– ఎన్వీ సుభాష్, బిజెపి, రాష్ట్ర అధికార ప్రతినిధి
మునుగోడులో మునుగుడు ఖాయం అని టీఆర్ఎస్ కు ముందే అర్ధమైనట్టుంది. అందుకే అర్ధం పర్ధం లేని మాటలతో ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయినా…కేసీఆర్ సర్కార్, టీఆర్ ఎస్ నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు అధికార వ్యామోహ మత్తులో జోగుతున్నారు.
అధికారం, అహంకారం నెత్తికెక్కి బిజెపికి పెరుగుతున్న ప్రజాదరణ కూడా చూడలేక పోతున్న కబోదులు వాళ్లు. బండి యాత్ర ను తుస్సు అంటూ కామెంట్ చేసిన ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ యెగ్గ మల్లేశం కళ్లుండి చూపులేని కబోదులే.టీఆర్ ఎస్ నేతలు ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి చెప్పి… దాన్ని నిజం చేయాలని చూసే మూర్ఖులు.
బిజెపి యాత్రల సక్సెస్ ను చూసి ఓర్వలేకనే అసత్యాలను ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్.
వచ్చే ఎన్నికల్లో ఓటమి ని టీఆర్ఎస్ నేతలు ఇపుడే గుర్తించి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. హుజురాబాద్ ఫలితాలే మునుగోడులో పునరావృతం అవుతాయన్న విషయం టిఆర్ఎస్ నేతలకు
ఇప్పటికే అర్ధం అయి…ఒక్కొక్కరి మైండ్ బ్లాంకై మతి చెడి టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.
తెలంగాణ ప్రజలకు కావాల్సింది పురస్కారాలు, అవార్డులు కావు, వారి సమస్యలను పరిష్కరించి వారి బతుకులను బాగు చేసే పాలకులు రావాలని ప్రజలు కోరుకుంటునన్నారనే విషయాన్ని గురర్తుంచుకోవాలి. లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నాం.