Suryaa.co.in

Features

వీళ్ల ముఖ చిత్ర‌మేంటి మాస్టారూ?

(రమణ)

2019లో జ‌గ‌న్ పార్టీ గెల‌వ‌గానే – కొంత‌మంది వికృత రూపాలు, నిజ స్వ‌రూపాలూ బ‌య‌ట ప‌డ్డాయి. ఇక అధికారం త‌మ‌దే అన్న‌ట్టు, త‌మ‌ని ఓడించే మొన‌గాడే లేన‌ట్టు విర్ర‌వీగారు. గెలిచిన‌వాళ్లూ, ప్ర‌భుత్వంలో ఉన్న‌వాళ్లూ కాల‌ర్ ఎగ‌రేశారంటే స‌రే.

ఎం.ఎల్.ఏ గానో, ఎంపీగానో, ఎం.ఎల్.సీగానో గెల‌వ‌ని వాళ్లు, పోటీలో నిల‌బ‌డ‌ని వాళ్లు సైతం వైకాపా పార్టీ అడుగుల‌కు మ‌డుగులు ఎత్తుతూ, టీడీపీనీ, జ‌నసేన‌నూ టార్గెట్ చేస్తూ, జ‌గ‌న్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతూ, క‌డుపు నింపుకొనే ప్ర‌య‌త్నం చేశారు. వాళ్ల‌లో పోసాని కృష్ణ‌ముర‌ళి, రాంగోపాల్ వ‌ర్మ‌, శ్రీ‌రెడ్డి, అలీ… వీళ్లంతా ఉంటారు.

పోసాని అయితే… మైకు క‌న‌బ‌డితే చాలు, రెచ్చిపోయేవారు. ముఖ్యంగా ఆయ‌న టార్గెట్ ప‌వ‌న్ క‌ల్యాణ్! వీలున్న‌ప్ప‌డల్లా, సమ‌యం సంద‌ర్భం చూడ‌కుండా ప‌వ‌న్‌పై పేట్రేగిపోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకొన్నాడు పోసాని. టీడీపీని టార్గెట్ చేసిన వైనాలూ చాలానే చూశాం. వీళ్ల చెత్త వాగుడుకు ప్ర‌జ‌లూ విసిగిపోయారు. ఓర‌కంగా… వైకాపా అప్ర‌తిష్ట పాలుకావ‌డానికీ, ఆ పార్టీపై గౌర‌వం పోవ‌డానికి ఉన్న వంద కారణాల్లో పోసాని కూడా ఓ కార‌ణంగా చెప్పొచ్చు.

అలీ కూడా త‌క్కువ తిన‌లేదు. టీడీపీ, జ‌న‌సేన సీటు ఇవ్వ‌క‌పోవ‌డంతో వైకాపా పంచ‌న చేశారు. ప్రాణ స్నేహితుడు అని చెప్పుకొని, ప‌వ‌న్‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించారు. ఆ క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ద‌క్కిందా అంటే అదీ లేదు. కంటి తుడుపు చ‌ర్య‌గా పోసాని, అలీల‌కు రెండు నామ‌మాత్ర‌పు ప‌ద‌వులు ద‌క్కాయి. ఇప్పుడు అవీ పోయాయి. అది వేరే సంగ‌తి.

ఇక‌.. రాంగోపాల్ వ‌ర్మ సంగ‌తి స‌రే స‌రి. వోడ్కా తాగినప్పుడ‌ల్లా ఆయ‌న‌కు రాజ‌కీయం గుర్తొస్తుంది. ప‌వ‌న్‌నో, చంద్ర‌బాబునో, లోకేష్ నో ఏదో ఒక‌టి అన‌క‌పోతే ఆయ‌న‌కు తెల్లారేది కాదు. పైగా టీడీపీకి వ్య‌తిరేకంగా, వైకాపాకు అనుకూలంగా సినిమాలు తీసి, సొమ్ములు చేసుకొన్నారు. శ్రీ‌రెడ్డి లాంటి సీ గ్రేడ్ పేటియం బ్యాచ్ గురించి ఎంత చెప్పుకొన్నా త‌క్కువే. సోష‌ల్ మీడియా ఉంది, బ్లూ మీడియా త‌మ‌కు కావాల్సినంత ప్ర‌చారం ఇస్తుంద‌ని రెచ్చిపోయి నోటికొచ్చింది వాగారు.

ఇప్పుడు వీళ్ల ముఖ చిత్ర‌మేమిటో చూడాల‌నిపిస్తోంది ప్ర‌జ‌ల‌కు. ఇన్నాళ్లూ ఎవ‌ర్ని చూసుకొని విర్ర‌వీగారో, వాళ్లంతా ఇప్పుడు శంక‌ర‌గిరి మాన్యాల బాట ప‌ట్టారు. వైకాపా ప్ర‌భుత్వం దారుణంగా ఓడిపోయింది. ఓట‌మి అంటే మామూలు ఓట‌మి కాదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి క‌నీసం క్యాండిడేట్లు ఉంటారా, ఉండ‌రా అనే స్థాయి ఓట‌మి ఇది.

ఈ డిజాస్ట‌ర్ ని త‌ట్టుకోవాలంటే వైకాపాకు చాలా కాలం ప‌డుతుంది. ఓడిపోయిన మంత్రులూ, ఎం.ఎల్‌.ఏలూ ఇప్పుడు కాక‌పోయినా, మ‌రో యేడాది త‌ర‌వాతైనా మొహం చూపించ‌గ‌ల‌రు. పోసానీ అండ్ కోకు ఆ అవ‌కాశం, అదృష్టం కూడా లేదు

LEAVE A RESPONSE