– రేవంత్. . ఇదిగో అక్షరాల 50 వేల కోట్ల స్కాం
– నాడు 4 నుంచి 5 కాస్ట్ తో విద్యుత్ కొనుగోలు చేయొచ్చు అన్న రేవంత్ రెడ్డి
– నేడు 10 రూపాయలు ఒక్క యూనిట్ కోసం ఖర్చు చేస్తానంటున్నాడు
– ఎందుకు ఎన్టీపీసీది వద్దు అంటున్నవు?
– ఎవరికి ప్రయోజనం చేయడం కోసం? కమీషన్ల కోసమే కాదా?
– ఇందులో దాదాపు 30-40శాతం కమీషన్లు అందుకోబోతున్నారు
– రేవంతు స్కాంలను వరుసగా ఆధారాలతో సహా బయటపెడతాం
– త్వరలో హైదరాబాద్ అండర్ గ్రౌండ్ కేబుల్ స్కాం, పంపుడ్ స్కోరేజీ, బ్యాటరీ స్టోరేజీ స్కాం బయటపెడతాం
– మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: మొన్న రేవంత్ రెడ్డి చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ ల్యాండ్ స్కాం బయటపెట్టింది బిఆర్ఎస్ పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి మరో అతి పెద్ద పవర్ స్కాంకు రూపకల్పన చేసిండు. ఆ వివరాలను ఆధారాలతో బయటపెడుతున్నాం. ఇది అక్షరాల 50వేల కోట్ల స్కాం. ఇందులో దాదాపు 30-40శాతం కమీషన్లు దండుకోబోతున్నరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏది మాట్లాడినా, ఏం చేసినా.. ఏది చేయ్యకున్నా దాని వెనుక ఒకే ఒక్క మిషన్ ఉంటది. అదే కమీషన్. రేవంతు రెడ్డి ప్రభుత్వం తమకు తాము ఎట్ల మేలు చేసుకోవాలె. ఏ ప్లాన్ వేసి కమీషన్లు కొల్లగొట్టాలె, వాటాలు ఎట్ల పంచుకోవాలని మాత్రమే ఆలోచిస్తుంది. రేవంతు పాలన అవినీతి కంపుతో గాడి తప్పింది. ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మీటింగ్ లు దేని మీద జరుగుతున్నయి? వాటాలు, కమీషన్లు కోసం క్యాబినెట్ మీటింగ్ లు పెట్టుకున్నరు.
ఆ పంపకాల్లో తేడా రావడంతో బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నరు. అందుకే దండుపాళ్యం బ్యాచ్ లెక్క తయారు అయ్యారు అన్న. అదే నిజం అని తేలుతున్నది. నిన్న క్యాబినెట్ మీటింగ్ దేని కొరకు? అసలు ఏం మాట్లాడుకున్నరు. ఆ విషయాలు చెప్పకుండా.. 5లక్షల కోట్లు దండుకునే కుట్ర ఒక్క ముఖ్యమంత్రిదే కాదు, మొత్తం క్యాబినెట్ సబ్ కమిటీది అన్నరు. ల్యాండ్ స్కాం పై ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు. రామగుండం, పాల్వంచ, మక్తల్ లో 800 మెగావాట్ల నిర్ణయం తీసుకున్నరు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ఎన్టీపీసీ, జెన్ కో కు అవకాశం కల్పిస్తారట.
ఏది తక్కువ వ్యయంతో ప్లాంటు నిర్మించి, తక్కువ రేటుకు కరెంటు ఇస్తం అంటే దానికే అవకాశం ఇస్తరట. ఎంత డ్రామా? రేవంత్ రెడ్డి? ఒక మెగావాట్ ఉత్పత్తికి 12.23 కోట్ల ఖర్చు తో మొత్తం 2400 మెగావాట్లు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ఎన్టీపీసీ డీపీఆర్ చేసుకున్నది. కానీ జెన్ కో డీపీఆర్ లో మాత్రం మెగావాట్ ఉత్పత్తికి 14కోట్లు అవుతుందని స్పష్టంగా పేర్కొంది. ఒక మెగావాట్ కు రూ. 12.23 కోట్లు ఎన్టీపీసీ ఖర్చు చేస్తే.. జెన్కో 14కోట్లు ఖర్చు చేస్తదని డీపీఆర్ లోనే ఉంది. ఇందులో ఏది మేలు.. ఎక్కువ ధరనా, తక్కువ ధరనా.? ఇదంతా తెలిసి కూడా డ్రామా ఎందుకు రేవంత్ రెడ్డి? గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల ఖర్చు చూస్తే..మెగావాట్ కాస్ట్ వైటీపీపీ 8.63 కోట్లు, భద్రాద్రి 9.74కోట్లు, ఎన్టీపీసీ 12.23 కోట్లు. కానీ రేవంతు నిర్మించబోయే పవర్ ప్లాంట్ కాస్ట్ పర్ మెగావాట్ 14 కోట్లు.
ఈ 14 కోట్లు కూడా ఇనిషియల్ కాస్ట్. నిజానికి రామగుండం దగ్గర.. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క రామగుండం వద్ద పవర్ ప్లాంట్ నిర్మించేందుకు అంతా సిద్దంగా ఉంది. భూసేకరణ చేయాల్సింది లేదు, పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి తోడు ఎఫ్ జీ డీ నిబంధనల్లో సడలింపుల వల్ల మెగావాట్ ఉత్పత్తి కాస్ట్ కోటి రూపాయల వరకు తగ్గుతుంది. మెగావాట్ కు యాదాద్రి ఏడున్నర అయితే ఇప్పుడు మీరు 14 కోట్లు ప్రతిపాదించారు. పూర్తి అయ్యే వరకు 16 అవుతుంది. 800 మెగావాట్లు అంటే ప్రతి మెగావాట్ కు ఏడు కోట్లు అంటే మొత్తం 5600 కోట్లు. రామగుండం, పాల్వంచ, మక్తల్ లో మొత్తం 15,20వేల కోట్లు ధరలు పెంచి బడా స్కాంకు పాల్పడుతున్నారు.
మా కేటీఆర్ అన్నట్లు రేవంత్ రెడ్డిలో ఇద్దరు మనుషులు ఉంటరు. ఒకటి రాము, ఒకటి రెమో. ఆయనే ఓసారి తప్పు అంటడు, ఆయనే మల్లా రైటు అంటడు. ఆయనే ఓసారి కాదు అంటడు, ఓసారి ఔను అంటడు. అపరిచితుడి లెక్క బిహేవ్ చేస్తడు. చంద్రముఖి లెక్క మారిపోతడు. విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం చేస్తున్నడు? మాటలకు చేతలకు ఏమన్నా సంబంధం ఉందా? ప్రతిపక్షంలో ఉండంగా పవర్ ప్లాంట్లు దండుగ అన్నడు. ఇప్పుడు పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట అందినకాడికి దండుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసిండు. కమిషన్ల కక్కుర్తికి నిలువెత్తు నిదర్శనం నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న ధర్మల్ పవర్ ప్లాంట్స్ప్ర తిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ‘‘బిఆర్ఎస్ ప్రభుత్వం 2400 మెగావాట్ల విద్యుత్ కోసం ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకపోవడం తెలంగాణకు తీరని అన్యాయం, చారిత్రక ద్రోహం” అన్నడు.
ఇప్పుడు అదే రేవంతు రెడ్డి భారీ వ్యయంతో కొత్త థర్మల్ కేంద్రంల ఏర్పాటుకు సిద్దం అయ్యిండు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. రేవంతు సొంత ప్రయోజనాల కోసం. కాంగ్రెస్ కమీషన్ల కోసం. ఇదే రేవంత్ రెడ్డి.. అధికారంలోకి రాగానే అసెంబ్లీలో జులై 29, 2024 ఏం అన్నడు..— ‘‘మార్కెట్లో 5రూపాయలకే యూనిట్ అందుబాటులో ఉంది. ఎన్టీపీసీ నుంచి తీసుకుంటే.. ఒక్క యూనిట్‌కు 8–9 రూపాయల ఖర్చు వస్తుంది. అంత రేటు అవసరం లేదు” అన్నడు. ఇప్పుడు ప్రతిపాదిత రామగుండం ప్లాంట్ డీపీఆర్ ప్రకారం అనుకున్నా.. యూనిట్ కు 7.92 పర్ యూనిట్ ఖర్చు చేయబోతున్నడు.
అప్పుడు 5 రూపాయలు అన్న రేవంతు రెడ్డి.. ఇప్పుడు ఎందుకు యూనిట్ కు 8 రూపాయలు ఖర్చు చేయబోతున్నడు. నిజానికి ఈ 800 మోగావాట్ల ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం నాలుగైదు ఏండ్లు పడుతుంది. అదనంగా పెరిగే ఇతర వ్యయాలు కలుపుకుంటే ప్లాంటు నిర్మాణ వ్యయం 10,880 కోట్ల నుంచి 14,15వేల కోట్లకు పెరుగుతుంది. కరెంట్ యూనిట్ కాస్ట్ 7.92 నుంచి 9,10 రూపాయలకు పెరుగుతుందని అంచనా. అంటే యూనిట్ కు 10 రూపాయలు ఖర్చు చేయబోతున్నడు. నాడు 4 నుంచి 5 కాస్ట్ తో విద్యుత్ కొనుగోలు చేయొచ్చు అన్న రేవంత్ రెడ్డి నేడు 10 రూపాయలు ఒక్క యూనిట్ కోసం ఖర్చు చేస్తానంటున్నాడు. ఎవరికి ప్రయోజనం చేయడం కోసం? కమీషన్ల కోసమే కాదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. మెగావాట్ కాస్ట్ ఎక్కువే, పవర్ యూనిట్ కాస్ట్ ఎక్కువే? 2400 మెగావాట్ల ప్లాంట్లు అంటే 50వేల కోట్లు కావాలె.
ఇందులో 80శాతం అప్పు, 20శాతం జెన్కో. అంటే చెప్పులు ఎత్తుకుపోయే వాడికి 40వేల కోట్ల అప్పులు ఎక్కడ ఇస్తరు, పది వేల పెట్టుబడి ఎక్కడ తెస్తవు? NTPC స్టేజ్–1లో భాగంగా నిర్మించిన (2×800) మెగావాట్ల ప్లాంట్ నుండి యూనిట్‌కు రూ.4.88 నుండి రూ.5.96 వరకు ధరతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకున్నది. ఇప్పుడు అదే NTPC స్టేజ్–2లో భాగంగా (3×800) మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగా 2400 మెగావాట్ల ప్లాంట్ నిర్మిస్తోంది. 4.12 రూపాయలకే యూనిట్ విద్యుత్ ఇచ్చేందుకు మేం సిద్దంగా ఉన్నం,రాష్ట్ర విభజన చట్టంలో భాగంగానే మేం కట్టాము అని ఎన్టీపీసీ రాష్ట్రానికి చెప్పింది. 2400 మెగావాట్లు విద్యుత్ సప్లై చేస్తం అన్నది. మూడు లేఖలు రాసింది. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. పెట్టుబడి అవసరం లేదు, రాష్ట్రం అప్పులు తేవాల్సిన అవసరం లేదు. రూపాయి పెట్టుబడి లేకుండా ఎన్టీపీసీ కరెంటు ఇస్తా అనంగా ఎందుకు తీసుకోవడం లేదు.
కేంద్ర ప్రభుత్వం, ఎన్టీపీసీ 2400 మెగావాట్ల కరెంటు ఇస్తా అంటే వద్దని 10 రూపాయలకు కరెంటు తయారు చేస్తం అంటున్నవు ఎందుకు ఎన్టీపీసీది వద్దు అంటున్నవు. ఎన్టీపీసీని తిరస్కరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? కేసీఆర్ ఎంతో ముందు చూపుతో నల్లగొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంకల్పించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పటి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఏమన్నడు.. ‘‘మేం అధికారంలోకి వస్తే ప్రాజెక్టు ఆపేస్తాం. అన్యాయమైన ప్రాజెక్టు ఇది. కాలుష్యకాసారంగా మా ప్రాంతాన్ని మారుస్తున్నారు. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా దీని మీద లీగల్ గా పోతం. పోరాటం చేస్తం. నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అని వరల్డ్ వైడ్ గా చర్చజరుగుతున్నది’ అన్నడు. ఇట్ల అన్న కోమటి రెడ్డి అధికారంలోకి రాగానే పోటీ పడి మరీ ప్రారంభించిండు.
ఫోటోలకు ఫోజులు ఇచ్చిండు. ఓ సారి ముఖ్యమంత్రి ప్రారంభించిండు, ఓ సారి భట్టి తో కలిసి ప్రారంభించిండు. బిఆర్ఎస్ ప్రభుత్వం 95శాతం పూర్తి చేసిన ప్రాజెక్టును తమ గొప్పతనంగా చెప్పకొని, జాతికి అంకితం చేసారు. నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేదే మా విధానం అన్న మంత్రి కోమటిరెడ్డి గారూ.. ఇప్పుడు కొత్తగా మూడు పవర్ ప్లాంట్ల గురించి క్యాబినెట్ లో చర్చిస్తుంటే ఏం చేస్తున్నారు? కమీషన్ల కోసమా? వాటాలా కోసమా? ఎందుకు పెదవులు మూసుకున్నవు కోమటి రెడ్డి? సమాధానం చెప్పు. థర్మల్ పవర్ ఉత్పత్తిని 2026 నాటికి 40శాతం తగ్గిస్తమని శ్వేతపత్రంలో స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ.. “ఇకపై థర్మల్ పవర్ కాదు, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్తాం” అని చెప్పిండు. 2030-31 నాటికి 20వేల మెగావాట్ల రెన్యువబుల్ ఇంధన ప్లాంట్లు నిర్మిస్తామని ఇటీవల విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఇంధన పాలసీలో స్పష్టంగా పేర్కొన్నడు. శ్వేతపత్రం పక్కన పెట్టి, తానే ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీని క్లీన్ గా పక్కన బెట్టి.. కమీషన్లు దండుకునేందుకు వేల కోట్లతో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నడు.
సోలార్ ఉత్పత్తి అతీగతీ లేదు ఇంకేం అన్నడు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా సోలార్ ప్లాంట్లను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్పగిస్తం అన్నడు. మహిళలను పవర్ ప్లాంట్ల ఓనర్లు చేస్తం అన్నడు. ఏమైంది.. ఏడాది కావొస్తున్నది. అతీ గతీ లేదు. నాలుగు ఎకరాలు ఒక్కో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కు ఇస్తానన్నడు. ఇప్పటి వరకు ఎన్ని భూములు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అప్పగించిండు అనేది రేవంత్ రెడ్డి చెప్పాలె. ఆరంభ శూరత్వం తప్ప చేతలు శూన్యం కొత్త డిస్కం తెస్తరట. ప్రైవేటీకరణ కోసమే ఇదంతా.. ఇప్పటికే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉన్నయి. ఇవి కాకుండా మరో కొత్త డిస్కం ఏర్పాటు చేస్తం అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రాంతాల వారీగా డిస్కం ఉంటే.. ఇప్పుడు పథకాల కోసం ఒక డిస్కం ఏర్పాటు చేస్తాడట. ఎందుకుంటే లాభాలు వచ్చే డిస్కంలను ప్రైవేటు పరం చేసేటందుకు ఈ కుట్ర. ఆదాయమే రాని డిస్కంల నిర్వహణ ఎట్ల సాధ్యమైతది.
దానికి అప్పులు ఎట్లా వస్తయి. అక్కడున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి అవుతుంది. బిజేపీ ప్రభుత్వం డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి యాక్షన్ చేస్తున్నడు. కొత్త డిస్కం ఎవరిని ఉద్దరించడానికి పెడుతున్నావు? కొత్త డిస్కంలో ఉద్యోగులు పని చేస్తారా? లగ చర్ల, మూసీ, ఆర్ ఆర్ ఆర్, హెచ్ సీ యూ, హైడ్రా… నిన్న పారిశ్రామిక భూములు. రేవంతు ప్రభుత్వం చేస్తున్న 5లక్షల కోట్ల ల్యాండ్ స్కాంను బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా మొన్న బయటపెట్టినం. నేడు 50వేల కోట్ల పవర్ స్కాంను ఆధారాలతో సహా బయటపెడుతున్నం. ప్రజలను మీడియాను అప్రమత్తం చేస్తున్నాం. ఈరోజు 50వేల కోట్ల స్కాం బయటపెట్టాం దమ్ముంటే సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి.
ఇట్ల రేవంతు స్కాంలను వరుసగా ఆధారాలతో సహా బయటపెడుతాం త్వరలో హైదరాబాద్ అండర్ గ్రౌండ్ కేబుల్ స్కాం, పంపుడ్ స్కోరేజీ, బ్యాటరీ స్టోరేజీ స్కాం బయటపెడుతాం. త్వరలో రేవంతు రెడ్డి చేసిన ఇంటర్ స్టేట్ స్కాంను ఆధారాలతో సహా బయటపెడుతాను 90శాతం సమాచారం సేకరించినం. ఇంకో 10శాతం రెండు మూడు రోజుల్లో వస్తుంది. వెంటనే మీడియా సాక్షిగా రేవంతు ఇంటర్ స్టేట్ స్కాంను బయటపెడుతాం. బరితెంగించి స్కాంలు చేస్తున్నారు. నువ్వు అసెంబ్లీలో పెట్టిన దానికి కట్టుబడి ఉన్నవా లేదా? తక్కువ రేటు కరెంటు వస్తుంటే ఎక్కువ ఉత్పత్తి రేటుతో ప్లాంట్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నావు? ఎన్టీపీసీ తక్కువ ధరకే 2400 మెగావాట్లు ఇస్తము అన్నది నిజమా కాదా? లేఖలు రాసింది నిజమా కాదా? ఎన్టీపీసీ చైర్మన్ నీ వద్దకు వచ్చి 2400 మెగావాట్లు తక్కువకే ఇస్తము అని చెప్పింది నిజమా కాదా? ఎందుకు నీ కమీషన్ల కోసం విద్యుత్ ప్లాంట్లు కట్టే ప్రయత్నం చేస్తున్నవు రేవంత్ రెడ్డి? వీటన్నిటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.