-మునుగోడు ఎన్నికలు నిర్వహించే ధైర్యం వారికి లేదు
-తెలంగాణా రాష్ట్రం గురించి మాట్లాడడం హాస్యాస్పదం
-చేరిన తెల్లారేసరికి ఎన్నికలే అన్నారు
-ఇప్పటికీ ఉలుకూ, పలుకు లేదు
-దీన్ని బట్టే తెలుస్తోంది బిజెపికి ఎన్నికలు అంటే భయమని
-ఒక్క నియోజకవర్గాన్ని ఎదుర్కోలేని వాళ్ళు రాష్ట్రం గురించి మాట్లాడడమా
-ఉట్టికెగరలేనమ్మ అకాశనికి ఎగిరినట్లు ఉంది
-మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట : ఉప ఎన్నికలు అంటేనే బిజెపి వణికి పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.మునుగోడులో ఉప ఎన్నికలు నిర్వహించే ధైర్యం ఆ పార్టీకి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అటువంటి వారు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.అక్కడ రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తెల్లారేసరికి ఉప ఎన్నికలు అన్నారు. ఇప్పటికీ ఉలుకూ పలుకు లేదన్నారు. దీన్ని బట్టే తెలుస్తోంది బిజేపి కి ఎన్నికలు అంటే ఎంత భయం ఉందనేది అని ఆయన స్పష్టం చేశారు. ఒక్క నియోజకవర్గాన్ని ఎదుర్కోలేని వాళ్ళు రాష్ట్రం గురించి మాట్లాడడం అంటే ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్లుందంటూ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.