“భరతవర్షే భరతఖండే”
ఏ ఇంట్లో ఏ గుడిలో ఎవ్వరు
ఏ వేళలో ఏ దేవతార్చన చేసినా
సంకల్పములో తప్పనిసరిగ
దైవభక్తి దేశభక్తి తో పఠించడము
జరుగుతుంది ఏ నాటినుండియో
సప్తనదీ పరివాహక ప్రదేశమంతా!
“భారత్” శబ్దము ఈ దేశనామము
ఏ మత ఏ సాంప్రదాయ ఏ వంశ
ఏ ధార్మిక నామము కూడా కాదు.
ఏ వాల్మీకియో, ఏ మనువుయో,
ఏ మతాచార్యుడో, ఏ పాలకుడో
ఈ దేశానికి “భారత్” అనే పేరు
పెట్టలేదు కేవలం సంబోధించినారు.
‘హిందుస్థాన్’ మరియు ‘ఇండియా’
అనే పేర్లు విదేశీయులు పెట్టినవే.
డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర్య దేశం
విదేశీయుల పెట్టిన పేర్లతోనే
పిలిపించుకుంటూ “భావదాస్యం”లో
మ్రగ్గుచుండగా ఈనాడే “స్వతంత్ర్య భారతి”
అని పిలిపించుకొనే “స్వాతంత్ర్యం” పొందింది.