-కారుచోలను అభివృద్ధి చేస్తాం
-నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు
గ్రామ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీంలతో సమావేశం
యడ్లపాడు మండలం కారుచోల గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. శనివారం ఆయన ప్రచారంలో భాగంగా కారుచోల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీంలతో సమావేశమయ్యారు.
అనంతరం మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయని, వాటికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామంలో నిరుపయో గంగా ఉన్న చెరువును బాగు చేయిస్తామని, కొళాయిలు ఇచ్చి ప్రతి ఇంటికీ నీరందిస్తామని తెలిపారు. సైడ్ డ్రైన్స్ నిర్మాణం, అవసరాన్ని బట్టి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఇళ్ల నిర్మాణం జరిగే పథకాన్ని సమర్థవంతంగా అమలు చెసేలా చూస్తామని తెలిపారు. ముస్లీం సోదరులకు ప్రభుత్వం నుంచి పథకాలను అమలు చేస్తామని, ఎటువంటి అపోహలు పెట్టుకో వద్దని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు సమష్టిగా మంచి చేసే వారికి, అభివృద్ధి చేసే వారికి ఓటే యాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగరాదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు