Suryaa.co.in

Features

భగవాన్ రమణులు అరుణాచలం చేరిన రోజు నేడు

1896 ఆగస్గు 29. శనివారం. మధ్యాహ్నం 11. వేకంట రామన్ గాఢమైన ధ్యానంలో వున్నాడు. ఇలా చేసేవానికి చదువెందుకు? అని అన్న అరుపులకు వేంకట రామన్ ఇళ్లు విడిచి.. అరుణాచలం వైపు అడుగులు వేశాడు. దిండివనం టిక్కెట్ తీసుకొని, ధ్యానంలో పడిపోయాడు. 2 రోజుల ప్రయాణం చేసి… అరుణాచలం దగ్గర్లో వున్న కీలూరు చేరాడు. అక్కడ ఓ వితంతువు ఆయనకు అన్నంపెట్టి, కాస్త చద్ది కట్టి ఇచ్చింది. మళ్లీ రైలెక్కి… అరుణాచలం చేరే సరికి సూర్యోదయం. అడుగులు జనకుడి గర్భగుడి వైపు పడ్డాయి. అప్పా… మీరు పిలిచారు.. నేను వచ్చేశాను.. అంటూ వేంకట రామన్ గట్టిగా అరుణాచలేశ్వరుడ్ని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత భగవాన్ రమణ మహర్షిగా మారి.. కోట్ల మందికి ఆరాధ్య దైవమయ్యారు. ఆగస్టు 29 న వేంకట రామన్ ఇంటి నుంచి బయల్దేరాడు. సరిగ్గా నేడే (సెప్టెంబర్ 1) కి అరుణాచలేశ్వరుడి పాదాల వద్దకు చేరాడు. భగవాన్ రమణులు అరుణాచలం చేరిన రోజు నేడు. సెప్టెంబర్ 1.

– శ్రీచరణ్‌శర్మ

LEAVE A RESPONSE