Suryaa.co.in

Political News

సీఎం మీదనే రాయి దెబ్బ.. మరి ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో?

విజయవాడలో ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రచార సభలో ఎవరో రాయితో కొడితే ముఖ్యమంత్రి గారికి తల మీద దెబ్బ తగిలింది. అది కళ్ళకు కనపడుతూనే ఉంది. ప్రక్కనున్న ఎమ్మెల్యే అభ్యర్థి గారికి కూడా రాయి దెబ్బ తగిలిందంట . ఎవరి మీద రాళ్లు విసిరినా ఎవరికి రాయి దెబ్బలు తగిలినా ఇంకేదైనా విసిరినా దెబ్బలు తగిలినా ప్రభుత్వం అనేది అందరిని ఒకటే రకంగా చూడాలి. ఆ అంగతుకుల మీద కచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. శిక్షించాలి.

ముఖ్యమంత్రి గారి బందోబస్తు 1,400 మంది పోలీసులతో 4 రోప్ పార్టీలతో (తాడు కంచ) ప్రజలు ఎంత వెడల్పు ఉంటే, అంతకంటే మూడంతల అవతల నుండి బందోబస్తు ఉంటుంది. ప్రజల మధ్యనే సివిల్ డ్రెస్ లో పోలీస్ వ్యవస్థ ఉంది. బస్సుకు ముందు 200 అడుగులు, కుడివైపు ఎడమవైపు 100 అడుగుల దూరంలో నిఘా చాలా ఎక్కువ ఉంటుంది. మరియు వారికి జెడ్ ప్లస్ కేటగిరి పోలీసు వ్యవస్థ ఉంది. ముఖ్యమంత్రి గారి చుట్టూ డేగ కళ్ళతోటి నల్ల కళద్దాలు పెట్టుకొని ఏ వైపు నుండి ఏమొస్తుందో, ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందో నని ఎదుటివారు గమనించేందుకు అవకాశం లేకుండా, కాపాడుటకు నిత్యం పహార కాస్తుంటారు. మరి ఇంత వ్యవస్థ ఉన్న ముఖ్యమంత్రి గారి మీదనే రాయి దాడి జరిగిందంటే.. వారిని పట్టుకో లేదంటే ఏ ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి? ఎవరిని తప్పు పట్టాలి?

రాయి విసిరిన వ్యక్తి విసిరిన డైరెక్షన్, ఒక రాయి అంత ఎత్తుకు ఎంత దూరం నుండి విసిరితే రక్తం కారి దెబ్బ తగులుతుందో .. మనకున్న ఇంజనీరింగ్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కనుగొనలేనంత,చేతగానితనంగా లేదు. రాయి ఎంత స్పీడ్ తో ఎంత దూరం నుంచి వేస్తే, 25 అడుగుల ఎత్తులో ఉన్న ముఖ్యమంత్రి గారికి తగులుతుందో కనిపెట్టలేనంత చేతగానితనంగా ఉంటుందని, ఉందని ఎవరు అనుకోవడం లేదు .

రాయి అనేది ఎంత స్పీడ్ గా కొట్టినా, తగలవలసిన చోటు తగిలి రక్త గాయమై పక్కనున్న మనిషికి కూడా గాయమైందంటే, వినడానికే విచిత్రంగా ఉంది. ఎందుకంటే రాయి విసిరిన తరువాత తగుల వలసిన చోటు తగిలి, ఆ వచ్చిన స్పీడు, వెలాసిటీ సన్నగిల్లి కిందపడిపోతుంది. స్పిన్ అయ్యి 4,5 అడుగుల దూరంలో ఉన్న ఇంకొకరికి తగలడానికి, అదేమీ బాలు కాదు. రాత్రిళ్ళు అంత పెద్ద విఐపి రోడ్ షో చేస్తుంటే, కరెంట్ తీగలు తగులుతాయని ఆ ఒక్కచోటనే కరెంట్ తీయించి వేశారంటే, దీని మీద కూడా ప్రజలకు అనుమానం ఉంది. విచారణ జరగాలి.

అదే తెనాలి సభలో పవన్ కళ్యాణ్ గారి మీద రాయి విసిరితే, ఆ వ్యక్తిని కార్యకర్తలు వెంటనే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరి జగన్మోహన్ రెడ్డి సభలకు మించి పవన్ కళ్యాణ్ గారి సభలకు జనం వచ్చినప్పుడు, వీరి మీటింగ్ లో రాయి విసిరిన వాడిని పట్టుకున్న సందర్భం ఉంటే.. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో రాయి విసిరిన వాడిని చుట్టుపక్కల ప్రజలు ఎందుకు పట్టుకోలేకపోయారో? జగన్మోహన్ రెడ్డి గారికి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారికి ప్రతిష్ట గా ఉంటుందా?

మరి దీన్ని బట్టి చూస్తే.. పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిందని అర్థం అవుతుంది. ఇప్పటికి జరిగి మూడు రోజులు అయింది. లేదా ఇంకా ఏదైనా మతలబ్ ఉండాలి. ఇప్పటికీ కూడా నిందితుడిని పట్టుకోలేకపోయారంటే, మరి ఏమని భావించాలో, మన పోలీసు వ్యవస్థ అంత చేవ చచ్చి ఉందా? ప్రజలకు అర్థం కావడం లేదు.

మరొకవైపు ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, విశాఖ విమానాశ్రయంలో వారి మీద కోడి కత్తితో దాడి జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ కేసును ప్రభుత్వం తేల్చలేకపోయింది.దానికి కారణాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్ననే, వారి సొంత లోగిలిలోనే గొడ్డలితో నరికి చంపి వేస్తే, ఇంతవరకు ఆ కేసును సరైన విధంగా పట్టాలెక్కించలేకపోయారు. దోషులను అరెస్టు చేయలేకపోయారు. ఇలాంటి మతలబేదో ఇందులో కూడా ఉందని, ప్రజలు అనుమానించే పరిస్థితి వస్తుంది.

రాయి దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఏ రోజు కూడా దుండగులను పట్టుకోండి. అరెస్టు చేయండి. జైలుకు పంపించండి. ఇది మన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది అని. ప్రభుత్వాన్ని పోలీసులను పురమాయించుకోకుండా.. నేను రాళ్ల దెబ్బలకు భయపడే వాడిని కాదు అని, దానిని రాజకీయ స్లోగన్ తీసుకొని ఊరూరు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతిపక్షాలను ఆడి పోసుకోవడానికి.. నేను రాళ్ల దెబ్బలకు భయపడనని రాజకీయాలకు ఉపయోగపడేట్టుగా స్లోగన్, సింపతి వచ్చేటట్లుగా మాట్లాడుకుంటున్నారు.

ఏది ఏమైనా రాయి దాడి జరిగింది ముఖ్యమంత్రి గారిమీద కాబట్టి.. ప్రభుత్వం,పోలీసు వ్యవస్థ నిజమైన దోషులను వెలికి తీసి, దోషులను కఠినంగా శిక్షించవలసిందిగా సమాజం కోరుకుంటుంది.

కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE