ఇలా అనుకోకుండా చేసి, తల్లులు ఆనందాన్ని రెట్టింపు చేసిన ఘనత జగన్ కే.. చెందుతుంది.
చిన్న పిల్లాడిలా కేరింతలు కొడుతూ.. “దా దా తల్లి ఇటురా.. నీకు పదహైదు వేలు, నీకు పదహైదు వేలు” అని ముందుగానే వేసిన స్కిట్లతో.. కూటమి ఇంక ఎక్కడ ఇస్తుందిలే తల్లికి వందనం అనే అనుమాన బీజాలు, ఎక్కడో ఒక మూల మనసులో నాటుకొన్నాయి.
ఇవ్వాళ మొబైళ్లలో టంగ్ టంగుమని మ్రోగుతూ తల్లికి వందనం డబ్బులు వచ్చిన సందేశాలు చూసి, హమ్మయ్య xxx వెక్కిరించినట్లు కాకుండా.. నమ్మి ఓట్లు వేసిన దానికి మంచే జరిగింది అనే ఆనందాన్ని, ఒకరికంటే ఎక్కువ పిల్లలు వున్న ఇళ్లల్లో అయితే.. వైకాపా వారైనా అవధులు లేని కృతజ్ఞతలు ఉబికి వచ్చి తబ్బిబ్బు చేసింది ఇంటిళ్లపాదినీ.
తల్లికి వందనం పోస్టర్ బాయ్, టీజర్ బాయ్, బ్రాండ్ అంబాసిడర్ మాత్రం జగనే అని నా అభిప్రాయం.
– బాబు.బి