ఇక్కడ న్యాయం హత్య చేయబడింది

211

తెలంగాణ గోస పడుతుంది
తెలంగాణ ఆయాస పడు తుంది.

ఇక్కడ న్యాయం హత్య చేయబడింది
అధికారులందరూ ప్రభువులకు బానిసలు అయ్యారు.
బాధిత ప్రజల గోస వినిపించే వ్యవస్థ లేదు.
బాధిత ప్రజల గోస వినే వ్యవస్థ లేదు. అడుగడుగున అన్యాయం రాజ్యం చేస్తుంది.

కుక్కల వలె
నక్కల వలె
సందులలో
పందుల వలె

అక్రమ సంపాదనకు
తెగపడు చుండు ప్రతి ఒక్కడు
భూము లైతే నేమి
ఘను లైతే నేమి
ప్రాజెక్టు లైతే నేమి
పథకాల మాటున
పచ్చ నోట్లు మేస్తున్నారు
తెలంగాణకు ముందు.. తరువాత
యేలే టోడి ఆస్తుల లెక్క కనిపించడం లేదా?
ఓటరా? ఇందుకేనార? ఓటేసింది

– నారగొని ప్రవీణ్ కుమార్