Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషర్‌ ఎండీ బదిలీ

-కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు
-ఎన్నికల విధులు అప్పగించొద్దని సూచనలు
-తక్షణం బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఉత్తర్వులు
-మద్యం విక్రయాల్లో ఆరోపణలే కారణం

ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై బదిలీ వేటు వేస్తూ ఈసీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులను అప్పగించొద్దని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా ఈరోజు రాత్రి 8 గంటల్లోగా బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ నియామకం కోసం ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల పేర్లు పంపాలని సూచించింది. మద్యం ఉత్పత్తి, విక్రయాల వ్యవహారంలో వాసుదేవరెడ్డిపై ఆరోపణలు రావడంతో ఈసీ చర్యలు చేపట్టింది.

LEAVE A RESPONSE