Suryaa.co.in

Features

వృక్ష విచిత్రములు-అంటు కట్టడం ద్వారా విచిత్రాలు సృష్టించుట

మామిడి టెంక నాటిన పిదప మొలచిన మొక్క జానెడు వరకు పెరిగిన పిదప చిగురు కత్తిరించిన యెడల నాలుగైదు కొమ్మలు పుట్టి పెరుగును. ఆ కొమ్మలు వ్రేళ్ళు వలె పెరిగిన పిమ్మట నాలుగు కొమ్మలకు నాలుగు జాతుల అంటు మామిడి అంట్లు కట్టిన నాలుగు వైపులా నాలుగు రంగుల కాయలు కాచును.
పనస మొక్కకు మామిడి కొమ్మ కట్టి నాటిన మొదటను పనస కాయలును, కొమ్మలకు మామిడి కాయలను కాయును .
నేరేడు మొక్క యెక్క కొమ్మకు గులాబి, జామ, అంటును కట్టవచ్చు.
నిమ్మ , దబ్బ , కమలా, నారింజ, ఈ జాతులు ఒక జాతి మొక్కకు అన్ని జాతుల మొక్కలు అంట్లు కట్టవచ్చును.
పాల మొక్కకు సపోటా, పనస అంటు కట్టవచ్చును.
పొగాకుకు , గరుడ వాహన , జాజికి చమెలి, గులాభికి పల్ల సంపెంగి , మాలతికి సాంబ్రాణి అంట్లు కట్టవచ్చు.
మల్లె చెట్టు దగ్గర నొక యెర్ర బాడిధ కొమ్మను పాతి ఆ కొమ్మ చిగిర్చిన పిదప అడ్డగముగా నొక రంధ్రము చేసి ఆ రంధ్రములో నుండి ఒక మల్లె కొమ్మని తీసి పేడ మన్ను ఆ రంధ్రముని గప్పి నీళ్లు పోయుచుండిన కొంతకాలానికి ఆ రంద్రములో గల కొమ్మకి వేర్లు వచ్చును. పిమ్మట ఆ కొమ్మని మొదటకి కోసి నాటిన మంకెన ( బాడిధ ) పువ్వులు పూయును.
పొగడ చెట్టు కొమ్మకు సంపెంగ మొక్కకు అంటు కట్టిన ఒక పక్క పొగడ పువ్వులు , ఇంకో పక్క సంపెంగ పువ్వులు పూయును.
సూర్య కాంత ( sunflower ) గింజలు పాలలొ 7 మార్లు నానవేసి ఎండబెట్టి నాటి రోజు పాలతో తడుపు చుండిన తెల్లని పువ్వులు పూయును.
ఎర్ర గన్నేరుకు , తెల్ల గన్నేరుకు అంటు కట్టిన రెండు రకాల పువులు పూయును.
గమనిక –
నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే. ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

LEAVE A RESPONSE