Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు వ్యక్తిత్వం ఏమిటో ఈ పుస్తకం చెబుతుంది

– ఎంపీ రఘురామ కృష్ణంరాజు

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ విజన్‌తోనే పని చేస్తారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. పెద్ది రామారావు రచించిన ‘డీకోడింగ్‌ ద లీడర్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో జరిగింది.

ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు వ్యక్తిత్వం ఏమిటో ఈ పుస్తకం చెబుతుందన్నారు. హైదరాబాద్‌ ప్రగతిని చూసి చంద్రబాబుకు దండం పెట్టా. సైబరాబాద్‌ను చూస్తే ఆయన పడిన కష్టం తెలుస్తుంది. తెదేపా పాలనలో నరేగా కింద రికార్డు స్థాయిలో రోడ్లు వేశారు. మళ్లీ చంద్రబాబు వస్తేనే ఏపీ ప్రజల కష్టాలు తీరతాయి. మళ్లీ చంద్రబాబు వచ్చి గోదావరి జిల్లాలను కలిపే వంతెన పూర్తి చేయాలని కోరారు.

నాయకుడిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు : బుద్ధప్రసాద్‌
హైదరాబాద్‌ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర చాలా ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ చెప్పారు. నాయకుడిని అర్థం చేసుకోవడంలో కార్యకర్తలు, ప్రజలు విఫలమవుతున్నారన్నారు. ‘డీకోడింగ్‌ ద లీడర్‌’ పుస్తకం చదివితే చంద్రబాబు అంటే ఏంటో తెలుస్తుందన్నారు.

ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు. కానీ 15 ఏళ్లు చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని నేను. చంద్రబాబు అందరిలాంటి వ్యక్తి కాదు. మనం పక్క రాష్ట్రంతో పోటీ పడేందుకు చూస్తాం. కానీ ఆయన ప్రపంచంతో పోటీపడేందుకు చూస్తారు. అమరావతి ఆయన అనుకున్నట్టు నిర్మాణం జరిగితే ప్రపంచంలోనే అలాంటి మహానగరం మరొకటి ఉండదని బుద్ధప్రసాద్‌ అన్నారు.

LEAVE A RESPONSE