Home » జగన్ రెడ్డి డ్రామాలకు బీసీలే బలిపశువులా?

జగన్ రెడ్డి డ్రామాలకు బీసీలే బలిపశువులా?

-ఐదేళ్లలో వందల మంది బీసీల ప్రాణాలు తీశారు
-‘గులకరాయి’ డ్రామాలో బీసీలను బలిచ్చే కుట్ర సిగ్గుచేటు
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. గతంలో కోడికత్తి డ్రామాలో ఒక దళిత బిడ్డను ఐదేళ్ల పాటు జైలుపాల్జేశారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారు. డబ్బులిస్తామని తీసుకెళ్లారు. మాట తప్పి మడమ తిప్పి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఎర్రని ఎండలో రోజంతా తిప్పారు. జే-బ్రాండ్ మద్యం పోసి మతి బ్రమించేలా చేశారు. కోడికత్తి డ్రామా సమయంలో అధికారంలో ఉన్నవారే బాధ్యత వహించాలన్నారు.

ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే. బాధ్యత వహించాల్సింది మీరే. కానీ ప్రతిపక్షాలపై నెట్టేయాలనుకోవడానికి సిగ్గుపడాలి. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలకు మీరు చేస్తున్న మోసం, దగా, వంచనకు మిమ్మల్ని మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలంతా సిద్ధమైపోయారు. ప్రజల్లో మొదలైన తిరుగుబాటుతో వైసీపీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. దాన్ని తెలుగుదేశం పార్టీపై చూపుతామంటే చూస్తూ ఊరుకునేది లేదు. జగన్ రెడ్డిలో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. రాజకీయాలకు బదులు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి ఉంటే దేశం గర్వించే మంచి నటుడు అయ్యేవాడు.

చిన్న గులకరాయి తగిలితే ఏదో జరిగిపోయిందంటూ డ్రామాలాడుతున్నారు. కిరాయి ఇస్తామని ఇవ్వకపోవడంతో గులకరాయి విసిరితే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? 24 క్లెమోర్ బాంబులు పేలి 15 అడుగుల మేర ఎగిరి పడిన వ్యక్తి కూడా ఏ రోజూ సానుభూతి కోసం ప్రయత్నించలేదు. కానీ, గులకరాయి తగిలితే సానుభూతి డ్రామాలు ఆడటానికి సిగ్గనిపించడం లేదా? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఇప్పటికైనా మీ డ్రామాలకు బీసీలను బలివ్వాలనే ఆలోచన మానుకోండి

Leave a Reply