Home » చంద్రబాబా?.. మజాకా?

చంద్రబాబా?.. మజాకా?

(దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి)
అర్థరాత్రి చంద్రబాబుకు ఫోన్‌ చేసిన మార్క్‌ జుకర్‌బర్గ్‌ ….
ఇండియాలో టైమ్ సరిగ్గా రాత్రి 9…అప్పటికే చాలామంది భోజనాలు ముగించుకుని పక్కమీదకు చేరి ఫోన్లు అందుని ఫేసుబుక్కు, వాట్సాపులు ఓపెన్‌ చేసి చాటింగులతో దు‌న్నేస్తున్నారు. అప్పుడు అమెరికాలో ఉదయం 9 గంటలవుతోంది…
కాలిఫోర్నియా…ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్ బర్గ్‌ తన ఇంట్లో కూచుని చికెన్‌ బర్గర్‌ తింటున్నారు. సడెన్‌గా ఆయన పర్సనల్‌ నంబర్‌కు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మొరాయించాయి. జనం గగ్గోలు పెడుతున్నారు. ఇండియాలో అయితే ఫేస్‌బుక్‌ ఓపెన్‌ కాక కొందరు ఫిట్స్‌ వచ్చి కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నారు అని ఫోన్‌ చేసినవారు గడగడా చె‌ప్పేశారు. బర్గ్‌ ఒక్క ఉదుటన లేచి నిల్చున్నారు. ఒళ్లంతా చెమట్లు పడుతున్నాయి. మాట తడబడుతోంది.
ఏం చేయాలి…ఇప్పుడెలా…?
ఫోన్‌ తిసి ఒక నంబర్‌కు డయల్‌ చేశారు…’ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయిందా ? ‘ అని అడిగారు ఆతృతగా…? ‘లేదు సార్‌…ఇంకా టైమ్‌ పట్టేలా ఉంది’….’మన టెక్నికల్‌ టీమ్‌ ఏం చేస్తోంది…? ‘ ఇప్పటివరకు అదే పనిలో ఉన్నారు….ఇప్పడే టీ తాగొస్తామని క్యాంటిన్‌కు వెళ్లారు సార్‌…’మార్క్‌కు బీపీ పెరిగిపోయింది…
క్షణాలు దొర్లుతున్నాయి. మళ్లీ ఫోన్‌ మోగింది…మార్క్‌ భయం భయంగా ఫోన్‌ లిఫ్ట్‌ చేసి హలో అన్నాడు.
‘సార్‌…మన ఫేస్‌బుక్‌ షేర్లు పడిపోతున్నాయి…ఇప్పటికే షేర్ వ్యాల్యూ అయిదుశాతం పడిపోయింది…కోట్లలో నష్టం వచ్చింది..’ఆ మాట వినగానే మార్క్‌ ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు. వెంటనే అత్యవసరంగా జూమ్‌లోనే బోర్డు మీటింగ్‌ ఏర్పాటు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా నంబర్‌వన్‌ టెక్నిల్‌ స్టాఫ్‌ ఆ మీటింగ్‌కు అటెండ్ అయ్యారు…’మీరేం చేస్తారో నాకు తెలియదు…అర గంటలో ఈ ప్రాబ్లం సాల్వ్‌ కావాలి ‘అన్నారు మార్క్‌ టెన్షన్‌తో చేతులు పిసుక్కుంటూ
‘ఆరు రోజులు పడుతుంది ‘ అన్నాడు హాంకాంగ్‌ నుంచి అటెండ్‌ అయిన ఫేస్‌బుక్ టెక్నికల్‌ టీమ్‌ హెడ్‌…
‘ఎందుకు…?’
‘ఎందుకు అంటే…మా వాళ్లు మొత్తం చెక్‌ చేస్తున్నారు. అంతా అయ్యేసరికి వారం, పది రోజులు పడుతుంది ‘ అన్నాడు బబుల్‌గమ్ నమలుతూ…
‘అంతేనా మరో మార్గం లేదా..? ‘ అని అడిగాడు మార్క్‌
‘ఈ సమస్యను ఈ ప్రపంచంలో ఇంకెవరైనా వారం రోజుల కంటే ముందు సాల్వ్‌ చేస్తే నా ఉద్యోగానికి రాజీనామా చేసిపోతా ‘అని శపథం చేశాడు టెక్నికల్‌ హెడ్‌ ఆవేశంగా ..
‘అయిపోయింది…అంతా అయిపోయింది ‘ మార్క్‌ కు కళ్లు తిరుగుతున్నాయి.
‘ఒక్కడున్నాడు సార్‌…’ అని చెవిలో మార్క్‌ గుసగుసగా చెప్పాడు అతని పీఏ జాన్ అబ్రహం. ‘ఎవడువాడు ‘ అని ఆశ్చర్యంగా తన పీఏ వంక చూశాడు మార్క్‌…మార్క్‌ కళ్లల్లో మెరుపు కనిపించింది…’మీ సమస్యను పరిష్కరించే మొనగాడు…”ఎవరతను…ఎక్కడున్నాడు….చెప్పు…చెప్పు…చెప్పు ‘అని ఆవేశంగా తన పీఏ భుజాలు పట్టుకుని కుదిపేశాడు.
‘అతని పేరు చంద్రబాబు నాయుడు ‘
‘ఏం చేస్తాడు ? ”ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ….’
‘ఐటీ ఇండస్ట్రీనా….”కాదు…పొలిటికల్‌ ఇండస్ట్రీ…’
‘పొలిటికలోడికి టెక్నికల్‌ నాలెడ్జీ ఏముంటుంది ? ‘ అని అడిగాడు మార్క్‌..’సార్‌…మీరతన్ని తక్కువ అంచనా వేస్తున్నారు…కంప్యూటర్లతో కబాడీ ఆడుకుంటాడు… మౌస్‌లతో మూడు ముక్కలాట ఆడతాడు…కీ బోర్డుతో కేక పెట్టిస్తాడు…”అవునా…? ‘అని ఆశ్చర్యపోయారు మార్క్‌
‘ఏంటనుకున్నారు మరి…అసలు సెల్‌ఫోన్లు కనిపెట్టింది అతనే తెలుసా..? ”అవునా…? సెల్‌ఫోన్‌ను కనిపెట్టింది ఇండియనా…? ‘
‘యస్‌…నీకో మరో షాకింగ్‌ న్యూస్‌ చెప్పనా సార్…? ‘
‘చెప్పు……ఏంటది…? ”ప్రపంచంలో తుపాన్లను కంట్రోల్ చేయగలిగే యుగపురుషుడు …’ఎండలు రెండు డిగ్రీలు తగించగలిగిన యోధుడు…
‘ఇంతకీ…ఎక్కడుంటాడు…”ఇండియాలో…’
‘ఇండియాలో ఎక్కడ…”హైదరాబాద్‌లో ‘
‘అతనికి ఫోన్‌ కలపండి…”కుదరదు సార్‌…’
‘యేం…ఏందుకు కుదరదు..? ”ఆయన ఇప్పుడు జూమ్‌ మీటింగుల్లో బిజీగా ఉంటారు సార్‌.
‘ఇప్పుడు ఇండియాలో రాత్రి తొమ్మిది అవుతుంది కదా…
పడుకునే టైమ్‌లో జూమ్‌ మీటింగులేంటీ…? సార్ మొన్నామధ్య వాళ్ల పార్టీ అధ్యక్షుడు “పార్టీ లేదు బొక్కా లేదు” అన్నప్పటి నుంచి అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి పార్టీకి ఏమైనా బొక్క పడిందా అని చెక్‌ చేసుకుని పడుకుంటాడు సార్‌…’
‘ఒక్కసారి ట్రై చేయవయ్యా….’ అన్నాడు మార్క్‌ విసుగ్గా…
‘సరే మీ ఇష్టం’ అని చంద్రబాబుకు ఫోన్‌ కలిపాడు పీఏ..
హలో అన్నారు చంద్రబాబు..హలో సార్‌…నేను ఫేసుబుక్కు సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ను మాట్లాడుతున్నా…మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా.. అన్నాడు మార్క్‌ ఆ
‘నో…అయాం బిజీ…కాల్‌ మీ ఆఫ్టర్‌ టూ అవర్స్‌ ‘ అని ఫోన్‌ పెట్టేశాడు చంద్రబాబు..మార్క్‌ షాక్‌ తిన్నాడు…తాను ఫోన్‌ చేస్తే అమెరికా అధ్యక్షుడే అరగంట సేపు మాట్లాడతాడు…ఇతనేంటి తనను చీపురుపుల్లను తీసేసినట్లు తీసిపారేశాడు…
రెండు గంటల తరువాత మళ్లీ ఫోన్‌ చేశాడు మార్క్‌
‘సార్‌ నేను మార్క్‌ జుకర్ బర్గ్‌ను మాట్లాడుతున్నా…’
“యస్‌ బ్రదర్‌……మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ…అయాం విత్‌ యూ అన్నారు చంద్రబాబు”…
‘అయితే మా ప్రాబ్లమ్ సాల్వ్‌ చేస్తారా’ ? ‘ఇప్పుడు కాదు…రేపు పొద్దున ఫోన్‌ చేయ్’ అని ఫోన్‌ పెట్టేశాడు చంద్రబాబు…
మార్క్‌కు తిక్కరేగిపోయింది…’అలా కాదు…ఇండియన్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ కు కలుపు…’పీఎ వెంటనే ఫోన్‌ కలిపి ‘సార్‌…మోదీ సార్ లైన్‌లో ఉన్నారు..”హలో…మోదీ సార్‌…..మీ దేశంలో చంద్రబాబు అనే తోపు ఉన్నాడు కదా…అతనితో నాకు పనిపడింది. ఆయనతో ఒక్కసారి మాట్లాడించండి సార్‌…ప్లీస్‌…’ అని బతిమాలాడు.
‘చంద్రబాబా ? ఎలక్షన్‌ టైమ్ లో నన్ను బండ బూతులు తిట్టాడు..ఆ తరువాత కాళ్ల బేరానికి వచ్చాడు కానీ నేను అతనితో మాట్లాడట్లేదు… అజిత్‌ దో వల్‌తో మాట్లాడండి..మీ పని చేసి పెడతాడు’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశారు మోదీ గారు…
వెంటనే ఇజ్రాయిల్‌ లోని ఒక బంకర్‌లో మోసాద్‌ గూఢచారులతో అత్యవసర సమావేశంలో ఉన్న అజిత్‌ దోవల్‌కు పీఎంవో నుంచి ఫోన్‌ పోయింది.
మ్యాటర్‌ చెప్పి మార్క్‌కు హెల్ప్‌ చేయమని అడిగారు.
అప్పటికి సమయం అర్థరాత్రి పన్నెండు గంటలవుతోంది.
వెంటనే సమావేశాన్ని మధ్యలోని ముగించుకుని యుద్ధ విమానంలో ఇండియాకు బయలుదేరాడు అజిత్‌ దోవల్‌.
సరాసరి బేగంపేట విమానశ్రాయంలో దిగి చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు.
అప్పటికి ఇంకా నిద్రపోకుండా జూమ్‌లో అలర్ట్‌గానే ఉన్నారు. ‘హలో మిస్టర్‌ బాబుగారు..ప్రపంచం అల్లకల్లోలం అయిపోతోంది. మీరు గనక కలగ చేసుకోకపోతే పరిస్థితి చేయి దాటి పోతుంది. ఇప్పటికే ఫేస్‌బుక్కు, వాట్సాప్‌ లేక మనుషులు గిలగిలా కిందపడిపోయి కొట్టుకుంటున్నారు. ప్లీజ్‌…దయచేసి ఈ హెల్ప్‌ చేయండి. స్వయంగా ప్రధానిగారే నన్ను మీ దగ్గరకు పంపిచారు.’ అని రిక్వెస్ట్‌ చేశారు.
‘అలాగా…అయ్యో….ఇప్పుడెలా…నేను చాలా బిజీగా ఉన్నానే’ అని బిల్డప్‌ ఇచ్చారు చంద్రబాబు.
‘బిజీనా బొక్కా..ఊరికే కంప్యూటర్‌ ముందు కూచుని కునికిపాట్లు పడుతున్నారు’ నాకు తెలీదనుకుంటున్నారా ? అన్నారు దోవల్‌.
‘ సర్లే …తుపాన్లనే అడ్డుకున్నోడిని నాకిది ఒక లెక్కా…మీరలా కూచోండి నేను చెక్ చేస్తా ‘ అని తన కంప్యూటర్‌లో తల దూర్చాడు.. అప్పటికి సమయం తెల్లవారు జామున రెండు మూడు అవుతోంది. మరో అరగంట ఏవేవో కీలు టకటక లాండించి ఒక అరగంట తరవాత’యస్‌….అయిపోయింది…’ అన్నారు చంద్రబాబు.’వావ్‌…అయిపోయిందా…గ్రేట్‌ సార్‌…రియల్లీ మీరు చాలా గ్రేట్‌…
చూడ్డానికి చిన్న పిల్లల చేతుల్లో చాక్లెట్లు ఎత్తుకుపోయేవారిలాగా కనిపిస్తారు కానీ చాలా గ్రేట్‌ సార్‌ మీరు అని ఆనంద బాష్పాలు రాల్చారు అజిత్‌ దోవల్‌.’
అప్పుడే ఆయన జేబులో ఫోన్‌ మోగింది…అవతలివైపు మార్క్‌జుకర్‌ బర్గ్‌ ‘హలో…ఆ…అయిపోయింది…ఇదిగోండి మీరే మాట్లాడండి’ అని ఫోన్‌ చంద్రబాబు కు ఇచ్చారు.
‘థాంక్యూ వెరీమచ్‌ సార్‌…మీరింత మేధావి అని నాకు తెలియదు..’
‘ఇలాంటి చాలా ఉన్నాయి నా దగ్గర…మా మోదీ గారు చెప్పలేదా..’ అని అడిగాడు చంద్రబాబు గర్వంగా…
‘వన్స్‌ అగైన్‌ థాంక్యూ వెరీమచ్‌ సార్‌ ‘అని ఫోన్‌ పెట్టేశాడు మార్క్‌….
వెంటనే సుఖీభవ…సుఖీభవ అని చంద్రబాబు వద్ద సెలవు తీసుకుని యుద్ధ విమానంలో అర్జంటీనా కు వెళ్లిపోయాడు అజిత్‌ దోవల్‌…
జూబ్లీహిల్స్‌లో తన బెడ్‌రూమ్‌లో గాఢ నిద్రలో ఉన్న బాధాకృష్ణ ఉలిక్కిపడి లేచి కూచున్నాడు. అప్పటవరకు ఆయన కంటున్న కల చెదిరిపోయింది. మా బాబు సీఎంగా ఉంటే ఇలాంటి పిట్టకథలు ఎన్నో రాసుకునేవాడిని. ఛ…అలాంటి అవకాశం పోయింది అని ఆవలించి మళ్లీ ముసుగు తన్ని పడుకున్నాడు….

Leave a Reply