Suryaa.co.in

Andhra Pradesh

తొలిప్రేమ తర్వాత నేను చూసిన విజయం ఇదే

-జీవితమంతా దెబ్బలు, తిట్లు తిన్నా
-పవన్ కళ్యాణ్

జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దాంతో అభిమానులు , సినీ సెలబ్రిటీలు ఆనందంలో తేలిపోతున్నారు. తమ అభిమాన హీరో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది పవన్ కు విషెస్ తెలుపుతున్నారు. మెగా ఫ్యామిలీతో పాటు తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా పవన్ కు అభినందనలు తెలిపారు. చాలా మంది యంగ్ హీరోలు కూడా పవన్ పై ప్రేమను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు.

ఇదిలా ఉంటే విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవన్ మాట్లాడుతూ.. నాజీవితంలో ఇంతవరకు ఎలాంటి విజయం సాధించలేదు.. ఏం మాట్లాడాలో నాకే తెలియదు. ఒకేఒక్కసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలిప్రేమ అనే విజయాన్ని చూశాను.. ఆతర్వాత అంతగా విజయం చూడలేదు. ఆతర్వాత ఎవ్వరూ నేను విజయం సాధించాను అని కానీ.. డబ్బులు వచ్చాయని కానీ.. ఏఒక్క సినిమా విజయం చెప్పలేదు అని అన్నారు పవన్ కళ్యాణ్.

అలాగే ” నా జీవితమంతా దెబ్బలు తింటాను, మాటలు పడుతాను, తిట్టించుకున్నాను. నేను ఎంత ఎదిగానో నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 కి 21 స్థానాలు గెలిచే వరకు నాకే తెలియదు” అని అన్నారు పవన్. పవన్ కళ్యాణ్ ఈ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

LEAVE A RESPONSE