Suryaa.co.in

Andhra Pradesh Telangana

తెలంగాణ ఎమ్మెల్యే, ఎంపీలకు టీటీడీ గుడ్‌న్యూస్

  • తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు వారానికి 4 సిఫార్సు లేఖలు
  • వారానికి రెండు బ్రేక్ దర్శనాలతో పాటు మరో రెండు 300 రూపాయల దర్శనాలు

విజయవాడ: తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్. తెలంగాణ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చల్లటి కబురు అందించారు. తిరుమల దర్శనానికి వచ్చే తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు రావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు.

సీఎం చంద్రబాబుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలకు వారానికి 4 సిఫార్సు లేఖలను అంగీకరించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు.
ఇందులో వారానికి రెండు బ్రేక్ దర్శనాలతో పాటు, మరో రెండు 300 రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.

LEAVE A RESPONSE