Suryaa.co.in

Telangana

నలుగురు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ లోకి జంప్

– బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఒక రోజు ముందే బీజేపీకి బిగ్ షాక్

హైదరాబాద్ వేదికగా జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే బీజేపీకి ఊహించని షాక్. బీజేపీ కి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.

హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరుtrs-joinings1మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్ లో చేరగా కేటీఆర్ కండువా కప్పి వారిని స్వాగతించారు.

ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా, మోడీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ రానుండగా, సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరడం బీజేపీకి ఊహించని షాక్.

LEAVE A RESPONSE