Home » వివేకా హత్యకు సూత్రధారులు జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలే

వివేకా హత్యకు సూత్రధారులు జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలే

– ప్రెస్ మీట్ లో డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి చెప్పని నిజం ఇదే
-ప్రస్తుతానికి సూత్రధారి అవినాష్ రెడ్డి, పాత్రధారులు అప్రూవర్ గా మారిన దస్తగిరి, గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్
– నా దృష్టిలో వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి లు కూడా పాత్ర దారులే
-మహేష్ బాబు హీరో గా నటించిన అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్, సరిత పవిత్ర జంటగా నటిస్తూ, హత్యలు చేయిస్తూ ఉంటారు
-వైయస్ జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలను అర్జున్ సినిమా జోడని ఆదినారాయణ రెడ్డి తరచూ అంటుంటారు… నాకు అలాగే అనిపిస్తోంది
-జగన్మోహన్ రెడ్డి తన పైన వస్తున్న అభియోగాలను ఖండించాలంటే, సిబిఐ ఎంక్వయిరీ పూర్తి చేయాలని కోరాలి… అజయ్ కల్లం వేసిన పిటిషన్ త్వరితగతిన విచారణ పూర్తయిన చూడాలి
– నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డిల ప్రమేయం ఉందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదని నరసాపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో చెప్పని నిజం ఇదేనేమోనని నేను అనుకుంటున్నానని తెలిపారు . ఈ హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలు ఉన్నారని నేను కచ్చితంగా విశ్వసిస్తున్నాను. సిబిఐ విచారణ పూర్తి అయితే, ప్రస్తుతానికి సూత్రధారి గా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా, పాత్రధారిగా మారుతారన్నారు.

వైఎస్ వివేకా హత్యకు ప్రస్తుతానికి సూత్రధారిగా అవినాష్ రెడ్డి, పాత్రధారులుగా అప్రూవర్ గా మారిన దస్తగిరి, గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లు గుర్తించడం జరిగిందన్నారు. నా దృష్టిలో వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి లు కూడా పాత్రధారులేనని తెలిపారు. మహేష్ బాబు హీరోగా నటించిన అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో వచ్చిన అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్, సరిత దంపతులు చాలా పవిత్రంగా ఉంటున్నట్టు నటిస్తూ, హత్యలు చేయిస్తుంటారన్నారు.

అలాగే జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలను అర్జున్ సినిమాలోని ప్రకాష్ రాజ్, సరిత జోడితో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తరచూ పోలుస్తూ ఉంటారని తెలిపారు. ఆదినారాయణ రెడ్డి అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నానని, నాకు కూడా అలాగే అనిపిస్తుంటుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . జగన్మోహన్ రెడ్డి తనపై మోపబడిన ఈ అభియోగాన్ని ఖండించాలనుకుంటే, సిబిఐ ఎంక్వయిరీ పూర్తిచేయాలని కోరాలన్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం రెడ్డి వేసిన పిటిషన్ విచారణ త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైయస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని రక, రకాలుగా సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలను రాస్తూ, డైవర్షన్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు.

2019 ఎన్నికలకు ముందు ఈ హత్యోదంతం పై మాట్లాడకుండా, జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానం నుండి గ్యాగ్ ఆర్డర్ తీసుకువచ్చారని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందం (సిట్ ) దర్యాప్తుపై మాకు నమ్మకం లేదని, సిబిఐ విచారణకు డిమాండ్ చేశారని గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, సిబిఐ విచారణ ముందుకు సాగకుండా అనేక అడ్డంకులు కల్పించారన్న ఆయన, ఈ కేసులో దూకుడుగా ముందుకు వెళ్తున్న అభిషేక్ మహంతి రాష్ట్రం విడిచి పారిపోయేలా ఇబ్బందులకు గురి చేశారన్నారు.

హత్యోదంతానికి ముందు జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్లు వివరించిన డాక్టర్ సునీతా రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతానికి ముందు జరిగిన సంఘటనలను ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి మీడియా ప్రతినిధులకు కళ్లకు కట్టినట్లు వివరించారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. 2019 మార్చి 15వ తేదీకి ముందు నెల రోజుల క్రితం, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ఎవరు ఎలా పథక రచన చేశారో చెప్పారన్నారు.

నేను కూడా మీడియా సమావేశంలో సునీతారెడ్డి చెప్పిన అంశాలను చెవులు, కళ్ళు పెద్దవి చేసుకొని వినటం, చూడడం జరిగిందన్నారు. మంగమ్మ ముని మనవడే మన కథానాయకుడని, రెండవ పెళ్లి అంటే కయి, కైమని అరిచే జగన్మోహన్ రెడ్డికి ఆయన పుట్టుకనే నచ్చదేమో మనకు తెలియదన్నారు.

వైఎస్ కుటుంబ వంశవృక్షం గురించి డాక్టర్ సునీతా రెడ్డి తెలియజేస్తూ, చిన్న కొండారెడ్డి కి ఏడు మంది మగసంతానం, నలుగురు ఆడ సంతానమని తెలిపారు అన్నారు. అందులో భాస్కర్ రెడ్డి ఆరవ వాడైతే, ఆయన కుమారుడే అవినాష్ రెడ్డి అని తెలియజేసిందన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరి కుమార్తెనే వైయస్ భారతి రెడ్డి అని డాక్టర్ సునీతారెడ్డి పేర్కొన్నారన్నారు.

మంగమ్మ నాలుగోవ కుమారుడైన రాజారెడ్డికి రెండవ సంతానంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మూడవ సంతానంగా వైఎస్ వివేకానంద రెడ్డి జన్మించారని డాక్టర్ సునీతా రెడ్డి వివరించారన్నారు. వైఎస్ రాజారెడ్డి మొదటి కుమారుడైన జార్జి రెడ్డి మృతి చెందారని ఆయన కుమారుడే గడ్డం అనిల్ రెడ్డి అని తెలియజేశారన్నారు.

వైయస్ వివేకా హత్యకు నెలరోజుల ముందు సునీల్ యాదవ్, జయప్రకాశ్ రెడ్డి, గంగిరెడ్డి కలిసిమెలిసి అన్యోన్యంగా, ఆప్యాయంగా, ఆహ్లాదకరమైన సమయంలో తీసుకున్న ఫోటోలను డాక్టర్ సునీతారెడ్డి, ప్రెస్ మీట్ లో ప్రదర్శించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వైయస్ వివేకా హత్యకు వారం రోజుల ముందు దస్తగిరి, సునీల్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణను సిబిఐ సేకరించింది.

తాము పంపుకున్న మెసేజ్ లన్నీ గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుస్తాయని తెలియక సాక్షి దినపత్రిక బాధితులనే, నిందితులుగా మార్చే విధంగా కథనాలు, హత్యకు గురైన వ్యక్తికి అక్రమ సంబంధాలను అంటగడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో, యజమాని చెబితే రాశారో, చెప్పకపోయినా రాశారో తెలియదు కానీ సాక్షి దినపత్రికలో అద్భుతంగా అబద్దాలను వండడం జరిగిందన్నారు. రేపో, మా పో మళ్లీ అబద్ధాల కథనాలను వండివారుస్తారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

అవినాష్ ఫోన్ నుంచి హత్య జరిగిన రోజే రాత్రి రెండున్నర గంటల నుంచి పలు నెంబర్లకు వాట్సాప్ కాల్స్
వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి రాత్రి రెండు గంటల తరువాత అనేక ఫోన్లకు వాట్సాప్ కాల్స్ వెళ్లాయని ఆధారాలతో సహా డాక్టర్ సునీతా రెడ్డి వివరించారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.. వాట్సాప్ ను ఫేస్ బుక్ టేకోవర్ చేసిన తర్వాత ఫలానా ఫోన్ నుంచి, అవతలి వ్యక్తి కి వాట్సాప్ కాల్ వెళ్లిందని గుర్తించవచ్చునన్నారు.

ఆ సమయంలో ఎవరికి ఫోన్ కాల్ వెళ్ళింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారని, తెలుసుకున్నారని కూడా చెప్పారు. అయితే ఆ విషయంలో అదృశ్య శక్తులు పని చేయడంతో, పూర్తి సమాచారాన్ని చార్జిషీట్లో సిబిఐ పొందుపరచలేక పోయిందన్నారు. అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారు జాము వరకు నిరంతరాయంగా వాట్సాప్ కాల్స్ ద్వారా ఫోన్ సంభాషణ కొనసాగిందన్నారు.

ఫేస్బుక్ వద్ద అవినాష్ రెడ్డి ఎన్ని గంటల పాటు, ఎన్ని నిమిషాల పాటు, ఎన్ని సెకండ్ల పాటు మాట్లాడారో పూర్తి డేటా ఉందన్న రఘురామ కృష్ణంరాజు, ఇదే విషయాన్ని అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి తడబడ్డారన్నారు. అప్పటికి ఇంకా ఎన్నికల హడావిడి మొదలు కాలేదని, అభ్యర్థులను కూడా ఖరారు చేయలేదన్నారు. అదేదో తెల్లారి పోలింగ్ అంటే ఏజెంట్లతో మాట్లాడారంటే అర్థం ఉందని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే, ఎన్నికల కోసం మాట్లాడానని చెప్పడం అర్థరహితమన్నారు.

హైదరాబాదులో రాష్ట్ర ప్రజలను ఎలా మోసగించాలన్నదానిపై జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రూపకల్పన కోసం లబ్ద ప్రతిష్టులైన వ్యక్తులతో సమావేశమయ్యారన్నారు. ఆ సమావేశం కొనసాగుతుండగానే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చినట్లు పైనుంచి పిలుపు రావడంతో, ఆయన అర్ధాంతరంగా సమావేశం నుంచి పై అంతస్తుకు వెళ్లి, తిరిగి సమావేశం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి, బాబాయి ఇకలేరు… చనిపోయారని అప్పుడే తనకు తెలిసినట్లుగా జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో, అందరూ నిర్గాంత పోయి సమావేశాన్ని వాయిదా వేసుకుని, ఎవరి దారిలో వారు వెళ్లిపోయారన్నారు.

ఈ విషయాన్ని సిబిఐ అధికారులకు అజయ్ కల్లం రెడ్డి పూసగుచ్చినట్లు వివరించారు. కానీ సిబిఐ అధికారులు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారని ఆయన భావించలేదు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ సంఘటనకు సంబంధించి కథనం వెలువడిన తర్వాత, తన మాటలను వక్రీకరించారని కోర్టును ఆశ్రయించారని తెలిపారు.

అయితే , సిబిఐ అధికారులు తాము రికార్డు చేసిన అజయ్ కల్లం రెడ్డి వాంగ్మూలం ఆడియోను న్యాయస్థానం ముందు ఉంచారు. కేసు వేసిన వారే, విచారణకు వచ్చినప్పుడల్లా వాయిదాలను కోరుతున్నారంటే దొంగ ఎవరు… హంతకులు ఎవరో తెలిసి పోలేదా? అని రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.

ఆసుపత్రిలో తల్లిని చేర్పించి అరెస్టును అడ్డుకునేందుకు డ్రామాలు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిబిఐ అధికారులు వచ్చినప్పుడు, ఆయన తల్లికి ఆరోగ్యం బాగాలేదని కర్నూలులోని ఒక ఆసుపత్రిలో చేర్పించి డ్రామాలను ఆడారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఆయన తల్లి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అరెస్టు ఎందుకు చేయలేదంటే సిబిఐ అధికారులు వెనక్కి వెళ్లారన్నారు , అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చేవరకు వారు కాలయాపన చేశారని, అందరూ కలిసి అద్భుతమైన నటనను ప్రదర్శించారన్నారు.

అవినాష్ రెడ్డికి బెయిల్ రాగానే, ఆయన తల్లికి ఆరోగ్యం కుదుటపడుతుందని, వైయస్ విమలారెడ్డి వచ్చి ప్రార్థనలు చేయగానే స్వాంతన చేకూరి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారన్నారు . అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు నోచుకోకుండా వాయిదాలు పడుతూ వస్తోందన్నారు.

ఎన్నికల కేసుకు సంబంధించినవాయిదా కు హాజరుకాని నేరానికి మాత్రం జయప్రదకు అరెస్టు వారెంట్ జారీ చేస్తారన్నారు . వ్యవస్థలోని అవస్థలు ఇవన్నీ అని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందన్నది తెలియదన్నారు. హైకోర్టులో దస్తగిరి కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారన్నారు. హైకోర్టులో కూడా తీర్పు వెలువడుతుందని ఆశించినప్పటికీ, తీర్పు వెలువడడం లేదన్నారు.

రేపో, మాపో దస్తగిరి పిటిషన్ పై తీర్పు వెలువడుతుందేమో నన్న ఆయన, పిటిషన్ కొట్టివేస్తారనే నేను అనుకుంటున్నానని చెప్పారు. హంతకులు అత్యంత బలవంతులు కనుక, కోర్టులో ఏమి జరుగుతుందో నని నేను అనుకుంటున్నానో నా అభిప్రాయాన్ని చెబుతున్నానని తెలిపారు. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా సిబిఐ 1000 నుంచి 1500 కాగితాలతో కూడిన చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు.

సిబిఐ చార్జ్ షీట్ లోని అక్షరాన్ని పొల్లు పోకుండా వివరించిన సునీతా రెడ్డి
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ లోని అక్షరాన్ని పొల్లు పోకుండా డాక్టర్ సునీతా రెడ్డి మీడియా ప్రతినిధులకు వివరించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె చెప్పాలనుకుని ఒక విషయం చెప్పలేదేమోనని అనిపిస్తుందన్నారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సూత్రధారులు జగన్మోహన్ రెడ్డి దంపతులేనని ఆమె వెల్లడించలేకపోయారన్నారు. సునీత చెప్పిన కథనం ప్రకారం వైఎస్ షర్మిలా రెడ్డి సిబిఐ కి ఒక లేఖ రాశారని, తన స్టేట్మెంట్ ను పరిగణలోకి తీసుకోవాలని కోరారన్నారు. షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్లో బెంగళూరులోని తన నివాసానికి వైఎస్ వివేకానంద రెడ్డి వచ్చి కలిసిన మాట నిజమేనని, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతానని నువ్వు కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని కోరారు.

ఎందుకు వద్దులే అని నేను వారిస్తుండగా, పోటీ చేయమని ఒత్తిడి చేశారు. జగన్మోహన్ రెడ్డి అడిగితే మాత్రం పోటీ చేయనని చెప్పవద్దని కోరినట్లు షర్మిల తెలిపారు. ఈ సన్నివేశాన్ని ఇటీవల విడుదలైన వివేకం సినిమాలోని రూపొందించడం జరిగిందన్నారు. గూగుల్ టేకౌట్స్, వాట్సాప్ కాల్స్, అజయ్ కల్లం రెడ్డి తడబాటు చూశాక… సిఐడి మాజీ చీఫ్ సునీల్ అండ్ గ్యాంగ్ నన్ను కొడుతుంటే కల్లారా చూసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను కూడా చూశారేమో ననిపిస్తుందన్నారు. ఎందుకంటే ఆయన హత్య జరిగిన తీరును జగన్మోహన్ రెడ్డి వర్ణించిన విధానం అనిర్వచనీయం అన్నారు.

జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను యధావిధిగా వివేకం సినిమా చూపెట్టారని గుర్తు చేశారు. ఒక సంఘటనను పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయకముందే, జగన్మోహన్ రెడ్డి దాని గురించి అంత చక్కగా వివరించారంటే… గతంలో నేను చెప్పినట్లుగా ఒకచోట జరిగిన సంఘటనను ప్రత్యక్షంగా చూడకపోయినా, చెప్పగలిగే శక్తి భారతంలో సంజయుడు కి ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నదేమోనని ఎద్దేవా చేశారు.

భగవద్గీత గురించి కూడా కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళున్న సంజయుడు చెబితేనే రాసినట్లుగా వ్యాసుడి భారతం లో ఉన్నదన్నారు. జివిడి కృష్ణమోహన్ రాసిస్తే స్క్రిప్టు చదివినట్లుగా నేను చదవడం లేదని, నాకు చిన్ననాటి నుంచి రామాయణం, భారతం చదివి సముపార్జించిన జ్ఞానంతోనే మాట్లాడుతున్నానని తెలిపారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్యను నారాసుర రక్త చరిత్ర అని రాసి ఎవరిపైకో తోయాలని చూశారు. చివరకు కూతురు అల్లుడే హత్య చేశారని, చనిపోయిన వివేకానందరెడ్డికి అక్రమ సంబంధం ఉన్నదని, రకరకాలుగా కేసును డైవర్ట్ చేయడానికి సాక్షి దినపత్రిక చేయని ప్రయత్నమంటూ లేదన్నారు.

ఒకటే గులకరాయి జగన్మోహన్ రెడ్డికి, వెల్లంపల్లికి ఎలా తగిలింది?
ఒకటే గులకరాయి జగన్మోహన్ రెడ్డి నుదురుకు, వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి ఎలా తగిలిందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. కురుక్షేత్రంలో అర్జునుడు బాణాలు వేస్తే డోంట్ కేర్ అన్నట్లుగానే, నా మీదకు శత్రువులంతా కలిసికట్టుగా వచ్చి, ఒంటరిని చేసి పంగళి కర్రతో రాయి వేసి కొడితే నేను భయపడతానా? నా వెనుక ప్రజలు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

నుదుటన చిన్నగా గీరుకపోతే 16 మంది వైద్యులు, 26 మంది నర్సుల బృందం చేత, ఒళ్లంతా గుడ్డలు కట్టించుకోవలసిన అవసరం ఉందా అని ప్రశ్నించిన ఆయన, ఆ తరువాత చిన్న ప్లాస్టర్ వేసుకుని చిక్కటి చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారన్నారు. జోగి రమేష్ అనే పనికిమాలిన వెధవ, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పై దాడి చేయడానికి వెళ్లి, వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినట్లుగా గతంలో చెప్పాడని గుర్తు చేశారు.

అలాగే అసెంబ్లీలో నన్ను లుచ్చా అంటే అచ్చా నువ్వు నాకు నచ్చావ్ అని జగన్మోహన్ రెడ్డి, వాడికి మంత్రి పదవి ఇచ్చారన్నారు. అటువంటి వాడిని సౌమ్యుడని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు. రాయలసీమలో ఐదు సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యేను పాపం పేదవాడు సపోర్ట్ చేయమని ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో, అలాగే ఇక్కడ కూడా సౌమ్యుడు, మంచివాడు, చక్కగా మాట్లాడుతాడు అంటూ తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి జగన్మోహన్ రెడ్డి వివరించడం విడ్డూరంగా ఉందన్నారు.

జగన్మోహన్ రెడ్డికి, వెల్లంపల్లి శ్రీనివాస్ కు కలిసి తగిలిన రాయి, ఇంతవరకు దొరకలేదు. అది డ్రామా అని అందరికీ తెలుసు. పంగళి కర్రతో గురి చూసి కొట్టిన రాయి, జగన్మోహన్ రెడ్డి నుదురుకు తగిలిన తర్వాత వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ కంట్లో తగిలిందని చెబుతుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఒకటే రాయి ఒకరికి తగిలిన తర్వాత కింద పడుకుండా, ప్రయాణం చేస్తూ వెళ్లి మరొకరికి తగులుతుందా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

రాయి తగిలిన చోట ఒక గుంట లా ఏర్పడి, చుట్టూ ఉన్న ప్రాంతం కమిలిపోతుందని పలువురు వైద్యులతో మాట్లాడితే చెప్పారు. అంతేకానీ ఒకరికి తగిలిన రాయి వెళ్లి మరొకరి కంట్లో తగలదన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అసలు జరిగింది ఏమిటంటే…పెద్ద పెద్ద పూల దండలకు వై ఆకారం లో ఉండే వైర్లను చూడుతారని, దండ వేసే సమయంలో ఆ వైరు నుదురుకు గీరుకుపోయి ఉండవచ్చునని అన్నారు.

అది గుచ్చుకున్న గుచ్చుకోకపోయినా ఆ సమయంలో లైట్లు తీసివేసి, స్టోన్ డ్రామా క్రియేట్ చేయడానికి ముందే పథకం సిద్ధం చేసుకుని ఉంటారు. కోడి కత్తి డ్రామా మాదిరిగానే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా నటించారు. ఇక వెల్లంపల్లి శ్రీనివాస్ నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని, తనకు ఎంతో కొంత సానుభూతి లభించాలన్న ఉద్దేశంతో, కంట్లో రాయి తగిలిందని నటించడం మొదలు పెట్టారన్నారు.

కన్నుకు దెబ్బ తగిలిందని వెల్లంపల్లి శ్రీనివాస్ ను పరామర్శించడానికి వెళ్ళిన వారు బయటకు వచ్చిన తర్వాత వారిలో వారే నవ్వుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం జరిగితే సినిమా నటులు కనీసం ఆయన్ని పరామర్శించలేదని, పనులు ఉంటేనే వారు వస్తారని ఒక సీనియర్ జ (ఎ)ర్నలిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.

సినిమా నటులు పొద్దున లేస్తే చేసేది
యాక్టింగ్ అని, వారికి మామూలు వారు చేసే యాక్టింగ్ ఈజీగా అర్థమవుతుందన్నారు. అటువంటి యాక్టింగ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని పలకరిస్తే దరిద్రంగా ఉంటుందని, సానుభూతి తెలియజేసి ఉండరని ఎద్దేవా చేశారు . ఎవరైనా తమని తాము కొట్టుకుంటారా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని, వీళ్ళు నిజంగా కొట్టుకోలేదని, గుళికరాయి స్టోరీ అల్లారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

పంగళి కర్ర తో కొడితే ఒకే డైరెక్షన్లో వెళ్లి రాయి తగులుతుందని, అంతేకానీ ఒకరికి తగిలిన రాయి, మరొకరికి తగలదని గుర్తు చేశారు. డివిడి కృష్ణమోహన్ ముందుగా రాసిచ్చిన కురుక్షేత్రంలో అర్జునుడి స్క్రిప్ట్ ప్రకారం….గులకరాయి డ్రామాను పండించాలని చూశారని, కానీ అడ్డంగా దొరికిపోయారన్నారు. ప్రజలందరినీ కృష్ణులని చెప్పి తనకు తానుగా అర్జునుడిని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి క్రైస్తవుడని గుర్తు చేశారు.

క్రైస్తవ మతం ప్రపంచంలోనే గొప్ప మతాలలో ఒకటని పేర్కొన్నారు. బైబిల్ లో క్రీస్తుకు ముందు సైతాన్ అనే పాత్ర ఉంటుందన్నారు. దేవదూత అయిన సైతాన్ పాత్రధారి, ఆ తరువాత నిత్య అకృత్యాలకు పాల్పడుతుంటాడ , అందుకే అతని నెత్తిన కొమ్ములు, తోక పెట్టారని తెలిపారు. క్రీస్తును నమ్మే వారంతా సైతాన్ ను నమ్ముతారని తెలిపారు.

భారతంలోని అర్జునుడు కాదు… బైబిల్ లోని సైతాన్ జగన్మోహన్ రెడ్డి
భారతంలోని అర్జునుడు కాదని, బైబిల్ లోని సైతాన్ జగన్మోహన్ రెడ్డి అని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి భారతంలో అర్జునుడు కాదని, బైబిల్లోని సైతాన్ అని ప్రజలు గుర్తించారన్నారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషి ఈ విషయాన్ని నాకు చెప్పారన్నారు.

మే 13వ తేదీన మీకు ఓటు వేసి తిరిగి ఆస్ట్రేలియా వెళ్తాను రాజుగారు అని చెప్పారన్నారు. మే 14 న నా పుట్టిన రోజని, జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించిన రోజని… ఆరోజు కాకుండా మే 15 16వ తేదీ లో వెళ్లాలని నేను ఆయన్ని కోరడం జరిగిందన్నారు.

జగన్మోహన్ రెడ్డి పై జనం కోపంగా ఉన్నారని, జనం చివరకు దేశాన్ని వీడి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారన్నారు. ఈ సైతాన్ ను చూసి ఎంతో కోపంగా ఉన్నారని, ఈ దరిద్రాన్ని వదిలించుకుందామని జనం
ఎదురు చూస్తున్నారన్నారు. అయినా ప్రజలకు మాయ మాటలు చెప్పి తాను సంపాదించుకున్న లక్షల కోట్ల రూపాయల అక్రమ సంపాదనను ఎక్కడికక్కడ నిల్వ చేశారని, ఓటుకు 5000 రూపాయలు తక్కువ కాకుండా ఇచ్చి కొనుగోలు చేయాలని చూస్తున్నారన్నారు.

జగన్మోహన్ రెడ్డి భీమవరం వస్తున్నారని, ఈ సందర్భంగా రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్లను నరికించి వేశారని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు . వృక్ష హంతకుడిని, రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టిన వాడికి ప్రజలు ఓటు వేయవద్దని రఘురామకృష్ణం రాజు కోరారు.

లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని తనపైనున్న 36 కేసులు గురించి… ఇటీవల చేసిన హత్య గురించి మాట్లాడకుండా… ఇతరులపై బురద చల్లుతారా?
లక్షల కోట్ల ప్రజల సొమ్ములు తినేసి, 36 కేసులు ఉన్న వారు ఇతరులపై బురద జల్లడం ఏమిటని రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు , తన పైనున్న 36 కేసుల గురించి మాట్లాడకుండా, నిన్న గాక మొన్న హత్య చేసి , ఆ హత్య గురించి మాట్లాడకుండా ఇతరుల గురించి సాక్షి దినపత్రికలో తప్పుడు కథనం రాయడం ఏమిటంటూ మండిపడ్డారు.

ఇవాళ సాక్షి దినపత్రికలో నా గురించి రాసిన కథనంలో ఈ డి ఇచ్చిన నోటీసులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్న విషయాన్ని ప్రస్తావించలేదన్నారు . గతంలోనూ సాక్షి దినపత్రిక ఇదే విధంగా వ్యవహరించిందని పేర్కొన్న ఆయన, ఈ డి నోటీసుల పై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఒక్కసారి కూడా స్టే ఇచ్చినట్లుగా రాయలేదన్నారు. డాక్టర్ సునీత రెడ్డి ప్రెస్ మీట్ ను అన్ని దినపత్రికలు కవర్ చేస్తే, సాక్షి దినపత్రికలో అక్షరం ముక్క కూడా రాయలేదని, ఇదెక్కడి ద్వంద వైఖరి అంటూ నిలదీశారు.

నాపై ఫస్ట్ పేజీలో, ఆ తరువాతి పేజీ లో పెద్ద కథనాన్ని రాసి, ఈ డీ ఇచ్చిన నోటీసులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం గురించి ఎందుకు రాయవు రా జగన్మోహన్ రెడ్డి అని రఘురామ కృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు. సమాచార లోపం వల్లే ఈ డి తనకు నోటీసుల ఇచ్చిందన్న ఆయన, న్యాయం నా పక్కన ఉన్నది కాబట్టే, సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.

మన్యం వీరుడు అల్లూరి అయితే… మద్యం వీరుడు జగన్మోహన్ రెడ్డి
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అయితే మద్యం వీరుడు జగన్మోహన్ రెడ్డి అని రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి, నాణ్యత తగ్గించి, ధరలను మూడు రేట్లు పెంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల రక్త మాంసాలను దోచుకు తింటున్నారన్నారు. కేవలం తన సంక్షేమం, తన ఇద్దరు కూతుళ్ళ సంక్షేమం కోసం ప్రజల రక్తపు కూడు అలవాటు పడ్డారని, అడ్డగోలుగా దోచుకు తింటున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

Leave a Reply