యునెస్కో గుర్తించిన సంతకం అది
కొందరి సంతకాలు చూస్తే ముచ్చటేస్తుంటుంది. ఇంకొందరి సంతకాలు అసలు అర్ధం కావు. కానీ అసలు ప్రపంచంలో ఇప్పటివరకూ విచిత్ర తరహా, వింత సంతకం చేసిన ఈ సబ్ రిజిస్ట్రార్ మాత్రం ప్రపంచాన్నే మెప్పించారు. అందుకే ఆయనది ప్రపంచ అద్భుత సంతకమయింది. ఆ విశేషాలిమిటో చూద్దాం రండి. కర్ణాటకలో ఒక సబ్ రిజిస్టర్ గారి సంతకం ఇది.. యునెస్కో వారు దీనిని ప్రపంచంలోనే అద్భుతమైన సంతకంగా గుర్తించారు. సంతకం అనేది చాలా చాలా ముఖ్యమైనది అనీ అందరికీ తెలుసు.
ఈ సంతకంలో ఏముంది అనే వారు ఒకటి గుర్తించాలి. మాములుగా అందరూ పెట్టే సంతకాలు చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా కూడా అది దొంగ సంతకం ఏమో అనే అనుమానం చాలా చోట్ల వ్యక్తపరుస్తారు.
బ్యాంకులలోనూ, పోస్టాఫీస్ లోనూ డబ్బులు డిపాజిట్లు వేసే వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ. అలాగే చాలా లావాదేవీల్లో సంతకం ఎంత ప్రాముఖ్యమో చదువుకున్న వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది. అటువంటిది ఇది చాలా అరుదైన సంతకం. పొరపాటున కూడా ఈ సంతకాన్ని ఎవరూ ఫోర్జరీ చెయ్యలేరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే… ఈ సంతకంలో చాలా చాలా కష్టతరమైన స్ట్రోక్ లు ఉన్నాయి. అతను సంతకం పెట్టిన ప్రతి సారీ ఒక్క స్ట్రోక్ కూడా మిస్ అవ్వకుండా ఒకే రకంగా పెట్టడం అనేది మాత్రం సామాన్య విషయం కానేకాదు.
– మహబూబ్ సుభానీ షేక్