బిడ్డ పుట్టినప్పుడు…
“లాలీ లాలీ లాలీ లాలీ…
లాలీ లాలీ లాలీ లాలీ…
వటపత్రసాయికి
వరహాల లాలీ
రాజీవనేత్రునికి రతనాల లాలీ
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలీ…”
16 ఏళ్ళకి:
“పదహారు ప్రాయంలో
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి.
నేటి సరికొత్త జాజిపువ్వల్లె
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి…”
18 ఏళ్ళకి:
“ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలీ ఇదేం అల్లరీ..
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ వుంది..
అరే ఇదేం గారడీ
35 ఏళ్ళకి:
“ఎందుకే రవణమ్మా పెళ్ళెందుకే రవణమ్మా
ఎందుకే రవణమ్మా పెళ్ళెందుకెే రవణమ్మా
తాను దూర సందు లేదు
మెడకేమో డోల రవణమ్మా
సతాయించాకే రవణమ్మా
బాగోదే రవణమ్మా
ఛీ ఛీ అంటారే రవణమ్మా”
45 ఏళ్ళకి:
“జన్మమెత్తితిరా..
అనుభవించితిరా..
జన్మమెత్తితిరా..
అనుభవించితిరా..
బ్రతుకు సమరములో..
పండిపోయితిరా..
బ్రతుకు సమరములో..
పండిపోయితిరా..
55 ఏళ్ళకి:
“సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో
ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో
సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక రణరంగం..”
65 ఏళ్ళకి:
“కాశీకి పోయాను రామాహరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి..”
75 ఏళ్ళకి:
“జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే
సన్యాసం శూన్యం నాదే”
85 ఏళ్ళకి:
“రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేదులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే…
లోకమెన్నడో చీకటాయెలే…”
100 ఏళ్ళకి:
“చుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు.
చుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు.
– జానకీదేవి