– బోలెడంత చెడు నేర్పుతున్న నేటి సినిమా!
హీరో అనబడే రౌడీ 300 కోట్లు లాగేసుకుని,
దర్శకుడు అనే గారడి వాడు మరో 200 కోట్లు తీసేసుకుని,
తతిమ్మా శాల్తీలన్నీ మరో 100 కోట్లు పంచేసుకుని,
సెట్టింగు లు అమాంబాపతంటూ మరో 100 కోట్లు పిచ్చి లెక్కలేవో చూపించి,
ప్రభుత్వ పెద్దలకు, రాజకీయ నాయకులకు నజరానాలు చెల్లించి,
సినిమా పేరుతో
దౌర్జన్యకరమైన ఈ ముఠా ఇలా
ఓ అయిదారొందల కోట్ల రూపాయలు పంచేసుకుని, తమ బొక్కసాలు నింపేసుకుని
భారీ బడ్జెట్ సినిమా అని,
హాలివుడ్ స్థాయి సినిమా అని ఊదరగొట్టి,
ఫ్యాన్స్ పేరుతో కొంతమంది పిచ్చోళ్ళను తయారు చేసుకొని,
వాళ్ళే పూనకాలు తెప్పించి,
వాళ్ళే చొక్కాలు చింపించి
ఒక్కరోజులోనో,
మొదటి మూడు రోజుల్లోనో
ఓ 1000-1200 కోట్లో జనం జేబులు నుంచి డబ్బులు కొట్టేసే పథకాలు రచించే
ఈ అరాచక గుంపు పేరు సినిమా ‘పరిశ్రమ’
చలన చిత్రా నికి ‘పరిశ్రమ’ నే నామకరణం చేసినప్పుడే సినిమా లో ఉండాల్సిన కళా-కథా మాయ మైపోయాయి!
ఇప్పుడొస్తున్న సినిమాల్లో… మరీ పుష్ప లాంటి సినిమాల్లో మచ్చుకు కూడా కథ ఉండదు
మనుషులు అనబడే పాత్రలు బొత్తిగా ఉండవు. కళ నేది కలిగ్గాని క్కూడా దొరకదు
వింత వింత వేషాలతో ఆహార్యం
వెకిలి చేష్టలతో నటన
ప్రకృతి వైపరీత్యాలను మించిన విధ్వంసంతో ఫైట్లు
నిండా బూతు పదాలతో సంగీతమే అవసరం లేని పాటలు
అంతకు మించిన వికృత, విశృంఖల చేష్టలతో డాన్సులు
చెవులు చిల్లులు పడిపోయే ధ్వని కాలుష్యం
ఇలా అంతులేని దోపిడి ని, అరాచకత్వాన్ని కలిపితే ఈనాటి సినిమా అవుతుంది
సినిమా పేరుతో సాగుతున్న అరాచక మే ఇదంతా!
తమిళం, మళయాళం భాషల్లో అప్పుడప్పుడు కొన్నైనా మంచి సినిమాలు వస్తున్నాయి.
మన తెలుగు సినిమా చాలా చాలా అధ్వాన్నంగా, అరాచకంగా తయారయ్యింది.
ఎటువంటి సామాజిక బాధ్యతా, స్పృహా లేకుండా డబ్బు, కులం, అరాచకం వంటి జాడ్యాలతో కుళ్ళు కంపు కొడుతోంది!
ఒక యాక్టర్ కి వందల కోట్ల రెమ్యూనరేషన్ ఏంటిరా అని అడిగే వాడే లేడు.
పైగా ప్రీమియర్ షో లకు వేలం వెర్రిగా వేలు పెట్టి టికెట్లు కొని ఎగబడి మరీ ఇదిగో ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఏం నిదానంగా కొన్ని రోజుల తరవాత సినిమా చూస్తే కొంపలేమైనా మునిగి పోతాయా?
సినిమా పేరుతో…
హీరో, డైరెక్టర్, నిర్మాత, ఎగ్జిబిటర్ గా పిలవబడే
ఈ అరాచక గుంపు- ప్రభుత్వం కలిసి చేసే అనైతిక దోపిడీ సాధనమే నేటి సినిమా
ఈ అరాచకానికి సహకరించక పోవడం, బలికాకుండా ఉండడమే సగటు సినిమా ప్రేక్షకులు పొందవలసిన చైతన్యం
పిచ్చి సినిమాల కోసం ఎగబడటం మానేయండి!
మంచి సినిమా కోసం
మనమందరం ప్రయత్నించుదాం!!
కుళ్ళు సినిమాల నుండి మన పిల్లలను, కుటుంబాలను కాపాడుకుందాం!!!
– చాపరాల డిపి