-ఉత్తరాంధ్రలో మూడున్నరేళ్లుగా దోచుకున్న దానిలో వాటాలు పంచుకునేందుకు ఈ సమావేశం
– టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు
నేడు విశాఖలో జరిగేది రౌండ్ టేబుల్ సమావేశం కాదు, వైసీపీ దొంగల ముఠా సర్వ సభ్య సమావేశం. వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలో మూడున్నరేళ్లుగా దోచుకున్న దానిలో వాటాలు పంచుకునేందుకే ఈ సమావేశం పెట్టుకున్నారు. లేకుంటే అధికార పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏంటి ? రాష్ట్ర ప్రజలు, అన్ని పార్టీలు చివరకు వైసీపీ నేతలు కూడా అమరావతే రాజధాని గా కావాలంటున్నారు.గుడివాడ అమర్నాధ్ తన మంత్రి పదవి పోతుందేమోనన్న భయంతో వణికిపోతున్నారు. జగన్ రెడ్డి కి భయపడి కొంతమంది వైసీపీ నేతలు 3 రాజధానులకు మద్దతిస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీలోని కొంతమంది నేతలు తప్ప ప్రజా సంఘాలు, ప్రజలు ఎవరూ పాల్గొనడం లేదు. అమరావతి రాజధాని అయితేనే ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.తమ స్వార్థం కోసం ప్రజల మధ్య ప్రాంతీయ చిచ్చు పెట్టాలన్న జగన్ రెడ్డి కుట్రలో భాగస్వాములైన వైసీపీ నేతలు చరిత్రలో ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగులుతారు.