Suryaa.co.in

Features

టమాట.. ఓ మాట!

ఎర్రగా ఉంటావు, ఎదలో మంటలు రేపుతున్నావు…
గుండ్రంగా ఉంటావు, మనిషిని గింగిరాలు తిప్పుతున్నావు…
రుచిగా ఉంటావు నాలుకకు చిక్కకుండా పోతున్నావు
అందంగా ఉంటావు అందకుండా కొండెక్కి కూర్చున్నావు…
వంటలకు రాణినంటావు వందల్లో ధర పలికి అందనంటావు…
టమాట ఓ టమాట మార్కెట్లో నిను చూసిన క్షణాన నోట మాట రాక, కంట నీరు దూక, వంట రుచి లేక, ఇంట నోటు సరిపోక, నిను ఓసారి తాకి వెనుతిరిగాను.

– టమాటా ప్రియుడు

LEAVE A RESPONSE