ట్రాన్స్ కో సొమ్ముతో ఇండోసెల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కు జగన్‌ సోకులు

-సబ్ స్టేషన్ కోసం జీఓ ఎప్పుడు జారీ చేశారు ?
-” ఈ ఆర్ సి ” నుండి ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్ ” కన్నా ముందే ఇచ్చారా ?
-అసలు ఈ తతంగానికి ” ఈ ఆర్ సి ” నుండి ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్ ” ఉందా, లేదా?
-ఈ సంవత్సరం డిసెంబర్, 2023 నుండి కొనుగోలు ప్రారంభించడం వెనుక మతలబు ఏమిటి?
-ఇండోసెల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ – షిర్డీ సాయి ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ రెండు కంపెనీల ప్రమోటర్లు ఒక్కరే
-ఈ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థలే
-ఆ కంపెనీపై అంత ప్రేమెందుకు?
-అది జగన్‌ అస్మదీయ కంపెనీయే
-కాబట్టే ట్రాన్స్‌కో సొమ్ము ధారాదత్తం
-ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఫైర్‌

విజయవాడ: ఏపీ ట్రాన్స్‌కో నిధులను సీఎం జగన్‌ తన అస్మదీయ కంపెనీలకు ధారాదత్తం చేసి, ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఆరోపించారు. జగన్‌ తన బినామీ కంపెలకు ప్రజాధనంతో చేస్తున్న సోకుల పాపానికి జనం ఫలితం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఇండోసెల్‌ సోలార్‌కంపెనీకి ఇచ్చిన అనుమతులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని లంకా సవాల్‌ చేశారు.

లంకాదినకర్‌ ఇంకా ఏమన్నారంటే… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అస్మదీయుల కంపెనీ ఇండోసెల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఇప్పటికే రాష్ట్రంలో అక్రమ పద్దతిలో లక్షలాది ఎకరాల భూములను పవర్ ప్రాజెక్టులకు అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం ఆధారాలతో సహా బహిర్గత పరిచాము. రాష్ట్ర ప్రభుత్వం అస్మదీయులకు మరియు అవినీతితో ప్రయివేట్ కంపెనీలకు ప్రభుత్వ సొమ్ము దోచి పెడుతూ ప్రజల పైన మోయలేని విధ్యుత్ చార్జీల భారాన్ని వేస్తుంది.

ఇండోసెల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నెల్లూరు వద్ద ఏర్పాటు చేయబోయే, సోలార్ ప్యానల్ ప్లాంట్ కు అవసరమైన పవర్ లైన్ మరియు సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ఉచిత కానుకగా ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని సమాచారం వచ్చింది. ఇండోసెల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కి మేలు చేకూరే విధంగా దాదాపు 80 నుండి 90 కోట్ల ట్రాన్స్ కో నిధులతో పవర్ లైన్ మరియు సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఉత్తర్వులు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిందని సమాచారం వచ్చింది.

సాధారణంగా ఏ ప్రయివేట్ సంస్థ ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన పవర్ లైన్ మరియు సబ్ స్టేషన్ కొరకు అయ్యే వ్యయం ఆయా సంస్థలు భరించాలి, కానీ ఇండోసెల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పైన మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభిమానం ఉంది కాబట్టే ట్రాన్స్ కో సొమ్ముతో ఉచితంగా సమకూరుస్తునట్టు ఉంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వంత జాగీరులాగా అస్మదీయ కంపెనీలకు ట్రాన్స్ కో నిధులు ఇలా అప్పనంగా దోచి పెడుతూ ప్రజల నెత్తిపైన విద్యుత్ చార్జీల రూపంలో పిడుగులు వేయడం భావ్యమా? ఇండోసెల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం ఉచితంగా గిఫ్ట్ గా వేస్తున్న పవర్ లైన్ మరియు నిర్మిస్తున్న సబ్ స్టేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎప్పుడు జారీ చేశారు ?

ఈ సంస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓ ని ” ఈ ఆర్ సి ” నుండి ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్ ” కన్నా ముందే ఇచ్చారా ? , అసలు ఈ తతంగానికి ” ఈ ఆర్ సి ” నుండి ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్ ” ఉందా, లేదా? ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇలా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఏ ఏ ప్రైవేట్ సంస్థలకు పవర్ లైన్ మరియు సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ఉచిత కానుకగా ఇచ్చింది శ్వేతపత్రం విడుదల చేయగలదా?

పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం మెయిన్ లైన్ నుండి ప్లాంట్ వరకు అవసరమైన లైన్లకు అయ్యే వ్యయం వినియోగదారుల ( పరిశ్రమ ) నుండే వసూళ్లు చేస్తారు, కానీ ముఖ్యమంత్రి గారికి నచ్చిన కంపెనీలకు ఆ వ్యయం ప్రభుత్వమే భరించే కొత్త పద్దతి ఇప్పుడే చూస్తున్నాము. పారిశ్రామిక ప్రోత్సాహకంగా ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం వినియోగించిన విదుశ్చక్తి పైన మాత్రమే పరిశ్రమలకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ పవర్ లైన్ మరియు సబ్ స్టేషన్ నిర్మాణం పైన కాదు .

మరో వంక ఒక ప్రయివేట్ కంపెనీతో గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు 1.04.2024 నుండి అమలు కావలసిన 3800 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంను ముందుకు జరిపి ఈ సంవత్సరం డిసెంబర్, 2023 నుండి కొనుగోలు ప్రారంభించడం వెనుక మతలబు ఏమిటి అని ఒక మిత్రుడు ప్రస్తావించారు?

ఏప్రిల్ 2024 నాటికి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఉండకుంటే లేదా ఎన్నికల కోడ్ వల్ల ఆ ప్రైవేట్ కంపెనీ ఒప్పందాలను అమలు చేయలేక పొతే ఎవరికి నష్టం? రాష్ట్రంలో ప్రభుత్వం పెద్దలకు అందాల్సిన అవినీతి సొమ్ము దక్కదనే ఉద్దేశ్యంతోనే డిసెంబర్, 2023 నుండే అమలు సెహెస్తున్నారనే అనే అనుమానం వస్తుంది.

రాష్ట్రప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్న సంస్థ ఈ విద్యుత్ సప్లయ్ ఏ ప్లాంట్ నుండి సరఫరా చేస్తామన్నరో ఆ ప్లాంట్ నిర్మాణం పూర్తీ అయ్యిందా? లేక బయట నుండి కొనుగోలు చేసి 1.04.2024 కన్నా ముందే ఏందుకు అంత తొందరపాటుగా సప్లయ్ చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది.

రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సదరు కంపెనీ సరఫరా చేసే ప్రతి యూనిట్ ని ట్రాన్స్మిషన్ చార్జీలు లేకుండా రూ. 2.49 పైసలకు సప్లయ్ చెయ్యాలనే నిబంధన ఉంది అంటున్నారు.

ఇప్పుడు ” గ్రాస్ నెట్వర్క్ యాక్సెస్ ” పేరుతో ప్రతి యూనిట్ కి 50 పైసల నుండి 75 పైసలు అదనంగా ఆ కంపెనీకి చెల్లించే నిర్ణయం తీసుకున్నారా, లేదా ? ప్రైవేట్ కంపెనీకి లబ్ది చేకూరుస్తూ ఇది ప్రజలపైన మోపే అదనపు భారం కాదా ?

అగ్రిమెంట్ నిభందనలు కళ్ళు కప్పి ఇలా అదనంగా ప్రైవేట్ కంపెనీలకు లబ్ది చేకూర్చడం వెనుక ఉన్న చీకటి ఒప్పందాలు బహిర్గతం చేయాలి.

డిసెంబర్, 2023 నుండే ప్రతి నెల 500 మెగావాట్ల విధ్యుత్ సప్లయ్ పెంచుకుంటు పోతూ ఏప్రిల్ 2024 లోపే పని కనివ్వడం వెనుక ఎన్ని వేల కోట్ల లబ్ది ఎవరికి జరుగుతుంది?

రాబోయే ఎన్నికలలో గెలవడం సాధ్యం కాదని నిర్దారణకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ అగ్రిమెంట్ అమలు జరగకపోతే వసూళ్లు చేసిన లేదా చేయబోయే అవినీతి సొమ్ము నష్టం జరుగుతుందని తొందర పడినట్టు అర్ధం అవుతుంది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఖజాన సొమ్ము అస్మదీయులకు కానుకగా ఉచితంగా పంచుతూ, అవినీతితో ప్రయివేట్ కంపెనీలకు ప్రభుత్వ ధనాన్ని దోచి పెడుతూ ప్రజలపైన మోయ లేని భారం విద్యుత్ చార్జీల రూపంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వసూళ్లు చేస్తున్నది.

గతంలో జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థలకు కట్టబెట్టిన విద్యుత్ స్మార్ట్ మీటర్ల పరికరాల మరియు వాటి నిర్వహణ వ్యయం అవినీతి పైన ప్రశ్నిస్తే వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి మరల వారి అస్మదీయ షిర్డీ సాయి ఎలెక్ట్రికల్స్ కు కట్టబెట్టారా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

ఉత్తరప్రదేశ్ లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల స్మార్ట్ మీటర్లను 10 వేల రూపాయలకు ఇచ్చిన టెండర్ ను రద్దు చేస్తే, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం విద్యుత్ మీటర్ ధర 6 వేలు చూపుతూ అనుబంధ పరికరాలకు మరియు నిర్వహణ వ్యయం కోసం అంటూ మరో 31 వెయ్య రూపాయిల దోపిడీకి అవకాశం ఇవ్వడం వల్ల ప్రజలపైన వేలాది కోట్ల విద్యుత్ చార్జీలభారం భారీగా ఇప్పటికే పడగా, నేడు అస్మదీయులకు లబ్ది చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మరింత తీవ్రమైన విద్యుత్ చార్జీల శిరో భారం వినియోగదారుల పైన పడుతుంది.

ఇండోసెల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు షిర్డీ సాయి ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ రెండు కంపెనీల ప్రమోటర్లు ఒక్కరే, ఈ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థలే అనేది ప్రజల భావన.ఇప్పటివరకు ట్రూ అప్ చార్జిలని లేదా ఇంధన సర్దుబాటు చార్జిలని రాష్ట్రంలోని విధ్యుత్ వినియోగదారుల నుండి వసూళ్లు చేసే ప్రభుత్వం, నేడు వీరి ” అవినీతి చార్జీలను ” కూడా ప్రజల నుండే వసూళ్లు చేస్తునట్టు ఉంది.

Leave a Reply