేదీన చనిపోతే మృతదేహాన్ని తీసుకెళ్ళి పోస్టుమార్టం ఎందుకు చేయించలేదని చంద్రబాబును ప్రశ్నించారు. పోలీస్ కేసు పెట్టాలి.

చనిపోయిన వ్యక్తి ఫలానా చోట లిక్కర్ తాగి అనారోగ్యానికి గురై చనిపోయాడని చూపించాలి.ఇది ప్రభుత్వ వైఫల్యంగా చూపించి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా ఎందుకు చూడలేదు. అవేమీ చేయకుండా అంత్యక్రియలు అయ్యేవరకు చూశారు. బాధిత కుటుంబాలు ఎటువంటి ఫిర్యాదులు కూడా చేయలేదు. మృతదేహాలను తగలబెట్టి బూడిద అయిపోయిన తర్వాత మద్యం తాగి చనిపోయారని, దీనికి సీఎం జగన్ బాధ్యుడని, తగిన మూల్యం చెల్లించుకుంటారని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. 420 బ్యాచ్ ని తీసుకువెళ్లి అల్లరి చేయాలనుకుంటే సూర్యుడిపై ఉమ్మేసిన చందమే అవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీకి మారుపేరు. ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి తప్పులు జరిగినా, ప్రజలు ఎక్కడైనా నష్టపోయినా దానిని సరి చేసుకోవడానికి, అందుకు కారణమైన వారు ఎంతటి వ్యక్తులైనా వదిలిపెట్టకుండా శిక్షించడానికి కృషి చేస్తారు.

అటువంటి మనసు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎటువంటి ఆరోపణలు చేయలేక, వీళ్లకు చెప్పుకోవడానికి ప్రజలు కూడా దగ్గరకు రాకపోవడంతో కృత్రిమంగా చంద్రబాబే ఇటువంటి వార్తలను రాయించుకుని డబ్బులు వెదజల్లి ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే అది చంద్రబాబు తరం కాదు. చంద్రబాబు వెయ్యి జన్మలెత్తినా అయన 420, వెన్నుపోటు దారుడని రాష్ట్ర ప్రజలకు తెలుసు. డబ్బా మీడియా, సొల్లు పేపర్ లను రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు.చంద్రబాబు ఓళ్లు దగ్గర పెట్టుకోవాలి. పిచ్చి కథలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని చంద్రబాబు మంగమ్మ శపధం చేశాడు.

భువనేశ్వరిని సభలో అవమానించారని అంటూనే ఎవరు అవమానించారో చెప్పలేదు. భార్య అని కూడా చూడకుండా రోడ్డు ఎక్కించాడు. నాలుగు ఓట్లు వస్తాయనుకుంటే ఆడవాళ్లని,భార్య, కోడలు, కూతురని కూడా చూడడు నికృష్టపు వెదవ. చంద్రబాబుపై రాష్ట్రంలో ఎవరికీ వేరే ఒపీనియన్ లేదు. నీ కొడుకు నారా లోకేష్ నాయుడు మండలికి వచ్చేసాడు.bభార్యను ఏదో అన్నారని చంద్రబాబు అసెంబ్లీకి రాడు. తల్లిని అంటే నీ కొడుకు వచ్చాడా, నీకు ఒక విధానం, నీ కొడుకుకు ఇంకో విధానం. నువ్వు ముఖ్యమంత్రి అయినా అవకపోయినా, తల్లిని అవమానించినా, అవమానించక పోయినా లోకేష్ కు అవసరం లేదు. సంబంధం కూడా లేదు. రాజకీయంగా పేలాలు ఏరుకోవడానికి వచ్చేసాడు.

ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తాను. ప్రజా సమస్యలను ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానని పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.వైసిపి ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చిన ఈ సభలో అడుగు పెట్టనని చెప్పారు.జగన్ చేసిన శపధం, ఇచ్చిన మాటకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు చంద్రబాబు ఉండగా కౌరవసభలో అడుగుపెట్టలేదు. సీఎం జగన్ కు, పార్టీకి, వైసిపి ఎమ్మెల్యేలకు ఒకటే సిద్ధాంతం. నాయకుడు వెనకే నడుస్తూ, నాయకుడు ఏది చెప్తే,ఏ దారి చూపితే ఆ దారిలో నడుస్తూ వస్తున్నాం. నీకు సిగ్గు లేదు. నువ్వు అసెంబ్లీకి రాకపోతే నీ కొడుకు లోకేష్ వచ్చి కూర్చుంటాడు. నీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చుంటారు.

నీ భార్యను అవమానించారని అన్నమాట ఆఖరికి నీ శాసనసభ్యులు, నీ కొడుకు నమ్మ లేదు. కాబట్టి వాళ్లు నిన్ను కాదని అసెంబ్లీకి వచ్చారు. నువ్వు బయట రక్తికట్టించే డ్రామాను వాళ్ళు ఇక్కడ రక్తి కట్టిస్తున్నారు. బాబాయ్ ను గొడ్డలితో జగన్ మోహన్ రెడ్డి చంపించాడని లోకేష్ అంటున్నాడు. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు నీ దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలో ఉంది. నీ తండ్రి ముఖ్యమంత్రిగా, నువ్వు మంత్రిగా పని చేస్తున్నావ్. ఆనాడు రాజారెడ్డి, మొన్న వివేకానందరెడ్డి హత్యలకు మీ వైఫల్యమే. దోషులకు నువ్వు ఉన్నావనే నమ్మకం. ఈ కేసులను గాలికొదిలేశారు. బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలను కాపాడుకోవడానికి జగన్ కుటుంబ సభ్యులపైన ఆ నెపాన్ని తోస్తున్నారు. సిబిఐ ఎంక్వయిరీ జరుగుతుండగా కొన్ని పత్రికలను అడ్డంపెట్టి తప్పుదోవపట్టించే కార్యక్రమం చేశారు. శవాలపై రాజకీయం చేయాలని దృఢ నిశ్చయానికి ఈ 420 బాబు కొడుకులు వచ్చారు. పప్పు లోకేష్ ఒకటే నిర్ణయానికి వచ్చాడు.
జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడితే, ఏది పడితే అది మాట్లాడితే పెద్ద లీడర్ అవుతానని అనుకుంటున్నాడు. తండ్రి ముఖ్యమంత్రి, తాత ముఖ్యమంత్రి, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ రాష్ట్రానికి మేం చేసినంత సేవ ఎవరూ చేయలేదని చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీని స్థాపించి 151 మంది శాసనసభ్యులను గెలిపించి ఈ రాష్ట్రానికి బలమైన ముఖ్యమంత్రిగా ఉన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉంటే పనికిమాలిన చవట సన్నాసి పప్పు గాడు మంగళగిరిలో ఓడిపోయాడు. జగన్ రెడ్డి నీ అంతు చూస్తా అంటున్నాడు. లోకేష్ నా బొచ్చు చేయాలి.నీ అంత చవట, తోపుగాడు, వెధవ, పనికిమాలిన సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడా.నువ్వు పనికి మాలిన సన్నాసివి. కాబట్టి నువ్వు తిని కూర్చుని దద్దమ్మలా ఉండడానికి తప్ప దేనికి పనికి రావు. లక్షల రూపాయలు ఖర్చు చేసి చంద్రబాబు ఒక సభను ఏర్పాటు చేయించాడు. ఇంకో పుత్రుడుని దగ్గరకు చేర్చుకున్నాడు.
పవన్ కళ్యాణ్ కు ఈ రాష్ట్రంలో ఒకటే కార్యక్రమం అంట. అన్ని పార్టీలను కలిపేస్తాడంట. పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారాలు పెట్టాడు. ఓటు చీల కూడదు అందరూ కలిసి జగన్మోహన్రెడ్డిని ఓడించాలి. చంద్రబాబు నాయుడును గెలిపించాలి.ఆయన పల్లకిని జనసైనికులు మోయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు. జగన్ మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం వర్గ శత్రువు అంట.

వర్గ శత్రువు అనే పదం ఎప్పుడు వినలేదు. పనికిమాలిన రామోజీరావు, బిఆర్ నాయుడు ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు లోకేష్ లు కాపాడలేని పోటుగాడు దిగాడని, ఉదయించాడని పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లారంట. మమ్మల్ని రక్షించాలని అడిగారంట.జనసైనికులు అందరూ సిద్ధంగా ఉండండి. మనమంతా చంద్రబాబును బుట్టలో పెట్టుకుని మోయాలి. మనం అడుక్కుని తిన్న పర్లేదు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసి కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడాల్సిన బాధ్యత మన భుజస్కందాలపై ఉందని సిగ్గులేకుండా చెబుతున్నాడు. జనసేనను స్థాపించినప్పుడు అభ్యర్థులను ఎంపిక చేసే సమయం లేదని చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు.వ్యతిరేక ఓటును చీల్చి జగన్మోహన్ రెడ్డి గెలవ కూడదని సిపిఎం, సిపిఐ, మాయావతిని పట్టుకొని కూటమి పెట్టాడు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు గెలవడానికి ప్రయత్నిస్తాడు. పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించింది చంద్రబాబు కోసం. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు చచ్చేది లేదు.
చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన ఎందుకు.

పవన్ కళ్యాణ్ వెళ్లి ఆయన పార్టీలో చేరితే సరిపోతుంది.ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్రెడ్డిని ఏమీ చేయలేరు.అచ్చెన్నాయుడు ఆంబోతులా రాంకెలు వేస్తున్నాడు. 160 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిస్తుందంట.రాష్ట్రంలో ఎవడన్నా ఒక్కడైనా మగాడు, రాజకీయ పార్టీ ఉంటే జగన్మోహన్రెడ్డిని ఢీ కొట్టి
160 సీట్లు సింబల్ పై పోటీ చేయండి. రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా. తెలుగుదేశం, జనసేన ఏ పార్టీ అయినా కూడా కాంగ్రెస్, బిజెపి అయినా. మీరంతా కలిసి 50-60 సీట్లు పంచుకోవాల్సిన గుంపులు గుంపులుగా విహరించే పందులు. మీరు 160 సీట్లు గెలుస్తారా. గెలవాలంటే పోటీ చేయాలి కదా. రాష్ట్రంలో 175 సీట్లకు పోటీ చేసే ఏకైక మగాడు,సింగల్ గా సింహంలా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. మీరు పోటీ చేసే దాంట్లో ఎవరి షేరు ఎంత. తోలు బకెట్లు, అడుగు లేని బకెట్లు మీరంతా. జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజి చేసి 160 సీట్లు గెలుస్తామని అంటుంటే జనం దాన్ని నవ్వుకుంటున్నారు. 160 సీట్లు పైన గెలిచే ఏకైక మగాడు జగన్మోహన్రెడ్డి.

జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలడం, మీడియాను అడ్డం పెట్టుకుని పార్టీలన్నీ కలిసి ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా ఆయనను దించాలని ప్రయత్నించినా అది జరగదు. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు జగన్మోహన్రెడ్డికి ఉన్నాయి. నిండు నూరేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆయనకు పదవి అవసరం లేదని వెళ్ళిపోతే ఇటువంటి వేస్ట్ గాళ్ళు వచ్చి ఆ సీట్లో కూర్చోగలరు. ఈ సొల్లు కబుర్లు ఆపి నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడని మంత్రి కొడాలి నాని అన్నారు.

LEAVE A RESPONSE