గ్రేటర్‌లో సెటిలర్లు ‘కారు’ ఎందుకు ఎక్కారంటే..

-సెటిలర్ల లో టీడీపీ, వైసీపీ, జనసేన, భారసా లో కూడా ఉన్నారు
-సెటిలర్లంటే కోస్తా, గుంటూరు, కృష్ణా జిల్లాలవారే కాదు
-కేవలం కమ్మవాళ్లు అసలే కాదు

ఇది బర్నింగ్ టాపిక్ నిన్నటి ఫలితాలు చూసిన దగ్గర నుండి దీనిమీద ఒక స్పష్టత తీసుకుందాం. చాలామంది సెటిలర్లు అంటే కోస్తా జిల్లాల వారే అని, ఒక బ్యాడ్ ఒపీనియన్ లో ఉన్నారు. అందులో
కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల కమ్మవారు అనే కోణంలో కూడా చూస్తున్నారు.which is very bad.

సెటిలర్లు అంటే కోస్తా జిల్లాల వారితో పాటు, సీమ ప్రాంతం నుండి వచ్చిన వారు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు . ఆ విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. వీరితో పాటు గుజరాతీయులు, రాజస్థాన్ నుండి వచ్చిన మార్వాడీ లు కూడా అదే సంఖ్యలో ఉన్నారు. హైరైజ్ అపార్ట్మెంట్లు మొదలైన తర్వాత బీహారీలు, యూపీ నుండి వచ్చిన వారు కూడా లక్షల లోనే ఉన్నారు.

ఇక టెకీల విషయం తీసుకొంటే మొత్తం పది లక్షల మందిలో మన తెలుగు వారి సంఖ్య మూడు లక్షల మంది ( ఉభయ తెలుగు రాష్ట్రాల వారు)ఉంటారు. మిగిలిన వారంతా మిగిలిన దేశంలోని వివిధ రాష్ట్రాల వారే. హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత , దాని చుట్టూ ఏర్పడిన కొత్త నగరం సైబరాబాద్ లో అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయి , వాచ్ మ్యాన్ లు గా ఉత్తరాంధ్ర నుండి, గోదావరి జిల్లాల నుండి చదువు లేని నిరుపేదలు ఎక్కువగా లక్షల్లోనే ఇక్కడ సెటిల్ అయ్యారు. వారెవరికీ ఇక్కడ ఓటు హక్కు లేదు. ఆంధ్రాలో ఎన్నికల సమయంలో బస్ లు వేసి తీసుకెళ్తారు వైసీపీ వారు.

ఇది కాస్మోపాలిటన్ సిటీ కావటం వల్ల, ఇది ఒక మినీ భారత్ గా చెప్పవచ్చు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఓన్ చేసుకొని బతుకు తుంటారు.ఇది హైదరాబాద్ విశిష్టత.

ఇక అసలు విషయానికి వచ్చేస్తా. రేవంత్ గెలుపులో టీడీపీ ప్రాధాన్యత ఉందా లేదా అనేదాని మీద వివిధ రకాల విశ్లేషణ లు వినిపిస్తున్నాయి. సెటిలర్లు ఎక్కువగా ఉన్నచోట భారసా గెలవటం చూసి ఆశ్చర్యపోతున్న మేధావులు. ( తమకు తామే ఫీలయ్యే రకం) కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓటు బ్యాంకు పోయి చాలా కాలం అయ్యింది.ఇప్పుడు డిపాజిట్లు దక్కటానికి కారణం, సెటిలర్లలో టీడీపీ అభిమానుల ఓట్లు మాత్రమే అని ఎంత మందికి తెలుసు?

ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ అంటే హైదరాబాద్ లో యోధానుయోధుల కలయిక . ఒక పీజేఆర్, ముఖేష్ గౌడ్, దానం నాగేందర్, కే. కేశవరావు, పీ. శివశంకర్, జీ. వెంకటస్వామి , శంకర్రావు, వీరు గాక ఉమ్మడి రాష్ట్ర సీయంలు ఇక్కడే ఉండటం వల్ల ద్వితీయ శ్రేణి నాయకుల సమరోత్సాహంతో ఉండేది. అది గత చరిత్ర గా మిగిలి పోయింది. వీరితో పాటే ఆ క్యాడర్ కూడా వేరే పార్టీలకు వలస పోయింది.

మొన్నటి జీహెచ్ యంసీ ఎన్నికలలో కూడా పేలవంగా ఉన్నాయి ఫలితాలు. అలాంటి సమయంలో కూడా ఇప్పుడు గౌరవంగా డిపాజిట్ లు దక్కించు కోవటమే కాకుండా, గణనీయ సంఖ్యలోనే ఓట్లు
దక్కించు కొన్నదంటే ఆ క్రెడిట్ టీడీపీ దే. ఒక వేవ్ రావటానికి కూడా కారణం టీడీపీనే .ఖమ్మం లాంటి చోట్ల జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కాంగ్రేసుని ఓన్ చేసుకొని పోరాడారు.

కంక్లూజన్ ఏంటంటే.. సెటిలర్లు లో టీడీపీ, వైసీపీ, జనసేన, భారసా లో కూడా ఉన్నారు. మెజారిటీ టీడీపీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ వెంటే నడిచారు అనటం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కాకపోతే నలభై నియోజక వర్గాల్లో మేమే నిర్ణయాత్మక శక్తి అని, కుల సంఘాల వనభోజనాల్లో కొట్టుకొనే డప్పుని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి, పలుచన అయ్యామనే ఆవేదన ఒక్కటే బాధ పెడుతోంది అంతే .

కృషితో నాస్తి దుర్భిక్షం

– చిరంజీవి

Leave a Reply