హాట్స్ ఆఫ్ టూ యు నాయుడూ సార్..

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న రోజులవి….చంద్రబాబు అప్పుడు ప్రతిపక్షనేత….అధికారంలో లేరు……..అలాంటి సమయంలో 2006 వ సంవత్సరంలో ఒకసారి అమెరికా పర్యటనకి వచ్చారు…..కాలిఫోర్నియా రాష్ట్రంలోని “ARTESIA” అనే ఒక నగరంలో చంద్రబాబు గారికి గౌరవ సన్మాన సభ ఏర్పాటు చేశారు ఇక్కడి తెలుగు మహాసభల ప్రతినిధులు…… అప్పుడే చంద్రబాబునాయుడు గారిని నేను మొట్టమొదట ఎదురుగా చూడడం…… ఆ సభకి “ARTESIA” నగర మేయర్, ఒక “సెనేటర్”, ఇంకొంతమంది అమెరికన్ ప్రముఖులు కూడా వచ్చారు.

సెనేటర్ అంటే మన దేశంలో M.P పదవి లాంటిదన్నమాట….. చంద్రబాబు నాయుడు గారికి ఇరువైపులా మేయర్ మరియు సెనేటర్ కూర్చున్నారు…..ఇక సభకి వచ్చిన మన తెలుగు ప్రముఖులంతా చంద్రబాబునాయుడు గారి గురించి, రాష్ట్రాభి వృద్ధికి, రాష్ట్రంలో “SOFTWARE” రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషి గురించి, ఆయన కృషి మూలంగా ఎంతోమంది తెలుగువారు అమెరికాలో ఉద్యోగాల్లో స్థిరపడ్డ విషయం గురించి చాలా గొప్పగా చెబుతున్నారు…… కొద్ది సేపటికి సెనేటర్ వంతు వచ్చింది.

ఆయన మైకు అందుకుని ఇలా మాట్లాడారు……” నాకు ఈ సభకి వచ్చేముందే ఇక్కడి ప్రముఖ డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు చెప్పారు……సన్మానం అందుకోడానికి వచ్చేది ఏ ముఖ్యమంత్రో, లేదంటే ఆంధ్రాలో ఇప్పుడు అధికారంలో వున్న పార్టీ ప్రముఖుడో కాదు….. ప్రతిపక్షనేత…. ఇప్పుడు ఆయన అధికారంలో లేరు అని చెప్పారు…..స్టేజి మీద ఇటు పక్క కూర్చున్న నేను ఇందాకటి నుంచి మేయర్ తో Mr నాయుడు మాట్లాడున్నది వింటూనే వున్నా…… ఆయన ఏం మాట్లాడుతున్నారంటే……మీరు నగర డ్రైనేజీ వ్యవస్థని ఎలా నిర్వహిస్తున్నారు? నగరంలో ఇళ్ల నుంచి, పరిశ్రమలనుంచి వచ్చే వ్యర్ధాలని ఎలా తిరిగి ఉపయోగిస్తున్నారు? ఇళ్ళకి, పరిశ్రమలకి సరఫరా చేసిన విద్యుత్తుని ప్రతి ఇల్లు తిరిగి రీడింగులు తీసుకోకుండా satellite ద్వారా ఎలా సేకరిస్తున్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూనే వున్నారు.

ఆయన ఇప్పుడు అధికారంలో లేరు…..వీటి గురించి ఆయన తెలుసుకున్నా కూడా వాటిని ఇప్పుడు ప్రయోగాత్మకంగా కూడా ప్రవేశపెట్టలేరు. అయినా కానీ మిగిలిన ప్రముఖులు అందరు ఆయన్ని ఎంతగానో పొగుడుతున్నా అవేమీ మనసుకి ఎక్కించుకోకుండా ……కొత్త కొత్త టెక్నాలజీ ద్వారా, కొత్త విధానాల ద్వారా ప్రజలకి సేవచేసే మార్గాలు తెలుసుకోవాలనే ఆయన తపన చూసి నిజంగా ఆశ్చర్యపోయా …. ఇలాంటి వ్యక్తి మీ రాష్ట్రానికి చెందినవాడు కావడం మీరు చేసుకున్న అదృష్టం” అని చెప్పి అంతమంది ముందే నేరుగా చంద్రబాబుగారి వద్దకి వెళ్ళి “HATS OFF TO YOUR GREAT VISION SIR” అని చేతులు కలిపి తిరిగి ఆయన సీటులో ఆసీనులయ్యారు.

ఆ సెనేటర్ ఆంధ్రుడు కాదు ….,
భారతీయుడు కాదు…..
కనీసం కమ్మోడు కాదు.
జన్మతః అమెరికా జాతీయుడు
అలాంటి వాడు చంద్రబాబు గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు……
ఇది చాలదా రాష్ట్రాభివృద్ధి పట్ల చంద్రబాబుగారికున్న చిత్తశుద్ధి తెలియజేయడానికి?
అందుకే ఆయన అడుగులో అడుగు వేస్తూ, ఆయన్ని చూస్తూ ఉందాం సార్…..ఆయన అద్భుతాలు సృష్టించగలరు…..
ఇంతకుముందెప్పుడూ నేను పెట్టిన పోస్టు లు నలుగురికి షేర్ చెయ్యమని చెప్పలేదు. కానీ కొన్ని మంచి విషయాలు నలుగురితో పంచుకుంటేనే “మంచి” అనే పదానికి అర్ధం ఉంటుంది.

– చైతన్య

Leave a Reply