కేసీఆర్‌ను టచ్ చేస్తే మాడి మసైపోతారు జాగ్రత్త!

-జైలుకు పంపిస్తే మోదీ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూస్తాం
– బీజేపీపై టీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి ఫైర్
బీజేపీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు బాసటగా నిలిచారు. కేసీఆర్‌ను టచ్ చేసి చూడండి. మాడి మసైపోతారని వార్నింగ్ ఇచ్చారు.
ఎవ్వరికీ పైసాకు అక్కరకు రాని పార్టీ బీజేపీ . బీజేపీ నేతలు దళిత బంధు కోసం డప్పులు కొట్టడం దురదృష్టకరమన్నారు. బండి సంజయ్ దళిత బంధు వద్దని డప్పు కొడుతున్నట్లుగా ఉందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా దళిత బంధు ఉందా? . బుద్దిలేకుండా కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం బీజేపీ గారడి వేషాలు మానుకోవాలని హితవుపలికారు. దళిత బంధు రాకుండా కుట్రలు చేస్తున్నారని..దీన్ని ఖండిస్తున్నానన్నారు.
దళితులకు అడ్డం వస్తే పడేసి తంతారని హెచ్చరించారు. బీజేపీ వాళ్లు పిచ్చికుక్కల్లా అరుస్తున్నారని… సిగ్గులేకుండా తమ కులం వెంబడిపడి కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు వచ్చిందో లేదో వాసాల మర్రికి వెలుదాం రండి అని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం తమలాంటి వారివల్లే పడిపోతుందన్నారు. మోడీ పాలనలో సచ్చే కాలం వచ్చిందన్నారు. కేసీఆర్‌ను జైల్‌కు పంపితే మోడీ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూస్తామని అన్నారు.