Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాస్ పోర్ట్ సీజ్

టీటీడీ లో చాలా లెక్కలు తేలాల్సి ఉంది..
పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు ఇవ్వండి..
తిరుమల టోల్ గేట్ వద్ద నిఘా పెట్టండి..
జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్

తిరుపతి: టి.టి.డి. ఈఓ ధర్మారెడ్డి పాస్పోర్ట్ ను వెంటనే సీజ్ చేయాలని, తిరుమల తిరుపతి దేవస్థానములు ఈఓ గా గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అర్హత లేకపోయినా, ఐ.ఏ.ఎస్. కాకపోయినా, గత అధికార పార్టీ అండదండలతో తి.తి.దే. తిరుమలలో ఈఓ గా వుండి అనేక అవినీతి కార్యక్రమాలకు ఈవో ధర్మారెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు.

తిరుమలలో స్వామివారి నగలు, ఆభరణాలు, శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన ఎన్నో అవినీతి కుంభకోణాలు చేసి, టీటీడీ నిధులలో ఎన్నో గోల్మాల్ చేసి, భక్తులు శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకలపై సరైన లెక్కలు చూపకుండా.. ఈరోజు ప్రభుత్వం మారగానే సెలవు పెట్టి దేశం వదిలి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని.. తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ “కిరణ్ రాయల్” గురువారం స్థానిక పద్మావతి పురంలోని సిఐడి ఆఫీసు నందు ఫిర్యాదు చేశారు.

ధర్మారెడ్డి అవినీతి లెక్కలు చాలా తేలాల్సి ఉందని, ఆయన విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని, టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాస్ పోర్ట్ సీజ్ చేసి, లుక్ అవుట్ నోటీసులు ఇవ్వాలని, తిరుమల టోల్ గేట్ వద్ద నిఘా పెట్టాలని.. జనసేన నేతలు రాజారెడ్డి, సుభాషిని, సుమన్ బాబు మునస్వామి, కిషోర్, ఆది, సాయి, పురుషోత్తం, రాజేంద్ర, సిద్దు తదితరులతో కలిసి మీడియా ముఖంగా కిరణ్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE