– రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం.. కౌలు రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో రాష్ట్రం
-రాష్ట్రంలో అన్ని చోట్లా గంజాయి, డ్రగ్స్ సరఫరా
– మూడున్నరేళ్లలో 21 వేలమంది యువత ఆత్మహత్యలు
-సిలికా శాండ్ అమ్మకాల్లో సొంతవర్గం వారిని కూడా జగన్ రెడ్డి బ్యాచ్ వదల్లేదు
– మెడమీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్న సిఎం జగన్ రెడ్డి
– దేశంలో జడ్జిలను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా?
– ఢిల్లీ వెళ్లిన జగన్ రెడ్డి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి అడిగాడా.?
– 2022 విద్వంసాలు, అరాచకాలతో ముగిసింది
2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నాం.బాదుడు, విద్వేషాలు, విషాదాలు, విధ్వంసాల సంవత్సరంగా ఈ ఏడాది మిగిలిపోయింది. ప్రతివ్యక్తీ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా క్షోభ అనుభవించారు. ప్రభుత్వ పాలసీల కారణంగా అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డాయి. ప్రశ్నించిన వారిపై దాడులు చేసి, అక్రమంగా కేసులు పెట్టారు. ఇవన్నీ ప్రజల్ని క్షోభలోకి నెట్టాయి. జగన్ ను సైకో అని ఏదో మాట కోసం అనడంలేదు. అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతుంటే జగన్, అతని టీం ఆనంద పడుతున్నారు. మీడియాను కొట్టి ఆనందం పొందుతున్నాడు… సీఐడీ కేసులతో వేధింపులకు పాల్పడుతున్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ చార్జీలు మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయి.
పెంచిన ధరలు, పన్నులతో ప్రజలపై పెనుభారం మోపారు.దేశంలో రైతులపై అత్యధిక అప్పున్న రాష్ట్రం ఏపీనే. ఒక్కో రైతుపై సగటున రూ.2.42 లక్షల అప్పు ఉంది. ప్రతి రైతూ అప్పుల్లో ఉన్నాడు. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం.. కౌలు రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో రాష్ట్రం ఉంది. అధికారికంగానే 1,673 మంది రైతుల అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మనిషి అనే వాడు కనీసం ఆలోచిస్తాడు.. కానీ ఈ సిఎం ఆలోచన కూడా చేయడం లేదు. ఒక క్వింటా ధాన్యానికి 25 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. రేషన్ బియ్యం మొత్తం రీసైక్లింగ్ చేసి తరలిస్తున్నారు. రేషన్ బియ్యం ఇచ్చిన వెంటనే కలెక్ట్ చేసి పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు.కేంద్రం ఇచ్చిన బియ్యం కూడా పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో బియ్యం తరలింపు జరిగిందన్న విషయాన్ని పార్లమెంట్లో స్వయంగా కేంద్ర మంత్రి చెప్పారు. రాష్ట్రంలో అన్ని చోట్లా గంజాయి, డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. మద్యం రేట్లు పెరిగాయి కాబట్టి తాగలేక…మందుబాబులు గంజాయికి అలవాటు పడుతున్నారు.
సీఎం ఎందుకు ఇంత తీవ్రమైన అంశంపై స్పందించడం లేదు.? మూడున్నరేళ్లలో రాష్ట్రంలో మహిళలపై 52 వేల దాడులు, వేధింపుల ఘటనలు జరిగాయి. నెల్లూరు లాంటి జిల్లాలో 11 మందిపై వివిధ రకాల అఘాయిత్యాలు జరిగాయి. ఒక పోలీసు 5 ప్రాణాలు పోవడానికి కారణం అయితే మీడియా ఏమైంది.? ప్రజలు ఎందుకు ప్రశ్నించలేదు. ఇవి దారుణ పరిస్థితులు కాదా? మూడున్నరేళ్లలో 21 వేలమంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉద్యోగాలు లేవు. ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలు ఉన్నాయి. అందుకే ఆత్మహత్యలు పెరిగాయి. ఐటీలో మేటిగా నాడు నిలిచిన యువత….నేడు నిస్సారంగా అయిపోయారు. గోల్డెన్ క్వార్డలేటర్ కింద నాడు వాజ్ పేయిని ఒప్పించి ఈ ప్రాంతంలో హైవే రోడ్డు వేయించాం. నేషనల్ హైవే నేడు ఎంత బాగుంది…మరి రాష్ట్ర రహదారుల పరిస్థితి ఏంటి?స్కూళ్లలో నాడు – నేడు అని పెయింట్ వేసిన ప్రభుత్వం…విద్యా ప్రమాణాల్లో రాష్ట్రాన్ని దేశంలో 19వ స్థానానికి దిగజార్చారు. స్కాలర్ షిప్ లు కొత్తగా వచ్చిన పథకమా.? కానీ జగన్ దాన్ని కూడా పథకం అని చెపుతున్నాడు.రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్ వ్యవస్థ మనుగడ సాధించే పరిస్థితి ఉందా?టాప్ 5 యునివర్సిటీలు అమరావతికి తీసుకువస్తే…కనీసం వాటికి రోడ్లు కూడా వెయ్యలేదు.
రాష్ట్రంలో 2.70 లక్షల టిడ్కో ఇళ్లు కట్టాము. 90 శాతం పూర్తి అయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించకుండా ఈ ముఖ్యమంత్రి తుప్పు పట్టించాడు. వైసీపీలో ఎమ్మెల్యేలను చూడండి…నాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇప్పుడు కోట్లు కూడబెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ లే అవుట్ వేసినా ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో సొంత ఆస్తి అమ్ముకోవాలి అంటే కూడా ఎమ్మెల్యేకు కమీషన్ ఇవ్వాలి. సిలికా శాండ్ అమ్మకాల్లో సొంతవర్గం వారిని కూడా జగన్ రెడ్డి బ్యాచ్ వదల్లేదు.మెడమీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్న సిఎం జగన్ రెడ్డి…దానికి కృష్ణపట్నం పోర్టు వ్యవహారమే ఉదాహరణ. కందుకూరు ఘటనకు పోలీసు వైఫల్యం కారణం. అయితే దానికి కూడా ఈ సీఎం నన్ను తప్పు పడుతున్నాడు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో సంపన్న మైన ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి. జగన్ ఆస్తి రూ.370 కోట్లు. సీబీఐ చార్జిషీట్ లో వేసింది రూ.43 వేల కోట్లు. రాష్ట్రంలో జగన్ దగ్గర, అతని మనుషుల దగ్గర మాత్రమే డబ్బు ఉండాలనేది వాళ్ల అభిమతం.
రాష్ట్రం ఉన్నవాళ్లంతా జగన్ మోచేతి నీళ్లు తాగాలా.? దేశంలో జడ్జిలను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా.. ఆ పని కూడా ఈ వైసీపీ నేతలు చేశారు. నెల్లూరులో కేసుకు సంబంధించిన ఫైళ్లను కోర్టులో దొంగతనం చేశారు. కోర్టులో ఫైళ్లు దొంగతనం చేసే స్థాయికి వచ్చారంటే ఏమనుకోవాలి.? ఏప్రిల్ 11వ తేదీన మంత్రిగా కాకాణి ప్రమాణస్వీకారం చేస్తే.. 13వ తేదీన కోర్టులో దొంగతనం చేసి ఫైళ్లు మాయం చేయించాడు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటిపైనా దాడి. న్యాయవ్యవస్థ మొదలు మీడియా, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ లు అన్నీ రద్దు చేశారు. బీసీలకు ఇచ్చే ఆదరణ లాంటి బ్రహ్మాండమైన పథకం నిలిపివేశాడు. రాష్ట్రంలో నీటిపారుదల రంగమంతా నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. నదుల అనుసంధానం జరిగి ఉంటే ఎంత రాష్ట్రం ఎంతో లబ్ధిపొందేది. నాడు బాదుడే – బాదుడు అని ప్రారంభిచిన తరువాత జనంలో కదలిక వచ్చింది.
పార్టీ కార్యక్రమాలు ప్రారంభించిన తరువాత ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. సీఎం సభ పెడితే లబ్దిదారులను బెదిరించి సభలకు తరలిస్తున్నారు. జనం వెళ్లిపోతున్నారని ప్రాగణం చుట్టూ కాలువలు తవ్వారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రజలు తమకు అన్వయించుకున్నారు. కార్యక్రమం అందుకే విజయవంతమైంది. నా జీవితంలో ఎప్పుడూ చూడనంతగా జనం తరలి వస్తున్నారు. జనంలో ఆందోళన, అభద్రతా భావం ఉంది. అందుకే మా సభలకు జనం తరలి వస్తున్నారు.ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది….వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నా. జగన్ ను సైకో అంటే నేను తిట్టడం కాదు….అతని తీరు చూసి చెపుతున్నా.అవినీతి పరుడు రూ.100కోట్లో రూ.500 కోట్లో దోచుకుంటాడు… అయితే అన్ని వ్యవస్థలను విద్వంసం చేస్తూ నిర్వీర్యం చేస్తున్నాడు. నేను కుప్పం వెళితే మా వాళ్లపై 75 మందిపై కేసులు పెట్టారు. వాటికి భయపడితే మనం ఇలాగే మిగలిపోతాం.
2022 విద్వంసాలు, అరాచకాలతో ముగిసింది. 2023 ఒక ఆశ, పెనుమార్పులకు కారణం అవుతుంది. వైసీపీలో ఉన్న నాయకులు సైతం ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంపై గౌరవం ఉన్న నాయకులు వైసీపీలో కూడా ఇక కొనసాగలేరు. వారిలోనూ చర్చ మొదలైంది. స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసిన పార్టీలో వైసీపీ సర్పంచులు, ఎంపీటీ, జడ్పీటీలు ఎందుకు ఉండాలి.? వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఎవరూ ఛాలెంజ్ చెయ్యరు అనుకున్న వాళ్లను ప్రజలే చాలెంజ్ చెయ్యడంతో వైసీపీలో కలవరపాటు మొదలైంది . ముందుస్తుపైనా జగన్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రధాని మోడీని కలిసిన జగన్ దేనిపై చర్చించారు.?
ఢిల్లీ వెళ్లిన జగన్ రెడ్డి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి అడిగాడా.? తన కేసుల కోసం రాజ్యసభ స్థానాలను అమ్ముకున్న వ్యక్తి సీఎం జగన్ రెడ్డి. జగన్ ఓటుకు రూ.10 వేలు ఇస్తాడట..ఎన్ని చేసిన ప్రజలు అన్ స్టాపబుల్…టీడీపీ అన్ స్టాపబుల్. మాకు అధికారం అన్ స్టాపబుల్. ప్రజాస్వామ్యంలో ఉన్న నేతలు….ప్రతిపక్షాల పాదయాత్రలు అడ్డుకుంటాం అంటున్నారు..అంటే వాళ్లు సైకోలు అనే కదా?జగన్ అజ్ఞానానికి..అమాకత్వానికి ఏం చెపుతాం.? గోపిచంద్ అకాడమీకి స్థలం ఎవరు ఇచ్చారు.? నేను ఇచ్చిన 5 ఎకరాల్లో పెట్టిన అకాడామీలో సింధు ఆట నేర్చుకుందన్న విషయాన్ని జగన్ తెలుసుకోవాలి.
మంచి వాళ్లు ఇతర పార్టీల నుంచి వస్తే తీసుకోవడంలో తప్పులేదు.మంచి నాయకులు ఉంటే…రాష్ట్రంపై కమిట్మెంట్ ఉంటే నేతలను తీసుకుంటాం.పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లను మరిచిపోము. పార్టీలో వారికి ప్రాధాన్యం ఉంటుంది.కొవ్వూరులో 100 ఎకరాల్లో మూడు వేల కోట్లతో మిధాని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇక్కడ యువతకు ఉద్యోగావకాశాలు వచ్చేవి. రామాయపట్నం పోర్టును ఎందుకు రద్దు చేశారు.? పోర్టులు ఎందుకు చేతులు మారాయి…భూములు ఎందుకు చేతులు మారాయి.? 2,400 మెగావాట్లు ఉన్న ఎపి జెన్ కో ప్రాజెక్టును కూడా ప్రైవేటుపరం చేస్తున్నాడు. నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం. నాడు కొన్ని అరాచకాలు జరిగాయి….మాకు ఉన్న సమాచారం ఆధారంగా కొంతమందిపై చర్యలు తీసుకున్నాం. తెలుగు జాతి ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా…తెలుగుదేశంపార్టీ తెలుగువారి కోసం పెట్టిన పార్టీ.
చంద్రబాబును కలిసి గోడు వెళ్లబోసుకున్న కావలి టీడీపీ దళిత నేత హర్ష కుటుంబ సభ్యులు
తప్పుడు కేసులు పెట్టి పోలీసులు తమను వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద కావలి టీడీపీ ఎస్సీ నేత హర్ష కుటుంబ సభ్యులు శనివారం కన్నీరుమున్నీరయ్యారు. ధైర్యంగా ఉండాలని, వేధించే పోలీసుల్ని ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. హర్ష ఇద్దరు పిల్లల చదువు బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేసు విషయమై పార్టీ తరపున పోరాటo చేస్తామని భరోసా ఇచ్చారు. ఇటీవల వైసీపీ వేధింపులు తాళలేక ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు హర్ష ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.