Suryaa.co.in

Andhra Pradesh

నవమి వేడుకల్లో నారా లోకేష్

మంగళగిరి: మంగళగిరి ఎపిఎస్ పి 6వ బెటాలియన్ లో కొలువై ఉన్న రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలకు యువనేత నారా లోకేష్ హాజరయ్యారు. తొలుత శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్న యువనేత లోకేష్… అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో రాములవారు చూపించారు. ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే ఎలాంటి కష్టాల నుండైనా బయటపడవచ్చని అన్నారు. రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగిన ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని లోకేష్ ఆకాంక్షించారు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడి జీవితం నేటితరానికి ఆదర్శం కావాలని లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE