-బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చారు..అక్రమం కాదా?
-ఏడు హైడ్రో పవర్ ప్రాజెక్టులిచ్చారు..
-పాడేరు సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి
గిరిజనులను దారుణంగా మోసగించి బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చారని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి అన్నారు. పాడేరులో శనివారం భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిం చారు. వైఎస్‌కు గిరిజనులు అంటే చెప్పలేని ప్రేమ. 20 లక్షల ఎకరాల్లో పొడు పట్టాలు ఇచ్చారు. గిరిజన బిడ్డలకు విద్యా అవకాశాలు కల్పించారు. వైద్య అవకాశాలు కల్పించారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో ప్రజా అభిప్రాయం గౌరవించారు. వద్దు అంటే వదిలేశారు. ఇప్పుడు జగన్ అక్రమంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. అదానీ లాంటి వాళ్లకు 7 హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌లకు అనుమతి ఇచ్చారు. ఇది అక్రమం కాదా అని అడుగుతున్నాం. గిరిజనులను దారుణంగా మోసం వేశారు. కనీసం లోన్లు కూడా ఇవ్వలేదని వ్యాఖ్యా నించారు. గిరిజన యూనివర్సిటీకి దిక్కులేదు. ఈనాటికీ వైఎస్ వేసిన రోడ్లే దిక్కు. ఇంజనీరిం గ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అని చెప్పి మోసగించాడు. కనీసం 45 ఏళ్లకే పెన్షన్ పథకం ఎంతమందికి ఇస్తున్నారో తెలియదు. 500 దాటినా గూడెంలను గ్రామపంచాయతీ చేస్తామని మరిచారు. గత 10 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి జరిగింది లేదన్నారు.
చెరుకు రైతులను మోసగించారు
పాయకరావుపేటలో ఎమ్మెల్యే ఉన్నా లేనట్లే అంట కదా. ఈయనతో కాదని వేరే నియోజకవర్గం నుంచి తెచ్చారట కదా. అక్కడ పనికి రాని చెత్త ఇక్కడ పడేశారు. వీళ్లతో ఏమైనా ఉపయోగం ఉందా? నియోజకవర్గంలో ఒక్క హామీ నెరవేరలేదు. షుగర్ ఫ్యాక్టరీలు బంద్ పెట్టారు. ఆదుకుంటామని మోసం చేశారు. కార్మికులను రోడ్డున పడేశారు. చెరుకు రైతుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. ఇక్కడ రెండు పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. అందులో ఒక్కరూ కూడా స్థానికులు లేరట. కనీసం ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పించే దిక్కులేదని మండిపడ్డారు