ప్రగతికి ప్రతిరూపం కుప్పం… పులివెందులలో ఏముంది?

(రామ్మోహన్, జర్నలిస్టు )

కుప్పంను పులివెందుల చేస్తానంటూ సీఎం జగన్ చెప్పారు. అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న కుప్పంను వెనుకబడ్డ పులివెందుల చేస్తాననడం ఏమిటి? పులివెందుల అద్భుతంగా ఉందని అలాగే అభివృద్ధి చేస్తానంటూ అబద్దాలు చెప్పి కుప్పం ప్రజలకు ఆశలు కల్పించడమా? నిత్యం పనిచేసుకునే కుప్పం ప్రజలు, పులివెందుల వెళ్లి అభివృద్ధి ఎలా జరిగిందో చూసి రారు కదా? అబద్ధం చెప్పినా పోయేదేముందిలెమ్మన్న ధీమానా? ఏమో? .

చంద్రబాబు మారుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. అక్కడి వ్యవసాయరంగ ప్రగతి చూసి తీరవలసిందే. ఇజ్రాయిల్ టెక్నాలజీ పూతోటలతో సుందరమైన ప్రదేశాలు…గుంతలు మచ్చుకైనా కానరాని అద్భుతమైన నున్నటి రోడ్లు.. మెడికల్ కాలేజీ కుప్పం అభివృద్ధికి చిహ్నాలు. అక్కడి ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలకు లోటు లేదు. వాటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం అక్కడి ప్రజలకు లేదు. కుప్పంలో ఉపాధి అవకాశాలు పెంచడానికి చంద్రబాబు పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకు వచ్చారు .

సమీప బెంగళూరులో ఉద్యోగాలు ఉన్నవారు అప్ అండ్ డౌన్ చేసేలా రైలు, బస్సు సౌకర్యాలను కూడా చంద్రబాబు ఏర్పాటు చేయించగలిగారు. కుప్పం ప్రజల జీవన ప్రమాణాలు ఎలా చూసినా బాగా మెరుగుపడ్డాయి. ఇది కళ్ల ముందు కనిపించే నిజం. మరి పులివెందులలో పరిస్థితి ఎలా ఉంది ? కుప్పంలో చంద్రబాబు కంటే ఎక్కువగా పులివెందులలో వైఎస్ కుటుంబం పట్టు సాధించింది. ఆ కుటుంబమే పెత్తనం చేస్తూ వస్తోంది. మరి పులివెందులలో ఏం సౌకర్యాలు ఉన్నాయి ? ఎలాంటి అభివృద్ధి జరిగింది.

కుప్పంలో జమానా కిందటే మంచి బస్టాండ్ ఉంది. కానీ పులివెందులలో ఇప్పటికీ బస్టాండ్ లేదు. కడతామని విమానం ఆకారంలో ఉండే గ్రాఫిక్స్ ను సీఎం జగన్ విడుదల చేసి నాలుగేళ్లవుతోంది. కానీ సగం కూడా పూర్తి కాలేదు. జమానా కిందటే కుప్పానికి మెడికల్ కాలేజీ వచ్చింది. ఇప్పుడే పులివెందులలో పునాదులు పడ్డాయి. మారుమూల ప్రాంతమైనప్పటికీ కుప్పంలో మంచి ఇంజినీరింగ్ కాలేజీలు. ఆస్పత్రులు.. పరిశ్రమలు ఉన్నాయి. పులివెందులలో అడుగడుగునా వైఎస్ ప్యామిలీ ప్యాలెస్‌లు ఉన్నాయి. అదే అభివృద్ధి ! సీఎంగా బిజీగా ఉండే చంద్రబాబు కుప్పంలో ప్యాలెస్ కట్టుకోలేకపోయారు. కానీ వైఎస్ ఫ్యామిలీ మాత్రం ఇడుపుల పాయలో ప్రారంభించి కడప వరకూ అనేక చోట్ల ప్యాలెస్ లను నిర్మించుకున్నారు.

చంద్రబాబు చేయలేకపోయిన అభివృద్ధి.. వైఎస్ కుటుంబం చేసుకున్న అభివృద్ధి అదొక్కటే. కుప్పంలో ప్రజలకు మేలు జరిగితే.. పులివెందులలో వైఎస్ కుటుంబం మాత్రమే బాగుపడింది.

Leave a Reply