విద్యార్థుల అమూల్యమైన జీవితం బుగ్గిపాలౌతోంది

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర

విద్యా వ్యవస్ధను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేసింది. జగన్ చేతకాని పరిపాలన వల్ల అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలేదు. విద్యార్థుల అమూల్యమైన జీవితం బుగ్గిపాలౌతోంది. రాష్ట్రంలో పదవ తరగతి ఉత్తర్ణత శాతం భారీగా తగ్గింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారు.

విద్యాశాఖ మంత్రి స్వార్థంతో ఫలితాల ప్రకటనలో కూడా జాప్యం జరిగింది. విద్యార్థులకు శెలవులిచ్చినా ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాలనడం అన్యాయం. ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద కాపలా ఉంచి వారి పరువు తీశారు. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి అనడం అన్యాయం. హాస్టళ్ల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. 2లక్షల మంది విద్యార్థుల ఫెయిల్ చూపిస్తే 10 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. నాడు నేడు పేరుతో టీచర్లపై ఒత్తడి తెచ్చి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేశారు.

ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి మాట తప్పారు. ప్రతి సంవత్సరం డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పి ఈ మూడు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించ లేదు. చంద్రబాబుయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు మెగా డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుతం రేషనలైజేషన్ పేరుతో కోతలు విధిస్తున్నారు. మంచి పౌరులను అందించాల్సిన ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు. విద్యావిధానంలో మార్పులు తేవడంవల్ల ఉపయోగం లేదు. జీవో నెంబర్ 117 ఇచ్చి ఉపాధ్యాయులను భయాందోళనకు గురిచేస్తున్నారు.

పేపర్ల లీకేజీ పేరుతో టీచర్లను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు. సక్రమంగా నడుస్తున్న విద్యా వ్యవస్థను దారి తప్పించారు. పదవ తరగతిలో పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం రిజల్ట్ వస్తే రాష్ట్రంలో 60 శాతానికి దిగజార్చారు. ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కరు ఎండగట్టాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల పక్షాన ప్రభుత్వంతో పోరాడడానికి టీడీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

Leave a Reply