– తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. వి సుభాష్
పాలమూరును పచ్చగ చేస్తాం అన్న కేసీఆర్… ఇక్కడి ప్రజలను నమ్మించి మోసం చేశారు. బండి సంజయ్ పాదయాత్ర ఎక్కడికైతే వస్తుందో… అక్కడికి ఒక రోజు ముందు, లేదంటే తర్వాత… ఆ నలుగురు మాట్లాడుతున్నారు. పొలిటికల్ స్పేస్ లేకుండా చేసేందుకే… చేసిన ప్రారంభోత్సవాలనే మళ్లీ మళ్ళీ చేస్తున్నారు. Trs నేతల తీరు చూస్తే… వింతగా అనిపిస్తోంది.
‘అమిత్ షా’ వస్తున్నారు అంటేనే… trs నేతలకు తమది మూడు నాళ్ళ ముచ్చటే అని తెలిసిపోయింది. పూటకో వేషం, రోజుకో మాట చెబుతున్నారు.. అయినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేటీఆర్ తన అయ్య భూస్వామి అని అంటున్నారు.అంటే… అప్పటి నుంచే వాళ్ళతో సత్సంబంధాలు కేసీఆర్ ఫ్యామిలీ కి ఉన్నాయి. నిజాం నవాబ్ కు సలాం కొట్టుకుంటూ ఫ్యామిలీ అంతా ఉంటుంది. మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు గారు 800 ఎకరాలను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. పేదలకు ఇచ్చిన ఆ భూములను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పేరుతో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
పాలమూరు కు నీళ్లు రాకుండా చేసిన దోషి కేసీఆర్.. నీళ్లిస్తే… వ్యవసాయం చేస్తారని ఇవ్వకుండా వివక్ష చూపించారు. నీళ్లు లేకపోతే… భూములు ఎండిపోయి ప్రజలు వలసలు వెళ్తారని… తద్వారా తక్కువ రేటుకు భూములు కొని, రియల్ ఎస్టేట్ చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన. ఈనెల 14న తుక్కుగూడలో అమిత్ షా సభ.