-గ్రామస్తుల ఫిర్యాదు
-పట్టించుకోని రెవిన్యూ అధికారులు
-సోషల్‌మీడియాలో రైతుల వీడియో హల్‌చల్
సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలం లోని తల్లంపాడు చెరువు నుండి గత కొంతకాలంగా మట్టి మాఫియా కు గురవుతుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విషయమై రెవెన్యూ వారి దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దొరవారిసత్రం మండలం తాసిల్దార్ కి గ్రామస్తులు చెప్పిన నేను విఆర్ఓ కి చెప్పాను అని చెప్పడం జరిగింది. కానీ వీఆర్వో గాని, రెవిన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎవరు కూడా అక్కడకు వచ్చి, బండ్లను కస్టడీకి తీసుకున్న దాఖలు లేవు. గ్రామస్తులు విఆర్ఓ ని అడగ్గా.. నేను హాస్పిటల్ లో ఉన్నాను. ఎవర్నో ఒకరిని పంపించి ఆపు చేస్తాను అన్నారే తప్ప, ఉదయం 6 గంటల నుండి ఇప్పటివరకు, ఏ ఒక్క అధికారి కూడా ఈ చుట్టుపక్కల కనిపించలేదు.
ఈ మట్టి మాఫియా కథానాయకుడు ఎవరున్నారు తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ మట్టిని తోలుకున్నటువంటి ఫ్లాట్ గల వ్యక్తి, ట్రిప్ కి 500 రూపాయలు చొప్పున నేను చెల్లిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఈ ముడుపులు ఎవరి ఖాతాలోకి పోతున్నాయి అన్న విషయం తెలియట్లేదు. ఇప్పటికైనా రెవెన్యూ వారు చర్యలు తీసుకొని బండ్లను సీజ్ చేస్తారా లేదా అని గ్రామస్తులు వాపోతున్నారు.