Suryaa.co.in

Telangana

అధికారంలో ఉన్నోళ్లు శంకుస్థాపన చేశారు

-అధికారంలోకి రావలనుకున్నోళ్ళు మొక్కలు నాటారు…!!
-శంకుస్థాపన రాళ్లు వెక్కిరించాయి…
-మొక్కలు వట వృక్షాలుగా మారాయి
-అయినా నీటి గోస తీరలేదు
-తుంగతుర్తి,సూర్యాపేట ప్రజలు అరిగోస పడ్డారు
-సమైక్యాంధ్రలో జరిగిన మోసానికి ఎస్ ఆర్ ఎస్ పి తార్కాణం
-6,000 క్యూసెక్కుల నీటితో 350 కిలోమీటర్ల దూరానికి నీళ్లు ఎలా చేరుతాయి
-ఉద్యమ కాలంలొనే గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్
-మెడిగడ్డ నీళ్లతోటే తుంగతుర్తి,సూర్యాపేట,కోదాడ లో కొద్దీ ప్రాంతం సస్యశ్యామలం
-ప్రాణహితతో కలిసి సజీవంగా గోదావరి ఉన్నందునే మెడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు
-మేడిగడ్డ నుండి మిడ్ మానేరు,అటునుండి లోయర్ మానేరు మీదుగా తుంగతుర్తి, సూర్యాపేట
-ముఖ్యమంత్రి కేసీఆర్ తోటే కాళేశ్వరం జలాలు అందుకున్న తుంగతుర్తి, సూర్యాపేట రైతాంగం
-అందుకు కృతజ్ఞతతో కాళేశ్వరం జలానికి-లక్ష జన హారతి
-అంచనాలకు మించి హాజరైన జనసమూహం
మంత్రి జగదీష్ రెడ్డి

అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.అధికారంలోకి రావలనుకున్న అప్పోజిషన్ నేత మొక్కలు నాటారు అయినా సమైక్యాంధ్ర పాలనలో తుంగతుర్తి, సూర్యాపేట,కోదాడ లోని కొద్దీ ప్రాంతం భూములు బీళ్లుగా మారాయి తప్ప చుక్క నీరు రాలేదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సీమాంద్ర పాలకుల పై విరుచుక పడ్డారు.శంకుస్థాపన రాళ్లు ఈ ప్రాంత పరైతాంగాన్ని వెక్కిరించేలా మార్చగా నాటి ప్రతిపక్ష నాయకుడు నాటిన మొక్కలు కాస్త వట వృక్షాలుగా మారాయని ఆయన దుయ్యబట్టారు.

సమైక్యాంధ్రలో జరిగిన నీటి మోసానికి ఇంతకు మించిన ఉదాహరణ మరోటి ఉండదని ఆయన ఎద్దేవాచేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ శతాబ్ది వేడుకలలో బాగంగా బుధవారం సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం జలానికి-లక్ష జనహారతి పేరుతో నిర్వహించిన వినూత్న కార్యక్రమంలో ఆయన సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండల కేంద్రం 71 డిబియం వద్ద కాళేశ్వరం జలానికి హారతి పట్టి ప్రత్యెక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ క్రమంలోనే సీమాంద్ర పాలనలో జరుగుతున్న దోపిడీని కనిపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు,నిధులు,నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. కేవలం 6,000 క్యూసెక్కుల నీటిని 350 కిలోమీటర్ల దూరం పారించడం అసాధ్యమని ఉద్యమ కాలంలో సూర్యాపేట,తుంగతుర్తి నియోజకవర్గలలో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలను మంత్రి కేసీఆర్ గుర్తు చేస్తూ ఈ ప్రాంతానికి నీరు అందాలి అంటే మెడిగడ్డ నే కరెక్ట్ అని తేల్చారని ఆయన చెప్పారు.

ఈ ప్రాంతానికి గోదావరి జలాలే శరణ్యం అని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత తో కలిసి గోదావరి సజీవంగా ఉంటుందని మెడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లోనే అంకురార్పణ చుట్టారన్నారు.అధికారంలోకి వచ్చిందే తడవుగా మెడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మెడిగడ్డ నుండి మిడ్ మానేరు కు అటు నుండి లోయర్ మానేరు కు అక్కడి నుండి తుంగతుర్తి, సూర్యాపేట,కోదాడ ప్రాంతాలకు నీళ్లు పారించారని ఆయన తెలిపారు. దానితో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో భూములు సస్యశ్యామలం కావడమే కాకుండా యావత్ భారతదేశంలోనే వరి దిగుబడిలో సూర్యాపేట రికార్డు సృష్టించిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత చెప్పుకునేందుకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నీటిపారుదల దినోత్సవం రోజును ఈ ప్రాంత రైతాంగం కాళేశ్వరం జలానికి-లక్ష జన హారతి కార్యక్రమం నిర్వహిస్తామని ముందుకు రావడంతో అందరిని సమన్వయం పరిచి ఈ కార్యక్రమానికి రూపు నిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి లక్ష మందితో నిర్వహించాలి అనుకుంటే ఆ సంఖ్య లక్షా 16 వేలు దాటిందని అధికారిక గణాంకాలు వెల్కదిస్తున్నాయన్నారు.

కాళేశ్వరం జలాలతో మొదట లబ్ధి పొందిన తుంగతుర్తి, సూర్యాపేట,కోదాడ రైతాంగాం స్వచ్చందంగా భాగస్వామ్యం అయినందునే ఈ కార్యక్రమం విజయ వంతమైందని ఆయన సంతృప్తిని వ్యక్త పరిచారు.7 మండలాల పరిధిలోని 126 గ్రామాలకు చెందిన రైతాంగం బోనాలు ఎత్తుకుని ,బతుకమ్మ లు పేర్చి సామూహికంగా వంటా వార్పులు నిర్వహించి పండుగ వాతావరణం మధ్యన జరుపుకున్న కాళేశ్వరం జలానికి లక్ష జనహారతి వర్తమానానికి శాశ్వతంగా గుర్తుండి పోతుందని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE