శ్రీ ప్రసన్నవెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో.. శ్రీ కుబేర జ్ఞానదక్షిణామూర్తి ఆలయ శంకుస్థాపన

సికింద్రాబాద్‌ శ్రీనివాసనగర్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శ్రీ కుబేర జ్ఞాన దక్షిణామూర్తి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. పుష్పగిరి పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకరభారతి స్వామి, ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు.

ఆరు దశాబ్దాల ఆధ్మాత్మిక చరిత్ర ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయంలో, ప్రస్తుతం పునర్మిర్మాణ కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. శ్రీశైలంలో కొలువుదీరిన కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి, పాదయాత్రగా ఇక్కడికి వచ్చి ఈ ఆలయ ప్రతిష్ఠ చేశారు. ఈ క్రమంలో ఆలయ ఆవరణలో శ్రీ కుబేర జ్ఞాన దక్షిణామూర్తి ఆలయానికి శంకుస్థాపన జరగడం విశేషం.

ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్‌ బస్వరాజు శ్రీనివాస్‌, కార్యదర్శి ఆత్మారామ సూర్య సుబ్రహ్మణ్యం, స్థానిక కార్పొరేటర్‌ సామల హేమ, ఈఓ కె.రాజేష్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ వేణుగోపాలరావు, సభ్యులు చివుకుల బాలభాస్కర్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.