Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్థులు ఆందోళనలో పాల్గొంటే సస్పెండ్ చేస్తారా.?

– వైస్ ఛాన్సలర్లు..వైసీపీ కౌన్సిలర్లుగా వ్యవహరించడం సిగ్గుచేటు
– టీ.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్
రాయలసీమ యునివర్సిటీలో ఆందోళనలో పాల్గొన్న ఐదుగురు బీటెక్ విద్యార్థులను సస్పెండ్ చేయడం దుర్మార్గం. సస్పెన్షన్ ఎత్తేయకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనలకు పిలుపునిస్తాం. వైస్ ఛాన్సలర్లు..వైసీపీ కౌన్సిలర్లుగా వ్యవహరించడం సిగ్గుచేటు. యూనివర్సిటీ వీసీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారు. విద్యార్థలకు దక్కాల్సిన ప్రయోజనాల కోసం వారు పోరాడే హక్కు లేదా.? విద్యార్థులు తలుచుకుంటే వైసీపీ ప్రభుత్వమే సస్పెన్షన్ అవుతుంది.? యువభేరీ అంటూ గతంలో జగన్ రెడ్డి యూనివర్సీటీల్లో జెండాలు కట్టి సభలు, సమావేశాలు పెట్టిన సంగతి గుర్తు లేదా.?
అప్పుడు ఏ విద్యార్థిపైనా టీడీపీ ప్రభుత్వం చర్యలూ తీసుకోలేదన్న విషయం గుర్తుంచుకోవాలి. పోరాడటం విద్యార్థలుకు అంబేద్కర్ ఇచ్చిన హక్కు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అభ్యసించే విద్యాలయాల్లో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తామంటే చూస్తూ ఊరుకోం. హక్కుల కోసం ప్రభుత్వం మీద పోరాడే హక్కు విద్యార్థలకు వుంది. చేయకూడని నేరం విద్యార్థులు ఏమైనా చేశారా.? ప్రభుత్వంపై ఆందోళనలు, నిరసనులు అనే మాట రాష్ట్రంలో వినపడకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రభుత్వ కుట్రకు వర్సీటీ వీసీలు తొత్తులుగా మారుతున్నారు. జగన్ రెడ్డి విద్యార్థులకు, నిరుద్యోగులకు చేసిన మోసానికి తిరగబడే రోజు దగ్గర్లోనే వుంది. వెంటనే ఐదుగురు విద్యార్థులపై వేసిన సస్పెన్షన్ ఎత్తేయాలి.

LEAVE A RESPONSE